[గణాంక కూర్పు: డా. వెంకట వూటుకూరి, అక్షర కూర్పు: డా. సారధి మోటమఱ్ఱి]
1932 లో వెలువడిన తొలి టాకీ సినిమా నుండి 2000 వ సంవత్సరం వరకు 5,203 తెలుగు చిత్రాలు విడుదలైనవి. అనేకానేక సినీ నిర్మాతలు, దర్శకుల నిర్దేశంలో రూపొందిన ఈ చిత్రాలలో నేటికీ అపురూప కళాఖండాలుగా నిలిచిన విలువైన చిత్రరాజలెన్నో! నిర్మాత, దర్శకులతో పాటు వందల సాంకేతిక నిపుణులు మూలకారణమైన, తెరపై వారందరి సమిష్టి కృషిని తన నటనతో చివరికి మెప్పించి, ఒప్పించి, ప్రేక్షకులను, సినిమా హాలుకు రప్పించి, వారికి ఆనందం, ఆహ్లాదం, ఉద్వేగంతో పాటు రసస్ఫూర్తి కలిగించేది, నటవర్గమే! తెలుగు కళామతల్లి చూసిన వేల మహానటులలో, దశాబ్దాలు, తమ నటనతో, ఆహార్యంతో, అనితర సాధ్యం కాని నటనతో మనలను అలరించింది, కొద్దిమందే. నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, యస్వీ రంగారావు, కృష్ణ మొదలగు నటులు; సావిత్రి, జమున, కృష్ణకుమారి, అంజలి, సూర్యకాంతం, వాణిశ్రీ మొదలగు నటీమణులు. ఇందరి మహాకళాకారుల నడుమ, తనదైన, విలక్షణమైన, నటనతో , సంభాషణా చాతుర్యంతో, నడవడికతో, తన కళపై అకుంఠిత పరిశ్రమతో, పాఠాలు నేర్చుకొంటూ, ఎవరస్టు శిఖరాలను అందుకున్న నటుడు, 15 కోట్ల ఆంధ్రుల మదిలో, అజరామర ముద్రవేసి, కృష్ణుడు, రాముడు, రావణుడు, దుర్యోధనుడు, శ్రీకృష్ణదేవరాయలు, యముడు, పుండరీకుడు, జానపద వీరులు- ఇలానే ఉండేవారమో, అనే భావనను కలిగించి, ఒక మరుపురాని, మహోన్నత కళాకారుడుగా కోట్లాది అభిమానుల గుండెల్లో నేటికీ నిలిచిపోయిన మాహానటుడు, మన నందమూరి తారక రామారావు మాత్రమే. అభిమానులు, NTR అని, అన్న అని, ప్రేమగా పిలుచుకొన్న NTR శతజయంతి, మే 28వ తేదీన, ప్రపంచవ్యాప్తంగా, ఎంతో వేడుకగా జరుపుకుంటున్న తరుణంలో, మా తరపు నివాళి అందించే చిన్న ప్రయత్నమే, ఈ చిన్న గణాంకాల మిళిత వ్యాసం!
NTR పై, పదులుగా పుస్తకాలు, వేలల్లో వ్యాసాలు, అనేకానేక సాంఘిక మాధ్యమ స్పందనలు, చివరికి చిత్రాలు కూడా నిర్మితమైన విపణిలో, వేదికలో, ఈ వ్యాసం ప్రత్యేకత ఏమిటి అని మీరు అడగవచ్చు. NTR సినిమాలపై వేలకొలది వ్యాసాలు వచ్చినా, ఆయన నటనా జీవిత విశేషాలపై ఒక సమగ్ర గణాంక విశ్లేషణ అందించడమే మా ముఖ్య ఉద్దేశ్యం. వాటి వివరాలు, అందరికీ అందుబాటులోకి , అవగాహనలోకి తీసుకొనిరావాలనే మా చిన్న ప్రయత్నం. ఇటువంటి కృషి, వివరాలు, ఇంతకుముందు ఎవ్వరూ అందించలేదని, దీనిపై మరింత లోతైన విశ్లేషణ వివిధకోణాలలో కొనసాగించాలని, ఆ అన్వేషణకు ఈ వ్యాసం శ్రీకారం చుడుతుందని మా ఆశాభావం. NTR 1949 నుండి చివరిగా 1993 వరకు 280 సినిమాలలో నటించాడు. 194 నిర్మాతలతో, 90 దర్శకులతో, 58 సంగీత దర్శకులతో, 137 కధా రాచయితలతో, 73 మాటల రచయితలతో, 67 మంది పాటల రచయితలతో, 72 మంది గాయకులతో, ఆయన చిత్రజీవితం, ముడిపడిఉందని, మా విశ్లేషణ. ఆ వివరాలను మూడు పట్టికలలో, రెండు చిత్రాలలో క్రింద అందిస్తునాము.
NTR Contributions to the Telugu Film Industry – Deeper Analytics
అంతర్ విశ్లేషణ
పట్టికలు 1-3 మరియు చిత్రాలు 1-2 లోతుగా పరిశీలిస్తే, మనకు ఎన్నో విశేషాలు తెలియవస్తాయి. NTR ఒక నటుడు, రాజకీయ వేత్త, తెలుగుభాషను, తెలుగువారి ఉనికిని నలుదెసలా చాటినవాడు అని అందరికీ తెలుసు. కానీ, NTR నిర్మాతగా, 24 చిత్రాలు నిర్మించాడని, తను నటించిన 280 చిత్రాలలో ఇది 9 శాతమని, ఏ కొద్దిమందికో తెలియవచ్చు. ఆ 24 చిత్రాలలో 16 చిత్రాలకు తనే దర్శకుడని, చాలా తక్కువమందికి మాత్రమే తెలుసు. ఇంకా ఆశ్చర్యకరమైన విశేషమేమిటంటే, తన 280 చిత్రాలలో, 14 చిత్రాలకు తనే కధా రచయిత అని! అంటే, NTR స్వతహాగా ఒక రచయిత కూడా! అంతేకాదు, తన నటించిన చిత్రాలలో అత్యధిక చిత్రాలకు తనే రచయిత! అ తదుపరి స్థానం, సదాశివబ్రహ్మం.
చిత్రాలు 1-2 తెలిపేది , విడుదలైన చిత్రాలు సంవత్సరం వారీగా. 1961-65 మధ్య అత్యధికంగా అంటే 59 చిత్రాలు విడుదలైనవి. మరిన్ని వివరాలు, ఈ గణాంకాలు అందసేస్తున్న, వాటిని, మా తదుపరి మరింత వివరణాత్మక వ్యాసంలో అందించ ప్రయత్నిస్తాము.
NTR తరువాత అంతటి అభిమానాన్ని అందుకొన్న అక్కినేని మాటలతో ఈ వ్యాసాన్ని సశేషంగా ముగించటమే, సరియైన నివాళి. అక్కినేని ఏమంటారంటే, NTR ఒక ఆవేశపూరితమైన కళాకారుడు అని. అలాగే నాయక పాత్రలలో రాణించడంవేరు, అది నేను చేశాను. కాని అన్న గారి విశిష్టత ఏమిటంటే, ప్రతి నాయక పాత్రలలో కూడా అద్భుతంగా నటించి, ప్రేక్షకలు రంజింపచేయడం, అనితర సాధ్యం అని!
ఏకీకృత భావనతో వీక్షించ గలిగితే – ప్రకృతి అంతా, భిన్న విజ్ఞానాల సమాహారమేనని; కళల మరియు శాస్త్రీయ శాలలు, వేరు వేరు కాదని; వాటి అభేద భావనయే – జ్ఞానానికి పరాకాష్టయని – మోటమర్రి సారధి ప్రగాఢంగా విశ్వసిస్తారు. అందుకే ఒక కవిత వ్రాయంలో, ఒక వంతెన నిర్మించడంలో లేదా ఒక కంప్యూటర్ ప్రోగ్రాం సృజించడంలో – భేదాలు తనకెప్పుడూ అగపడలేదంటారు. మనుషులు, మనుషుల తత్వాలు; కొండలు, కోనలు; నదులు, సముద్రాలు; వినీలాకాశం, నిర్మలత్వం – ఇవన్నీ ఆయనకు ప్రేరణ కలిగించేవే. మానవజాతిని ఉన్నత స్థితికి కొనిపోవాలని, అత్యున్నత సాహితీ సంపదను, మనకందించిన, ప్రపంచ పరివ్యాప్తంగా ఉన్న కవులు, రచయితలందరికీ, మనమెంతో ఋణపడి ఉన్నామని అభిప్రాయపడతారు.
మానవజాతి చరితను క్లుప్తంగా క్రోడీకరించిన, స్వామి వివేకానంద, ఈ నాలుగు మాటలు, తననెంతో ప్రభావితం చేశాయని చెబుతారు: “మనిషి అడుగు వేసినప్పుడు, ముందుకు పోయేది – మెదటి కంటే, అతని ఉదరమే (ఆకలి)! ఉదరాన్ని (ఆకలిని) దాటి, మానవజాతి ముందుకు అడుగు వెయ్యడానికి, యుగాలు పట్టవచ్చు.”
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
ప్రాంతీయ సినిమా -15 : డాలీవుడ్ కోసం ఘాలీవుడ్
రాత్రి
సాఫల్యం-51
సాఫల్యం-5
కీచకపర్వం..!!
నేపాల్ జాతీయ పుష్పం ‘రోడోడెండ్రాన్’
ప్రేరణాత్మక నవల ‘అపజయాలు కలిగిన చోటే..’
మౌనం ఒక నిశ్శబ్ద నిగూఢ పెను తరంగం
గోలి మధు మినీ కవితలు-3
నూతన పదసంచిక-20
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®