సంచికలో తాజాగా

Related Articles

5 Comments

  1. 1

    యామినీ దేవి కోడే

    వేదాంత సారం.. ప్రకృతి నాదం
    ఊహల రాగం.. వేధన పాఠం
    ఆ వెనుక.. నిన్ను నువ్వు చూసుకున్నావా అనడం చెప్పేదేముంది చదివి అనుభూతి చెందాల్సిందే..

    ఓడిపోయిన వ్యభిచారీ.. మనసు చలించలేదంటావా అనడంలో.. ఒకింత ఆశ్చర్యాని లోనయ్యా ఎందుకో.. చదువుతూ ఇంకా లోపలికి చేరుకున్నాక ఆ మాటలో పరమార్థం అవగతం అయ్యింది.

    సౌందర్యపు లోతులు కొలవడం
    కళ్ళలో కాంతులు వెదకడం
    ఒక పాత్ర ద్వారా నేను ఆలోచిస్తున్నాను అనడం
    మరో పాత్ర నేను అనుభవిస్తున్నాను అనడం
    జవాబు కోసం స్వభావాల మద్య తర్కం

    లోలోతులకెళ్ళిన దగ్గర నుండి వాళ్ల లో గుణాలు చెట్టు పుట్టల వెంట తిరిగినా..
    ఆ లో లోపల అర్థాలు వెతుకుతూ.. నేను ఈ అక్షరాల వెంట నన్ను తిప్పుకున్నాను.

    అయినా అంత సులభం గా పట్టుచిక్కించుకోలేకపోయానీసారి..
    పదే పదే మరి మరీ లీనమయ్యాక అప్పుడు చేరుకున్నా అందులో.. అర్థాన్ని పరమార్థాన్ని.

    కర్మ సిద్ధాంతం పట్టుకుని నేనూ కాసేపు అలా నడిచా..
    ప్రతీ అర్థానికీ అపార్థాలున్నాయని చెప్తూ.. ఒక చోట పాదచారి మాట బలే బావుంటుంది..

    విషయం జరగక ముందే మలుపు
    మలుపు తిరగక ముందు ఒకలా.. తిరిగితే మరొకలా..
    అలా అని ముందు తెలుస్తుందా.. లేదు
    ఒకటి అనుభవం లోకి వచ్చాక ఇలా కాక అలా అయితే బావుండలేదని మనం అనుకుంటూ ఉండే విషయం చర్చకు పెట్టడం.. నిజమే కదా అని అనిపించింది.

    ఓసారి రేపు ఓరోజు అందరూ నన్ను వదిలి వెళ్ళి పోతారని కన్నీటిని చేరతీయగా పాదచారిని వేదన లత చుట్టుకోవడం
    తర్వాత జరిగే పరిణామాలు పాత్రలూ కూడా మమ్మల్ని ఆకట్టుకునేలా ఉన్నాయి.

    ఏది ఏమైనా ఒకటి మాత్రం అర్థం అయింది ఈ పాదచారి చదవడం కూడా ఊరికే జరగటం లేదు..
    గతకాలపు ఖర్మఫలం ఈ కాలంలో ఇలా పాదచారి పాత్ర వెంట నడిపిస్తుందని..
    మాకు ఈ పాదచారిని అందించిన గురువు గారికి.. ధన్యవాదాలు తెలుపుకుంటూ..
    🌺🌺🙏🙏 🌺 🙏🙏 🌺

    Reply
  2. 2

    కస్తూరి మురళీ కృష్ణ

    Message from Dr GaliRajeswari: …….. పాదచారిఆరవభాగానికి(6) స్పందన……….
    ..ఇదొక దివ్య దార్శనికరచన..హృదయసాగర మథనం..బాహ్యాభ్యంతర ప్రకృతుల రూపం..రసమయచిత్తస్పందన……స్వభావాలే పాత్రలు..భావాలే భాషిస్తుంటాయి,ఘర్షణ పడుతుంటాయి……వ్యక్తి నుండీ వ్యవస్థ లోకి పాదచారి పయనం…తనలోలేని ప్రత్యేకత ఎక్కడా లేదు..వుండదు.ఐనా తనలో తప్ప అంతటా వెదకడం మనిషి లక్షణం..పాదచారీ అంతే..అందాలవెంట,ఆనందాల పరుగులు..తనకు తెలియనిదాని కోసం అన్వేషణ…..మనసు మనకు నౌఖరంటాడు…ఙాపకాల అరకు తాళంచెవి అంటాడు..ఏమని ఏం లాభం?..తన భావాలతోనే నిరంతరయుద్ధం..ప్రశ్న సమాధానాల పర్వం..క్షణంలో అందరూ విడిపోవడం..క్షణంలో కలుసుకోవడం….ఐనా వీరు ఎవరితోనూ కలిసిపోరు.ఎవరిదారి వారిదే సుమా!..ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరికైనా తాము అనుకున్నదే తమకు కావాలి,లేకపోతే ఘర్షణే….ఈసందర్భంలోనే
    అద్దానికిఆవలకనపడుతుంది.. నిప్పులాంటి నిజం..సత్యంముందు ఎవరైనా తలదించుకోవాల్సినదే.. పాదచారికేమీ మినహాయింపులు లేవు….ఎంత కప్పి పుచ్చుకున్నా అతడుతనఅపజయాన్ని,అసమర్ధతనుఅంగీకరించితీరాల్సిందే….ప్రస్తుత సందర్భం….ప్రశ్న జవాబుల పర్వం కాదు….అందువల్ల ప్రయోజనం లేదు. ఎందుకంటే ప్రశ్న తర్వాత, జవాబు తర్వాత కూడ మిగలేది ప్రశ్నే…”తర్వాతేం టీ” అని!?
    ఈభాగంలో ప్రతి అక్షరమూ ప్రత్యేకమైందే…తనను తాను నిలదీసుకోవడం,నీరసమైన సమర్థింపు,ఓడిపోతూ గెలవడం,గెలుస్తూ ఓడడం… ఓహ్!!👏👏👍👍✌✌🙏🙏

    Reply
  3. 3

    కస్తూరి మురళీ కృష్ణ

    శ్రీమతి కోడే యామినీ దేవి గారి స్పందన ఇది అయ్యా
    దాంత సారం.. ప్రకృతి నాదం
    ఊహల రాగం.. వేధన పాఠం
    ఆ వెనుక.. నిన్ను నువ్వు చూసుకున్నావా అనడం చెప్పేదేముంది చదివి అనుభూతి చెందాల్సిందే..

    ఓడిపోయిన వ్యభిచారీ.. మనసు చలించలేదంటావా అనడంలో.. ఒకింత ఆశ్చర్యాని లోనయ్యా ఎందుకో.. చదువుతూ ఇంకా లోపలికి చేరుకున్నాక ఆ మాటలో పరమార్థం అవగతం అయ్యింది.

    సౌందర్యపు లోతులు కొలవడం
    కళ్ళలో కాంతులు వెదకడం
    ఒక పాత్ర ద్వారా నేను ఆలోచిస్తున్నాను అనడం
    మరో పాత్ర నేను అనుభవిస్తున్నాను అనడం
    జవాబు కోసం స్వభావాల మద్య తర్కం

    లోలోతులకెళ్ళిన దగ్గర నుండి వాళ్ల లో గుణాలు చెట్టు పుట్టల వెంట తిరిగినా..
    ఆ లో లోపల అర్థాలు వెతుకుతూ.. నేను ఈ అక్షరాల వెంట నన్ను తిప్పుకున్నాను.

    అయినా అంత సులభం గా పట్టుచిక్కించుకోలేకపోయానీసారి..
    పదే పదే మరి మరీ లీనమయ్యాక అప్పుడు చేరుకున్నా అందులో.. అర్థాన్ని పరమార్థాన్ని.

    కర్మ సిద్ధాంతం పట్టుకుని నేనూ కాసేపు అలా నడిచా..
    ప్రతీ అర్థానికీ అపార్థాలున్నాయని చెప్తూ.. ఒక చోట పాదచారి మాట బలే బావుంటుంది..

    విషయం జరగక ముందే మలుపు
    మలుపు తిరగక ముందు ఒకలా.. తిరిగితే మరొకలా..
    అలా అని ముందు తెలుస్తుందా.. లేదు
    ఒకటి అనుభవం లోకి వచ్చాక ఇలా కాక అలా అయితే బావుండలేదని మనం అనుకుంటూ ఉండే విషయం చర్చకు పెట్టడం.. నిజమే కదా అని అనిపించింది.

    ఓసారి రేపు ఓరోజు అందరూ నన్ను వదిలి వెళ్ళి పోతారని కన్నీటిని చేరతీయగా పాదచారిని వేదన లత చుట్టుకోవడం
    తర్వాత జరిగే పరిణామాలు పాత్రలూ కూడా మమ్మల్ని ఆకట్టుకునేలా ఉన్నాయి.

    ఏది ఏమైనా ఒకటి మాత్రం అర్థం అయింది ఈ పాదచారి చదవడం కూడా ఊరికే జరగటం లేదు..
    గతకాలపు ఖర్మఫలం ఈ కాలంలో ఇలా పాదచారి పాత్ర వెంట నడిపిస్తుందని..
    మాకు ఈ పాదచారిని అందించిన గురువు గారికి.. ధన్యవాదాలు తెలుపుకుంటూ..
    🌺🌺🙏🙏 🌺 🙏🙏 🌺

    Reply
  4. 4

    కస్తూరి మురళీ కృష్ణ

    ఇది కంపల్లె రవిచంద్రన్ గారి స్పందన
    నమస్తే!! మీ “ పాదచారి” ఆరవ భాగం నాకు అందగానే ఎంతో ఆత్రంగా చదివాను. మా చిన్నతనంలో దీపావళి వస్తుందంటే ఎంతో ఆనందంగా ఎదురుచూసేవాళ్లం.. కారణం భానుమతీ రామకృష్ణ ఏదో ఒక అత్తగారి కథ తో అలరిస్తారు వారపత్రిక ను అని. నలభై ఏళ్ల తరువాత మళ్లీ అదే ఎదురుచూపు తమకం ఈ వయసులో కలిగిస్తున్నారు.. ఆ తమకపు గమకం వయసును జయిస్తోంది.. మీకు, ప్రచురిస్తున్న సంపాదకులకు ధన్యవాదాలు !!
    జలగోళం లాంటి భూగోళంలో భగవంతుడు ఎక్కడ చూసినా ఉప్పొంగులు వారుతున్నాడు. ఈ హరిత సముద్రం మీది అందాల అలలన్నీ అతని స్నేహ హస్తాలే! ఒక చోట ఆకాశాన్నంటే శిఖరాలుగా ఎగసి, మరొకచోట పాతాళాన్ని తాకే లోయలుగా సుడి తిరిగి, ఇంకొక చోట ఆహ్లాదాలు వీచే అరణ్యాలుగా తరంగలించి , మైదానాలుగా విస్తరించి , పుష్పాలుగా నురగలెత్తి సత్యనృత్యం చేస్తున్నదంతా భగవంతుడే! ప్రాణుల హృదయ మందిరాల్లో వీస్తున్న పవిత్ర పవనం అతడే. భగవంతుడు ఒక విశ్వ సంగీత ఝరి అయితే దానితో లీనం కావడానికి మనిషిని ఆయత్తపరచడమే ఋషి చేసే పని. ఆ పనిని మీరు ఈ ధారావాహిక ద్వారా చేస్తూ ఋషిపీఠం అందుకున్నారు. మీకు ధన్యవాదాలు అన్నది చాలా చిన్న మాట. ఎందుకంటే ఈ అనంత తత్త్వంతో అంగీకరించని వాడు జీవితంతో పోరాడుతూనే అంతరించిపోతాడు. విశ్వ రహస్యాల్ని అవగాహన చేసుకున్నవాడు ఆధ్యాత్మిక భోగి అవుతాడు. ఆధ్మాత్మిక భూమికలలోకి మనిషి ఎదగడానికి అతనికున్న మానసిక బలహీనతలు ఎంతో బలవత్తరంగా అడ్డుపడుతున్నాయి. ఈ విషయాన్ని పసికట్టి వాటిని సమూలంగా పెకలించడానికి మీ ధారావాహిక ద్వారా మీరు ప్రయత్నించడం ప్రశంసనీయం!!

    Reply
  5. 5

    అల్లంశెట్టి సత్యనారాయణ

    6 భాగాలు చదివాను. పాదచారిని అర్థం చేసుకోవటానికి గట్టి ప్రయత్నం చేశాను. ఇంకా సఫలీక్రుతుడిని కాలేకపోయాను. But I enjoyed reading it. యామిని దేవి మరియు మురళీకృష్ణ గారి స్పందనలు అద్భుతముగా అనిపించినయి. వాళ్ళు కూడా రచయితలు అయి ఉండవచ్చు అని అనిపిస్తున్నది.
    .

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!