అనుభూతులు మూర్ఛిల్లిన కోమాను మరపించే నీ మౌనం నిషాగత నిస్తేజతను నింపి నన్ను నిర్వికారుణ్ణి చేస్తోంది నేస్తం!
హిమానీ నిబిడ హేమంతాలూ నయాగరా నయగారాలూ నైలునదీ నిగనిగలెన్నో ఒలికించే మన మృదు స్నేహం ఏ సైమూన్ విలయ తాండవానికో ఏ సైతాన్ ఘోర కరాళ నృత్యానికో ఎర అయి క్షతగాత్ర గోమాతలా నిస్సహాయంగా అశ్రుతర్పణం చేస్తోంది!
నిశీధి రాజ్యం చేస్తున్న మరుభూమిని మరపించే యీ మౌనంలో… ఎన్నో గతస్మృతుల కాయాలు కాలుతున్పై మృతశృతుల కపాలాలు ప్రేలుతున్నై!
మన మధ్య పేర్చబడ్డ యీ సుప్త మౌనాస్థికలను ఏ సప్తస్వరాల నదీ గర్భంలోనో నిమజ్జనం చేసెయ్ నేస్తం!
స్వరపేటికలో కలిగిన ఏ చిన్ని కదలికకో నాద తంత్రులు ప్రతిస్పందించి ఆస్యకుహరంనుంచి వెలువడే లాస్య మృదూక్తులు ఆప్యాయతాత్మీయతా సోనలను కురిపింపజేస్తూ ఎప్పటిలా నా వీనులకు సుతారంగా సోకాలి నేస్తం!
ఆ స్నేహామృత ధారలలో తడిసి తడిసి… ఆ సౌహార్ద ధామంలో ఒదిగి ఒదిగి… నాకు నేనే పునీతుడనై పోవాలనే నా ఆశకు నీ పలుకే ప్రణవం! చిరునగవే ప్రాణం!!
కోమాను మరిపించేది మౌనం జాబితాలో రాదనుకుంటా కవిగారూ
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
మీరెప్పుడైనా అటువంటి హృదయాన్ని చూసారా?
మానస సంచరరే-45: చూపుల్లోకి ఓ చూపు!
ప్రాంతీయ దర్శనం -5 : తుళు సినిమా – నాడు
జీవితమొక పయనం-10
కోట్లలో ఒక బాలు
మరోసారి ‘జగజ్జాణ’ – సరళంగా, సంక్షిప్తంగా!!-2
అమ్మతనం
లోతైన ఆలోచన, ఆవేదన కలిగించే ‘మర్డర్’
వేంపల్లి రెడ్డి నాగరాజు నాలుగు మినీ కథలు-38
‘నాలుగు మెతుకులు’ పుస్తక పరిచయం
అన్నం విలువ మనసుకు తాకేలా వివరించారు... ప్రతిదీ వివరంగా పరిశీలించి అందిస్తున్నందుకు ధన్యవాదాలు...🙏
Thank you somuch sir
ధన్యవాదాలు సర్.
సుబ్బారావు గారు ధన్యవాదాలు మీకు.
వేణు గారూ ధన్యవాదాలు
All rights reserved - Sanchika®