[ప్రభ గారు రచించిన ‘ఒక క్షణం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]


క్షణ గడియ
నన్ను నేను మరచిపోయాను.
తన కనులను చూచి
ఏ కలల లోకంలోనే విహరించాను.
తన కనులను చూచి
నెమలి కనులు కూడ అసూయతో మరణించినే!
తన నడక చూచి
నడకనే నడక మరచి
తన వెంట నడిచెనే!
తను నడుస్తుంటే,
అటు ఇటుగా ఊగుతున్న కురులు
నా ఎదని తన వైపు ఊగేలా చేసెనే!
కన్నులు మూచి తెరిచేలోగా
అపహస్యం అయ్యానే!
ఓ అందాల భామ
మరల నీ దర్శన భాగ్యము ఎప్పుడు కలుగునే!