నీవు
ప్రేమ పరికిణి కట్టుకున్నవేమో
ఇంద్రజాలం చేస్తున్నావ్ నా మనసును!
సౌందర్య బరువును మోస్తున్నవేమో
వలపుల వర్షంలో తడిపేస్తున్నావ్ నను!
మమతా మాధుర్యాన్ని అద్దుకున్నవేమో
నవ్వుల పరిమళాలతో చుట్టేస్తున్నావ్ నను!
ప్రణయ మంత్రాన్ని పఠిస్తున్నావేమో
ప్రశాంత వెన్నెల కాంతులతో నీవైపు లాగేస్తున్నావ్ నను!
ప్రియా
నీరూపం ఓ అద్భుతం
నీ తలపు ఓ చంద్ర కిరణం
నీవు నా ప్రాణం

డా. బాలాజీ దీక్షితులు పి.వి. హోమియోపతి వైద్యునిగా, కవిగా, గెస్ట్ లెక్చరర్‌గా, వ్యక్తిత్వ వికాస నిపుణినిగా, కౌన్సిలింగ్ సైకాలజీస్ట్గా ఇలా ఎన్నో రంగాలలో విశిష్టత చాటుకున్నారు. డా. దీక్షితులు ఇప్పటి వరకు 58 జాతీయ,అంతర జాతీయ పరిశోధనా పత్రాలు ప్రచురించారు. ఇప్పటికి 10 పరిశోధనా సమావేశాలలో పాల్గొన్నారు, దాదాపు 90 తెలుగు రచనలు వివిధ పత్రికలలో ప్రచురితం అయినాయి. వీరి సేవ మరియు ప్రతిభను గుర్తించి యూనివర్సిటీ అఫ్ సోత్ అమెరికా డాక్టరేట్ 2016లో ఇచ్చింది. ఇవిగాక అనేక అవార్డ్స్, రివార్డ్స్ అనేక సంస్థలు అందించాయి.