[బాలబాలికల కోసం పక్షుల పొడుపు కథలు అందిస్తున్నారు డా. కందేపి రాణీప్రసాద్.]
ప్రశ్నలు: 1) మేఘావృతమైన ఆకాశం మేను విదిల్చి చేసే నాట్యం పక్షి జాతిలో పెట్టెను కిరీటం
2) తెల్లారిందని నిద్ర లేపుతుంది ఇల్లెక్కి గట్టిగా అరుస్తుంది పిల్లల్ని వెంటేసుకు తిరుగుతుంది
3) మామిడి చివుళ్ళు నములుతుంది మధుర స్వరంలో ఆలపిస్తుంది నలుపు కాదు నైపుణ్యం చూడమంటుంది
4) చుట్టు పక్కల చెట్టు మీద ఉంటుంది పిల్లల కథల్లో కావు కావున విహరిస్తుంది పితరుల అన్నం తిని సంతోష పరుస్తుంది
5) పలికినవన్ని తిరిగి అప్ప చెప్పుతుంది పలువురికి జోస్యం కూడా చెపుతుంది రంగుల్లో ప్రత్యేకత కలిగి ఉన్నది
6) వడ్లగింజలను ఒలుచుకు తింటుంది బియ్యం తిని పోట్టును పారేస్తుంది చూరులో చేరి గోల గోల చేస్తుంది
7) చెట్టు బెరడును తొలుస్తుంది చెక్కను చీల్చి గూడు కడుతుంది చెక్క పనిని ఇంటి పేరు చేసుకుంది
8) నీటిలోన ఈదుతుంది నేల మీద నడుస్తుంది నింగిలో ఎగిరి వలస పోతుంది
9) కోడి పిల్లల్ని రివ్వున తన్నుకుపోతుంది ఆకాశంలో ఎంతో ఎత్తున ఎగురుతుంది సునిశిత దృష్టిని కలిగి ఉంటుంది
10) చనిపోయిన జీవుల్ని పీక్కుతింటుంది స్కావెంజర్ గా భూమికి మేలు చేస్తుంది అడవులు తగ్గి అంతర్థానమవుతుంది
11) మానస సరోవరంలో నివసిస్తుంది మరల సందేశాన్ని మోసుకు వస్తుంది సరస్వతి దేవి వాహనంగా పేరు పొందింది
12) ఒంటి కాలి మీద జపం చేస్తుంది నీటి మడుగుల్లో బాగా నివసిస్తుంది మెడ పొడుగుతో పేరు తెచ్చుకుంది
13) లక్ష్మి దేవీ వాహనమై తిరుగుతుంది మిడిగుర్లుతో అందవికారంగా ఉంటుంది రాత్రిపూట మాత్రమే సంచరిస్తుంది
14) పక్షులకు రాజు విష్ణువు వాహనం పాముల శత్రువు
జవాబులు: 1. నెమలి 2. కోడి 3. కోయిల 4. కాకి 5. చిలుక 6. పిచ్చుక 7. వడ్రంగి పిట్ట 8. బాతు 9. డేగ 10. రాబందు 11. హంస 12. కొంగ 13. గుడ్లగూబ 14. గండ భేరుండ/ గరుడ
డా. కందేపి రాణీప్రసాద్ MA, MSc, PHD, బాల సాహితీ వేత్త, కవయిత్రి, అనువాదకులు, చిత్ర కళాకారిణి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట మహిళా పురస్కారం అందుకున్నారు. తెలుగు విశ్వ విద్యాలయం వారి ఉత్తమ రచయిత్రి పురస్కారం అందుకున్నారు. రాణీ ప్రసాద్ ఆర్ట్ పేరుతో హాస్పిటల్ వేస్ట్‌తో 4000 బొమ్మలను సృష్టించారు. బాల సాహిత్యంలో 48 పుస్తకాలు రచించారు. ‘తెలుగు బాల సాహిత్యంలో సైన్స్ రచనలు’ అనే అంశంపై నాగార్జున విశ్వవిద్యాలయంలో పరిశోధన చేశారు. తెలుగు విశ్వ విద్యాలయంలో బాల సాహిత్య కీర్తి పురస్కారాన్ని నెలకొల్పారు. మిల్కీ మ్యూజియం, స్వీటీ చిల్డ్రన్ లైబ్రరీ లను తమ ఆసుపత్రిలో పిల్లల కోసం నిర్వహిస్తున్నారు. తమ సొంత ఆసుపత్రిలో ప్రిస్క్రిప్షన్ పాడ్ మీద పిల్లల కోసం తెలుగు పాట, బొమ్మ పెట్టి ప్రింట్ చేస్తున్నారు. సైన్సు, యాత్రా సాహిత్యం విరివిగా రాస్తున్నారు. కళాభారతి, కవిత వాణి, చిత్ర కళారాణి అనే ఎన్నో బిరుదులను, 6 వరల్డ్ రికార్డ్స్నూ సొంతం చేసుకున్నారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
నాటకకర్తగా ‘ఆకెళ్ళ’
సంచిక పదసోపానం-2
అబ్బ మనసు
నాన్న చేతులు
సంగ్రామం
అంతర్వేగం
మంచి చేస్తేనే
రైతన్నకు బాసటగా ‘సమరభేరి’
జ్ఞాపకాల పందిరి-113
పి.వి నరసింహారావు – సృజనాత్మక రచనలు – విశ్లేషణ
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®