సంచిక పాఠకులకు, అభిమానులకు, తెలుగు సాహిత్య ప్రేమికులకు ధన్యవాదాలు. రోజు రోజుకూ సంచికకు పెరుగుతున్న పాఠకాదరణ అత్యంత ఆనందాన్ని కలిగిస్తోంది. పాఠకులను ఇంకా అధిక సంఖ్యలో ఆకర్షించేందుకు సరికొత్త శీర్షికలను రచనలను అందించాలని తపనపడుతోంది సంచిక.
ఇది గడ్డుకాలం. అనూహ్యమైన రీతిలో కనబడని ఒక సూక్ష్మజీవి ప్రపంచాన్ని స్థంభింపచేస్తోంది. సామాజిక జీవితాలను, ఆర్థికవ్యవస్థలను అతలాకుతలం చేస్తోంది. ఇల్లు దాటి బయట అడుగుపెట్టాలంటే భయం. సాటి మనిషిని కలవాలంటే భయం. ఇలా అడుగడుగునా భయంతో మనిషి జీవితం గడపాల్సివస్తోంది. కరోనా భయం ఎప్పుడు సమసిపోతుందో అని ఎదురుచూడాల్సివస్తోంది. ఈ సమయంలో ఒకరికొకరి ధైర్యం చెప్పుకుంటూ ముందుకు సాగాల్సి వుంటుంది. ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ అడుగు ముందుకు వేయాల్సివుంటుంది. సాటి మనిషికి నేనున్నానని ధైర్యం చెప్తూ, నాకు నీవున్నావు, నీకు నేనున్నాను, మనమంతా ఒకరికొకరము వున్నాము అంటూ ఒకటిగా నిలబడాలి సమాజం.
కానీ, మన భారతీయ సమాజంలో ఇదే సమయంలో వైరుధ్యాలు, విద్వేషాలు, దెబ్బ తీసుకోవటాలు, ఎత్తుకు పై ఎత్తులు, వాదాలు, వివాదాలు, ధిక్కారాలు, హేళనలు, ఆధిక్య భావనలు, రాజకీయాలు.. ఒకటేమిటి… మనమంటే మనకే అసహ్యం అనిపించే రీతిలో మన సమాజం ప్రవర్తిస్తోంది. తన మంచి కోరే వారిపైనే దాడులు చేస్తూ, తానున్న కొమ్మనే నరుక్కునే మన మూర్ఖత్వాన్ని ప్రపంచానికి ప్రదర్శితోంది మన సమాజం. ఈ సమయంలో రచయితలు తమ రచనలతో సమాజంలో ఆరోగ్యకరమయిన ఆలోచనలను ప్రవహింపచేయాలి. భవిష్యత్తుపై ఆశను రేకెత్తించే రచనలతో ఉత్తేజితం చేయాలి. సమస్య పట్ల అవగాహన కలిగించాలి. ధైర్యాన్నివ్వాలి. సంచిక అందుకే కరోనా పై వ్యాసాలను, కవితలను, కథలను విస్తృతంగా ప్రచురిస్తోంది. అలాంటివి రాయమని రచయితలను ప్రోత్సహిస్తోంది.
వీలయినంత అధిక సంఖ్యలో తెలుగు పాఠకులను సాహిత్య పఠనం వైపు ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా ఈ సంచికలో ప్రచురితమవుతున్న రచనల వివరాలు:
వ్యాసాలు:
కాలమ్స్:
కథలు:
కవితలు:
గళ్ళ నుడికట్టు:
పుస్తకాలు:
బాలసంచిక:
త్వరలో పాఠకులను ఆకట్టుకునే మరిన్ని సరికొత్త రచనలు సంచికలో ప్రచురితమవుతాయి.
సంపాదక బృందం
చాలా గొప్ప సంపాదకీయం రాసారండి. మనుగడే ప్రశ్నార్ధకమైన ఈ రోజుల్లో కూడా పరస్పర వైషమ్యాలు, ద్వేషాలూ చిమ్ముకుంటున్న సమాజాన్ని చూసి విస్తుపోవడం తప్ప మరేమీ చెయ్యలేని పరిస్థితి
సమగ్రత అనే పదానికి అర్ధం – మీరు వెలువరిస్తున్న* సంచిక*
ముందే ప్రకటించినట్లు.. ఇది అక్షరాలా పలు రంగాలకు *వేదిక*
దీనిపై సాహిత్యంతో పాటు సంగీతం, చిత్రం, చరిత్ర కలగలిసి ప్రతిసారీ *తొలి* తీయ దనాన్ని తెస్తున్నాయి.
మాట (కధానికలు, కధలు, ధారావాహికలు, జ్ఞాపకాల పరంపరలు, గతకాలపు స్మృతులు,భావాలు- అనుభవాలు, నాటిక నాటకాలు, నవలలు, పద్యాలు, కవితలు, గేయ రూపాలు, వచన విన్యాసాలు, అనువాదాలు, అపురూప చాతుర్యాలు, అంతరంగ ఆవిష్కారాలు)
ఆటపాటలు (చలనచిత్రాల విశ్లే షణ, గళ్ళ నుడి కట్టు, తదితరాలు)
బాట (వ్యక్తిత్వ వికాసాలు, సమస్యలకు సందేహాలు, దేశ విదే శీ విశేషాల సమా హారాలు)
వీటన్నింటినీ ఎప్పటికప్పుడు వేడివేడిగా పొద్దున్నే వడ్డించే స్తుంటే ఎవరి ఆకలైనా తీ ర కుండా ఎలా ఉంటుంది చెప్పండి?
ఇన్ని ప్రత్యేకతలు మీలో ఉన్నందుకే నోరారా ఈ అభివందనం. మనసారా నా నమస్సుమం..
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Notify me of follow-up comments by email.
Notify me of new posts by email.
Δ
మానస సంచరరే-24: ఊగెలే ఊహల ఊయల!
ఐతిహాసిక మహావట భూజం-6
నాందేడ్‌లో మహారాష్ట్ర రాష్ట్ర తెలుగు సాహిత్య అకాడెమీ కార్యక్రమం – నివేదిక
తాండూరుతో ములాఖాత్..
ఎంత చేరువో అంత దూరము-14
నూతన పదసంచిక-82
నీ సిగలో మల్లెనై..!
మన భారత అవని-6
మహాభారత కథలు-96: అజగరోపాఖ్యనము
‘అనర్ఘరత్నాలు’ – కొత్త ఫీచర్ ప్రారంభం – ప్రకటన
థాంక్యూ రమాజీ థాంక్యూ సో మచ్
థాంక్యూ రామాజీ థాంక్యూ సో మచ్
థాంక్యూ చండీ థాంక్యూ సో మచ్
థాంక్యూ రాజ్యలక్ష్మి గారు థాంక్యూ సో మచ్
థాంక్యూ బాలాజీ థాంక్యూ సో మచ్
All rights reserved - Sanchika®