116
మరునాడు ఉదయం 10 గంటల కల్లా మేము ఖరీదు చేసిన మొక్కలను, ఆ నర్సరీ యజమానులు పకడ్బందీగా ప్యాకింగ్ చేసి, వారి వాహనంలోనే మా సంస్థకు చేర్చారు. అప్పటికే మా తోటమాలి తన సహాయకులతో తయారుగా వున్నాడు. మొక్కలను మా సంస్థకు తెచ్చిన వ్యక్తి, ఆ రోజు సాయంత్రం వరకు మాతోనే వుండి, మా తోటమాలికి, మొక్కలు నాటడంలో సహాయపడ్డాడు. ఏ మొక్కలను ఎక్కడ నాటితో బాగుంటుందో, ఎలా నాటాలో, అనే విషయాలపై మంచి సలహాలను కూడా ఇచ్చి సాయంత్రానికి వెనుదిరిగాడు. ఇక మా వాళ్ళు, మరో మూడు రోజుల్లో తెచ్చిన మొక్కలన్నింటినీ, నాటే కార్యక్రమం ముగించారు.
***
రోజులు గడుస్తున్నాయి. పూల మొక్కలు, పండ్ల మొక్కలు, ఆకుకూరల మొక్కలు, కూరగాయల మొక్కలు ఆరోగ్యంగా, ఏపుగా పెరుగుతూ, రోజు రోజుకీ కొత్త అందాలను సంతరించుకుంటున్నాయి. వాటిని అలా రోజూ చూస్తూ అక్కడ తిరుగుతుంటే కలిగే ఆనందాన్ని వర్ణించడానికి మాటలు చాలవు.
117
అధిక పాల దిగుబడితో, గ్రామీణ ప్రజల దినసరి రాబడి పెంచేందుకు, సంక్షేమ పథకాల ద్వారా బ్యాంకులు అందించే ఋణాలతో, సంకర జాతి ఆవులను కొనిస్తుంది ప్రభుత్వం. అవి సాధారణ ఆవుల కంటే… దాదాపు ఏడెనిమిది రెట్లు అధికంగా పాలిస్తాయి. కానీ ఆ సంకర జాతి ఆవుల పెంపకంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వాటి పోషణ, సంరక్షణ విషయాల్లో అత్యంత శ్రద్ధ వహించాలి. ఆ విషయాలన్నీ లబ్ధిదారులకు ముందుగానే తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా వుంది. లేకపోతే లబ్ధిదారులు ఆశించిన ఫలితాలను సాధించలేకపోవడం అటుంచి, విపరీతంగా నష్టపోయే ప్రమాదం వుంది. ఆ విషయాలను దృష్టిలో వుంచుకుని, ఆంధ్రా బ్యాంకు లబ్ధిదారుల ప్రయోజనార్థం ‘సంకర జాతి ఆవుల పెంపకం’ పై ఓ ప్రత్యేకమైన శిక్షణా కార్యక్రమం, మా సంస్థలో నిర్వహించాము. ఆ శిక్షణా కార్యక్రమ నిర్వహణలో జిల్లా పశువర్ధక శాఖ వైద్యులు మరియు ఇతర అధికారుల సహకారాన్ని కూడా తీసుకున్నాము.
ఆ శిక్షణా కార్యక్రమం జరిగే సమయంలోనే, ఆంధ్రా బ్యాంకు విశాఖపట్టణం జోన్ సందర్శనార్థం, విశాఖపట్టణానికి విచ్చేసిన ఆంధ్రా బ్యాంకు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ శ్రీ. కె. ఆర్. నాయక్ గారు, జోనల్ మేనేజర్ శ్రీ గుర్రాల వెంకటేశ్వరరావు గారితో కలిసి, మా సంస్థను కూడా సందర్శించారు. శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న లబ్ధిదారులతో కొద్ది సేపు ముచ్చటించారు. ఆ తరువాత సంకర జాతి ఆవులతో, లబ్ధిదారులతో కలిసి ఫోటోలు కూడా దిగారు.


‘సంకర జాతి ఆవుల పెంపకం’ పై శిక్షణ – వేదికపైన ఎడమ నుండి కుడికి… రచయిత, ఆంధ్రా బ్యాంకు విశాఖపట్టణం జోనల్ మేనేజర్ శ్రీ గుర్రాల వెంకటేశ్వరరావు గారు, శిక్షణలో పాల్గొన్న లబ్ధిదారుల నుద్దేశించి ప్రసంగిస్తున్న ఆంధ్రా బ్యాంకు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ శ్రీ. కె. ఆర్. నాయక్ గారు, ఆంధ్రా బ్యాంకు జనరల్ మేనేజర్ శ్రీ ఆర్. శంకరన్ గారు.


సంకర జాతి ఆవులు, లబ్ధిదారులతో…. ఎడమ నుండి కుడికి… శ్రీ హరకృష్ణ గారు, రచయిత, శ్రీ గుర్రాల వెంకటేశ్వరరావు గారు, శ్రీ. కె. ఆర్. నాయక్ గారు, శ్రీ ఆర్. శంకరన్ గారు, శ్రీ జగన్నాధ రాజు గారు, శ్రీ శ్రీకాంత్ గారు.
***
అదే సమయంలో, మా సంస్థ పై అంతస్తులో, ఆంధ్రా బ్యాంకు – స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ డిపార్టుమెంటు వారి సహకారంతో, చిన్న పరిశ్రమలను స్థాపించబోయే ఔత్సాహికుల కొరకు మరో శిక్షణా కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నాము. మా సి.యమ్.డి. గారు ఆ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న లబ్ధిదారులతో కొంచెం సేపు ముచ్చటించి, వారితో కలిసి ఫోటోలు కూడా దిగారు.


‘చిన్న పరిశ్రమల స్థాపన’ పై నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న ఔత్సాహికులతో… వేదికపై… ఎడమ నుండి కుడికి… శ్రీ గుర్రాల వెంకటేశ్వరరావు గారు, శ్రీ. కె. ఆర్. నాయక్ గారు, శ్రీ ఆర్. శంకరన్ గారు, చివరన రచయిత.
***
ఇలాంటి మంచి శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నందుకు మా సి.యమ్.డి. గారు నన్ను, మా సిబ్బందిని అభినందించారు.
118
తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో వర్జీనియా పొగాకు పంటను చాలా మంది రైతులు సాగు చేస్తున్నారు.
పైగా, సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సి.టి.ఆర్.ఐ.) కూడా రాజమండ్రి లోనే నెలకొల్పబడింది. ఆ ఇన్స్టిట్యూట్ సహకారంతో, ఆంధ్రా బ్యాంకు ద్వారా, వర్జీనియా పొగాకు పంట సాగుకు ఋణాలు పొందిన కొంతమంది రైతులకు ‘వర్జీనియా పొగాకు సేద్యములో యాజమాన్య పద్ధతులు’ అనే అంశంపై శిక్షణా కార్యక్రమాన్ని మా సంస్థలో నిర్వహించాము.
మొదటి రోజు శిక్షణా కార్యక్రమాన్ని సి.టి.ఆర్.ఐ. డైరక్టర్ డా. యమ్.యస్. చారి గారు ప్రారంభించారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న రైతుల ఉత్సాహాన్ని చూసి ముచ్చటపడిన డైరక్టరు గారు, ఆ రోజంతా తామే స్వయంగా తరగతులను నిర్వహించారు.


‘వర్జీనియా పొగాకు సేద్యములో యాజమాన్య పద్ధతులు’ పై నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో తరగతులను నిర్వహిస్తున్న సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సి.టి.ఆర్.ఐ.) రాజమండ్రి డైరక్టర్ డా. యమ్.యస్. చారి గారు, ప్రక్కన రచయిత.
తదుపరి మూడు రోజుల్లో సి.టి.ఆర్.ఐ. నుండి వచ్చిన ఇద్దరు శాస్త్రజ్ఞులు, తరగతులను సమర్థవంతంగా నిర్వహించారు.
వర్జీనియా పొగాకు సేద్యంలోని మెళకువలను తెలుసుకున్న రైతులు, చాలా సంతోషించారు. నేర్చుకున్న విషయాలను అమలుపరిచి, పొగాకు సేద్యంలో అధిక దిగుబడి సాధించగలమనే నమ్మకం కలిగింది… ఆ రైతు సోదరులకు.
119
లేత్ మెషీన్ పై డ్రిల్లింగ్, టాపింగ్, గ్రైండింగ్ చేయడంలో అనుభవం చేయించడానికి కొంతమంది గ్రామీణ యువకులకు, మా సంస్థలో ఒక వర్క్‌షాపు నిర్వహించాము.
అందుకవసరమయే లేత్ మెషీన్‌ను, ఇతర సామగ్రిని మా సంస్థలోనే ఏర్పాటు చేసి, ఆ మెషీన్‌ను సమర్థవంతంగా నడపడంలో నిష్ణాతులైన సాంకేతిక నిపుణులతో శిక్షణ ఇప్పించాము.


లేత్ మెషీన్ పై డ్రిల్లింగ్, టాపింగ్ మరియు గ్రైండింగ్ చేయడంలో నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నవారితో… ఎడమ నుండి కుడికి… ఆంధ్రా బ్యాంకు మేనేజర్ శ్రీ సాంబమూర్తి గారు, శ్రీ జగన్నాధ రాజు గారు, రచయిత, శ్రీ హరకృష్ణ గారు.
శిక్షణలో మంచి నైప్యుణ్యతను ప్రదర్శించిన వారికి, వారి గ్రామాల్లోనే లేత్ మెషీన్ వర్క్‌షాపులను ఏర్పాటు చేసుకుని, జోవనోపాధి పొందడానికి అవసరమయ్యే ఋణాలను ఆంధ్రా బ్యాంకు శాఖల ద్వారా మంజూరు చేయించాము.
120
ఆ నెల వ్యవసాయ మాసపత్రికలో బాపట్ల హోమ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ (శ్రీమతి) విజయా ఖాదర్ గారు, పుట్టగొడుగుల పెంపకంపై వ్రాసిన వివరణాత్మక వ్యాసం చదవడం జరిగింది. పుట్టగొడుగులనేవి నిజానికి ఓ రకమైన ఫంగస్ మాత్రమే. పుట్టగొడుగులలో వున్న వివిధ పోషక పదార్థాలు, ఆరోగ్య పరిరక్షణలో వాటి ఆవశ్యకతను గురించి, ఆ వ్యాసంలో సవివరంగా తెలియజేయబడింది. మార్కెట్లో వాటికున్న గిరాకీని చూస్తే, పుట్టగొడుగుల పెంపకం ఓ లాభసాటి వ్యాపకంగా చెప్పుకోవచ్చు.
సాధారణ రైతులు, గృహిణులు సైతం పుట్టగొడుగులను చాలా సులభంగా తమ ఇళ్ళ వద్దనే అతి తక్కువ పెట్టుబడితో ఒక కుటీర పరిశ్రమలా చేపట్టి పెంచడానికి వీలవుతుందనియు, అలా పెంచే విధానాన్ని కూడా ఆ వ్యాసంలో తెలియజేశారు డాక్టర్ (శ్రీమతి) విజయా ఖాదర్ గారు.
ఆ వ్యాసాన్ని ఆసాంతం చదివిన నాకు, పుట్టగొడుగుల పెంపకం గ్రామీణ ప్రాంతంలోని మహిళలకు ఒక ఆధాయ వనరుగా ఉపయోగపడుతుందని… అనిపించింది.
అప్పుడే నాలో ఒక ఆలోచన మొదలైంది. దాని ఫలితమే మా సంస్థలో పుట్టగొడుగుల పెంపకంపై గ్రామీణ ప్రాంత మహిళలకు ఒక శిక్షణా కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించడం.
ఒకసారి గుంటూరు వెళ్ళినప్పుడు బాపట్ల వెళ్ళి డాక్టర్ (శ్రీమతి) విజయా ఖాదర్ గారిని కలిసి, మా సంస్థ గురించి, మా సంస్థ చేపడుతున్న శిక్షణా కార్యక్రమాల గురించి తెలియజేశాను. తెలుసుకుని చాలా సంతోషించారు డాక్టర్ (శ్రీమతి) విజయా ఖాదర్ గారు.
అప్పుడే వారిని, మా సంస్థను సందర్శించి, పుట్టగొడుగుల పెంపకంపై ఓ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించమని ఆహ్వానించాను. వారు నా ఆహ్వానాన్ని స్వీకరించి, అందులకు తనకేమీ అభ్యంతరం లేదని చెప్పారు. కాని తను రాజమండ్రి వచ్చి మా సంస్థలో శిక్షణా కార్యక్రమం నిర్వహించాలంటే, హైదరాబాద్ లోని ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క అనుమతి తప్పనిసరి అని చెప్పారు.
చేసేది లేక నిరాశతో వెనుదిరిగాను.
121
రాజమండ్రి వచ్చిన తరువాత, హైదరాబాద్ లోని ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపాను. ఎట్టకేలకు, నా ప్రయత్నాలు ఫలించి డాక్టర్ (శ్రీమతి) విజయా ఖాదర్ గారికి మా సంస్థను సందర్శించి, పుట్టగొడుగుల పెంపకంపై శిక్షణా కార్యక్రమం నిర్వహించేందుకు అనుమతి లభించింది.
పర్యవసానంగా, మా సంస్థలో మూడు రోజుల పాటు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో, గ్రామీణ ప్రాంతం నుండి విచ్చేసిన మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. విషయం తెలుసుకుని, ఆంధ్రా బ్యాంకు రాజమండ్రి శాఖల్లో పని చేస్తున్న కొంతమంది మహిళా సిబ్బంది కూడా స్వచ్ఛందంగా వచ్చి ఆ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు.


ఎడమ నుండి కుడికి… శ్రీ శ్రీకాంత్ గారు, శ్రీ జగన్నాధ రాజు గారు, రచయిత, శ్రీ హరకృష్ణ గారు. ఆంధ్రా బ్యాంకు, రాజమండ్రి, రీజినల్ మేనేజర్ శ్రీ వై. భాస్కరరావు గారు; బాపట్ల హోమ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ (శ్రీమతి) విజయా ఖాదర్ గారు మరియు ఆంధ్రా బ్యాంకు మహిళా సిబ్బంది.
మూడు రోజుల పాటు జరిగిన ఆ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న మహిళలందరికీ డాక్టర్ (శ్రీమతి) విజయా ఖాదర్ గారు, ఎంతో ఓపికతో, తనతో పాటు తెచ్చినటువంటి వివిధ దశలలో వున్న, వివిధ రకాలైన పుట్టగొడుగులను, ఇతర సామగ్రిని చూపిస్తూ పుట్టగొడుగుల పెంపకంపై అభ్యాసం చేయించారు.


‘పుట్టగొడుగుల పెంపకంపై శిక్షణా కార్యక్రమం’లో వేదికపై… ఎడమ నుండి కుడికి… రచయిత, శిక్షణనిస్తున్న బాపట్ల హోమ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ (శ్రీమతి) విజయా ఖాదర్ గారు, శ్రీ జగన్నాధ రాజు గారు.
శిక్షణలో పాల్గొన్న మహిళలందరూ, పుట్టగొడుగుల పెంపకాన్ని ఒక కుటీర పరిశ్రమలా ఎలా నిర్వహించాలో పరిపూర్ణంగా అర్థం చేసుకోగలిగారు. అందుల కవసరమయే వస్తువులు, సామగ్రి, ఫంగస్ ఎక్కడ దొరుకుతాయో కూడా తెలుసుకున్నారు.
పుట్టగొడుగుల పెంపకం తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు ఓ ఉత్తమ మార్గం అని, శిక్షణ పొందిన మహిళలందరికీ నమ్మకం కుదిరింది.
హోమ్ సైన్స్ కాలేజీకి ప్రిన్సిపాల్‌గా ఒక బాధ్యతాయుతమైన పదవిని నిర్వహిస్తూ, మా ఆహ్వానాన్ని మన్నించి, బాపట్ల నుండి రాజమండ్రి వచ్చి, మా సంస్థలో మూడు రోజుల పాటు పుట్టగొడుగుల పెంపకంపై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించి, గ్రామీణ మహిళల ఆదాయం పెంపుదలకు మార్గం సూచించిన డాక్టర్ (శ్రీమతి) విజయా ఖాదర్ గారికి, నేను, మా సిబ్బంది, శిక్షణలో పాల్గొన్న మహిళలు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఘనంగా వీడ్కోలు పలికాము.
(మళ్ళీ కలుద్దాం)

ఆంధ్రాబ్యాంకు లో ప్రాంతీయ అధికారి హోదా లో ఉద్యోగ విరమణ చేసిన తరువాత , తన కెంతో ఇష్టమైన రచనా వ్యాసంగాన్ని ఎంచుకొని , కథలు,నాటికలు,నవలలు వ్రాస్తూ ముందుకెళ్తున్నారు.
45 Comments
Sambasiva+Rao+Thota
Ee roju SANCHKA lo , nenu vraashina “NAA JEEVANA GAMANAMLO “ .42nd episode prachrinchinanduku , Editor Sri MuraliKrishna Gaariki,Sri Somashankar Gaariki , thadithara Sanchika Team Sabhylandariki , naa hrudayapoorvaka kruthajnathalu …
Mee
SAMBASIVA RAO THOTA
Sagar
ఎటువంటి కార్యక్రమానికైనా శిక్షణ అనేది ఎంత అవసరమో మీ రచన స్పష్టంగ తెలియచేస్తుంది సర్. మీరు చేపట్టే ప్రతీ కార్యక్రమంలోనూ శిక్షణ మరియు దాని ద్వారా పొందే ఫలితాలతోనే మీ సహోద్యోగుల ద్వారా విజయవంతమైన ఫలితాలు రాబట్టారు అని చెప్పడంలో ఎటువంటి సందేహంలేదు. ఇప్పటి తరానికి మంచి విషయాలు అందిస్తున్న మీకు అభినందనలు మరియు ధన్యవాదములు సర్.
Sambasiva+Rao+Thota
Brother Sagar!
Your observations are very much correct..
Thank you very much for your affectionate comments and appreciation
K. Sreenivasa moorthy
Sambasiva Rao garu its great sir for your multi dimensional activities and development of rural people. Rural growth will lead to country growth and your efforts in bringing professionals from the specific fields will definitely useful for the needy in development and betterment of their livelihood.
Sambasiva+Rao+Thota
SreenivasaMurthy Garu!
Your observations are very much correct…
Thank you very much for your observations and appreciation
Bhujanga rao
ఈ ఎపిసోడ్ మొత్తంగా సంక్షేమ పథకాల ద్వారా బ్యాంకులు అందించే రుణాలు, సంకర జాతి ఆవులు, వర్జీనియా పొగాకు పంటలు,చేతి వృత్తులవారికి మరియు లేత్ మిషన్ ద్వారా డ్రిల్లింగ్, గ్రైండింగ్ మరియు టాపింగ్ చేయడంలో మెలకువలు,ఇవే కాకుండా పుట్టగొడుగులు వాటి సేద్యం మొదలగు ఎటువంటి కార్యక్రమనికైనా వాటి అనుబంధ సంస్థల ద్వారా శిక్షణా కార్యక్రమం ఎంత అవసరమో, ఆ శిక్షణను ఆంధ్రా బ్యాంక్ సంస్థలో ఇస్తూ,తదనంతరం అంతకంటే మంచి ఫలితాలను పొందవచ్చు.మీ సహఉద్యోగులను ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతున్న మీకు అభినందనలు మరియు ధన్యవాదములు సర్.
Sambasiva+Rao+Thota
BhujangaRao Garu!
Your observations are quite correct…
Thank you very much for your observations and appreciation
rao_m_v@yahoo.com
You have really aggressively taken so many initiatives. How come you did not become a director? Were there politics involved?
Sambasiva+Rao+Thota
Sri MV Rao Garu!
Thank you very much your observations and appreciation..
Sir,
I feel that I got what I deserve..
I had lot of Job Satisfaction….
I am always grateful to ANDHRA BANK..
God is so great towards me..
Sambasiva+Rao+Thota
Useful Programs….
From
Sri RamanaMurthy
Vizag
Sambasiva+Rao+Thota
Thank you very much RamanaMurthy
Sambasiva+Rao+Thota
Nice Sir…
From
Sri Venkateswarlu
Guntur
Sambasiva+Rao+Thota
Thank you very much Venkateswarlu Garu
Sambasiva+Rao+Thota
Read…it…. Nice,….
From
Sri Rattaiah
Tenali
Sambasiva+Rao+Thota
Thank you very much Rattaiah Garu
Sambasiva+Rao+Thota
గురువు గారు…మీ జీవిత గమనం సాఫల్యమైన విధానం. బాగు బాగు. నిరంతరం మీరు చేసే కృషి అందరికీ ఆదర్శం






From
Sri Ramana
Hyderabad
Sambasiva+Rao+Thota
Ramana Garu!
Dhanyavaadaalandi
Sambasiva+Rao+Thota
Dear Sambasiva Rao ji
Today’s article of NAA JEEVANA GAGANAMULO
depicting your efforts for!
Rural development highly
Interesting and appreciated
Regards M S RAMARAO
Manager retd Central Bank
Hyderabad
Sambasiva+Rao+Thota
Sri. MS RAMARAO Garu!
Thank you very much for your affectionate comments and appreciation
Paleti Subba Rao
మీ సృజనాత్మక దృష్టితో వివిధ రకాల వృత్తుల వారికి ప్రయోజనకరమైన కార్యక్రమాలను రూపకల్పన చేసి ఎందరికో ఉపాధి కల్పించడమే కాకుండా వారి వారి వృత్తులలో నైపుణ్యాభివృద్ధికి తోడ్పడడం చాలా అభినందనీయం సాంబశివరావు గారూ. ఆ సమయంలో మీతోబాటు కలసి పనిచేసే అవకాశం నాకు రాలేదే అని చింతిస్తున్నాను.
Sambasiva+Rao+Thota
SubbaRao Garu!

Thank you so much for your affectionate comments and appreciation
Infact, I have the pleasure of working with you,at Regional Office,Guntur,in LEAD BANK DEPARTMENT….
I always cherish those beautiful days….
Dhanyavaadaalandi
Sambasiva+Rao+Thota
Very Nice Sir.Useful for Rural people . Trainings are more and more useful.
From
Sri Krishnamurthy
Hyderabad
Sambasiva+Rao+Thota
Krishnamurthy Garu!
Thank you very much for your observations and appreciation
Sambasiva+Rao+Thota
Very nice presentation




From
Sri Narayana
Hyderabad
Sambasiva+Rao+Thota
Narayana Garu!
Dhanyavaadaalandi
Sambasiva+Rao+Thota
Nice Episode…
From
Mr.Ramakrishna
Hyderabad
Sambasiva+Rao+Thota
Thank you very much Ramakrishna
Arunakar Macha
మీ జీవన గమనంలో మీ సంస్థ పెంచిన తోట మొక్కల వల్ల, ఆరోగ్య వంతమైన ఆనందాన్ని ఆస్వాదిస్తూ, వివిధ రంగాలకు చెందిన నిపుణు
లను రప్పించి సంస్థ లబ్ది దారులకు, శిక్షణా తరగతులు నిర్వహించి, మరియొకసారి ఆంధ్రా బ్యాంక్ సీఎండీ శ్రీ కె.ఆర్. నాయక్ మరియు జో.మే.శ్రీ జీ.వీ.రావు వార్లచే, అభినందనలు పొందటం అభినందనీయం.
ధన్యవాదములు
అరుణాకర్ మచ్చ, మానుకోట
Sambasiva+Rao+Thota
Arunakar Garu!
Thank you very much for your observations and appreciation
Sambasiva+Rao+Thota
Very good initiative taken for organizing training in agricultural, and allied activities which will improve the women skills P.Chandra Sekhar Reddy
Hyderabad
Sambasiva+Rao+Thota
ChandrasekharReddy Garu!
Thank you very much for your observations and appreciation
Sambasiva+Rao+Thota
మీ గత అనుభవాలు చాలా బాగా రాసారు సాంబశివరావు గారూ.
Not only you recollected many happenings but also you preserved the photos and incorporated at appropriate places. Very great andi. Bhanumurthy N
Hyderabad
Sambasiva+Rao+Thota
BhanuMurthy Garu!
Thank you very much for your observations and appreciation which I always cherish
Sambasiva+Rao+Thota
Gramina prajala kosamu.manchi manchi sikshana karya kramalu nirvahinchi savivaramuga teliya chesina miku abhinandanalu
From
Smt.Seethakkaiah
Hyderabad
Sambasiva+Rao+Thota
Seethakkaiah!
Thank you very much for your observations, affectionate comments,and appreciation
P. Nagalingeswara Rao
సాంబశివ రావు గారు , వివిధ వృత్తుల వారికి శిక్షణా తరగతులు నిర్వహించి వారి జీవనోపాధికి మీ సంస్థ ధ్వారా కార్యక్రమాలు సమర్ధవంతంగా నిర్వహించినందుకు మీకు నాహృదయపూర్వక నమస్కరములు తెలియజేయస్తున్నాను.
Sambasiva+Rao+Thota
NagaLingeswararao Garu!
Thank you very much for your observations and appreciation and affectionate comments
Sambasiva+Rao+Thota
Mee writing style baaghundhi
From
Sri Sathyanarayana
Hyderabad
Sambasiva+Rao+Thota
Sathyanarayana Garu!
Dhanyavaadaalandi
Sambasiva+Rao+Thota
Sambasiva Rao garu,
I am closely following your article. You have done lots of work worth mention, to the bank as well as to the society.
From
Sri Krishna Prasad
Hyderabad
Sambasiva+Rao+Thota
Thank you very much KrishnaPrasad Garu for your affectionate comments and appreciation
I
డా. కె.ఎల్ వి ప్రసాద్
సంస్థ అభివృద్ధిలో
మీ కృషి, మార్గదర్శనం
ప్రశంశనీయం.
అభినందనలు
సాంబశివ రావుగారు.
Sambasiva+Rao+Thota
Prasad Garu!
Dhanyavaadaalandi
Sambasiva+Rao+Thota
Story nice
From
Sri NarayanRao
Hyderabad
Sambasiva+Rao+Thota
Thank you very much NarayanaRao Garu