ఎంతో ప్రేమగా పెంచిన పూల తోట
నన్ను కాదని వెళ్ళింది ఇక
ఎదురుగా కనిపిస్తూ నన్ను
ఎంతో వేదనకి గురిచేస్తూ..
నన్ను కాదని అంటూనే నా వైపు
పూల నవ్వులు విసురుతూ..
అవి రవ్వలు పుట్టిస్తూ నా గుండెన
రాదని తెలిసి కాదనుకోలేక
ఔననికూడ అది
నాదని అనుకోలేక ఆకాశాన్ని
అంటిన దుమ్ము దులుపుతూ
నేను అంతలా ఆక్రోశించా
ప్రియా.. రా.. రమ్మని
నమ్ముతారా మీరైనా!!!
ఆ పూలతోట నాదని??????

డా. హేమావతి బొబ్బు తిరుపతి వాసి.
వీరి ప్రాథమిక విద్య తిరుమలలో, ఉన్నత విద్య తిరుపతిలో జరిగింది.
పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పొందారు. ఆర్ జి యు కె టి ఇడుపులపాయలో అధ్యాపకురాలిగా పనిచేసారు.