ఇరు పెదవుల కలయిక
చిరు నవ్వుల చక్కని నీహారిక
ఒకరికొకరి పేర్ల పలవరింతల కేరింత కేక
అరమోడ్పు కన్నుల చిలిపి పరిభాషల నైరుతి తుంపరే ఇక
వచ్చావు నా మది తలుపుల దాకా
లోపలికి రాకుండా వెనుదిగిరి పోతున్నావే ఇంకా?
నీ రాకతో వచ్చిన చలనం
గుండె మరు దరువు వేయకముందే అయింది నిస్తేజం
నీ సెలవు నాలో రేపిన ప్రళయం
తీరేదా మరో జన్మ ఎత్తినా ఈ శూన్యత్వం
నీ నిరీక్షణ నాకొక సమాధానం తెలీని పరీక్ష
ఎన్నాళ్లీ అలుపెరుగని ప్రతీక్షామథనం
నాతో రాగలవా ప్రళయాంతం దాకా
ఉంటా నీతో ప్రణయాంతం వరకూ ఇంకా!
ఇది శ్రీమతి షేక్ కాశింబి గారి వ్యాఖ్య: *సంగీత నాట్య రీతులు.. మూర్ఛనలు వంటి పదాల నిజం అర్థాలు.. సంగీత పరిజ్ఞానం లేని నా వంటి వారికి…