పూర్వం ఉపాధ్యాయులు, వారు పనిచేసే చోటే ఉండేవారు. దానికి కారణాలు అనేకం. కారణం ఏదైనా అప్పటి పరిస్థితులు అలాంటివి. బడిలో పిల్లలకు పాఠాలు చెప్పడమే కాకుండా, ఊరి ప్రజల ఆరోగ్యానికి సంబంధించి, ప్రాథమిక చికిత్స, చిన్న – చిన్న సమస్యలకు వైద్యం కూడా వారికున్న అనుభవంతో చేసేవారు. కొన్ని మారుమూల ప్రాంతాలలో డెలివరీలు చేసిన సంఘటనలు కూడా వున్నాయి. ఆ విధంగా ప్రజల అభిమానాన్ని, గౌరవాన్ని చూరగొనేవారు. అలా ప్రజల్లో గొప్ప ఆదరణ పొందేవారు. పిల్లల పై చదువులకు సంబంధించి, సలహాలూ – సూచనలు, గ్రామాభివృద్ధి కోసం యువతలో చైతన్యం తీసుకురావడం, రాజకీయ చైతన్యం తీసుకురావడం వంటి మంచి పనులు చేసేవారు. సాహిత్య -సాంస్కృతిక విజ్ఞానాన్ని అందించేవారు. కుల వృత్తులు – చేతి వృత్తులను అధికంగా ప్రోత్సహించేవారు. నిజానికి వారు, నిర్దేశిత సమయంలో వారి ఉద్యోగం చేసుకుని, హాయిగా ఇంట్లో కూర్చోవచ్చు. కానీ వారు అలా చేయలేదు. గ్రామాభివృద్ధిని, సామాజిక చైతన్యాన్ని దృష్టిలో వుంచుకుని, వారికి చేతనయినంత సహాయాన్ని తమ బాధ్యతగా తీసుకుని అందించేవారు. అది ‘పని చేసిన చోటే నివాసం ఉండడం’ వల్ల మాత్రమే సాధ్యం అయింది. ఇది ఇతర ఉద్యోగులు కూడా చేసే అవకాశం వున్నా, ప్రజలతో ఎక్కువ సత్సంబంధాలు కలిగిన ఉపాధ్యాయులకు మాత్రమే సాధ్యం అయింది. ఆ వృత్తి అలాంటిది మరి!
ఒక దంతవైద్యుడిగా, నాకు కూడా అంతో ఇంతో సామాజిక సేవ చేసే అవకాశం దక్కింది. నా వృత్తి – ప్రవృత్తి దానికి బాగా ఉపయోగపడ్డాయి. తత్ఫలితంగా, ప్రజా సంబంధాలు అమితంగా ఏర్పడ్డాయి. ఒక ప్రత్యేక గుర్తింపు రావడం కూడా నా అదృష్టం!
ఈ నేపథ్యంలో, ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడి, వారి ప్రత్యేక సమావేశాలలో, దంత సంరక్షణ –నోటి పరిశుభ్రత గురించి ఉపన్యసించేవాడిని. తద్వారా పిల్లలకు ఆ విజ్ఞానం అందుతుందన్నది నా ఆలోచన. అవి చాలా విజయవంతమైనాయి. తర్వాత ప్రభుత్వ/ప్రయివేట్ పాఠశాలల – ప్రధానోపాధ్యాయులతో సంప్రదించి, వారికి అనుకూలమైన సమయంలో పిల్లలకు వారికి అర్థమయ్యే రీతిలో నోటి పరిశుభ్రత -దంత సంరక్షణ గురించి, దంతసమస్యల ప్రభావం,శరీరంపై ఎంత ప్రమాదం తీసుకొస్తుందో తెలియచెప్పేవాడిని. ఇంచుమించు,ఇలా మొత్తం మహబూబాబాద్-దాని పరిసర ప్రాంతాలు కవర్ చేసాను. అప్పుడప్పుడూ పాఠశాలలో, దంతవైద్య పరీక్షా శిబిరాలు ఏర్పాటు చేసి, అవసరమైన చికిత్సలు చేసేవాడిని. పిల్లలకు ఉచితంగా టూత్ బ్రష్‌లు పంచేవాడిని.
చాలా సంవత్సరాలుగా మహబూబాబాద్‌లో మూతపడి వున్న సాహిత్య-సంస్థ ‘సారస్వత మేఖల’ ను పునః ప్రారంభించి, ఆదివారాలు సమావేశాలు ఏర్పాటు చేసేవాడిని. కవి సమ్మేళనాలు ఉండేవి. రాత పత్రిక నడిపేవాళ్ళం. సారస్వత మేఖల స్థాపకులు శ్రీ చౌడవరపు పురుషోత్తంగారు (మహబూబాబాద్ లో వ్యాపారస్తులు) బాగా ప్రోత్సహించేవారు. డా.మజీద్ (ఆర్.ఎం.పి -వైద్యం చేసేవారు,ఎక్కువ రైల్వే స్టేషన్ లో కనిపించేవారు, రైళ్లలో తిరుగుతుండేవారు) కవిత్వం రాసేవారు. ఎప్పుడూ ఆయన జేబులో కవిత రాసిన కాగితం ఉండేది. నరసింహారెడ్డి గారు (టీచర్), శ్రీరామ్ చేపూరి (లెక్కల మాష్టారు), గొట్టిపర్తి యాదగిరి రావు (ఆంధ్రాబ్యాంకు – ఉద్యోగి), సత్యన్నారాయణ (రచన.. క్లాత్ స్టోర్స్) వంటి వారు, కవిత్వం రాసేవారు. ఆప్పటి డి.ఎస్.పి శ్రీ ఆకుల రామకృష్ణ గారు, సాహితీ ప్రియులు కావడం మూలాన, మమ్మల్ని బాగా ప్రోత్సహించేవారు. వారి సహకారం వారి సహకారంతో కళాశాల విద్యార్థులతో కవిసమ్మేళనాలు ఏర్పాటు చేసేవాళ్ళం.
నా ఈ కార్యక్రమాలన్నీ, అక్కడ స్థానిక లాయర్ చలపతి రావు గారు గమనించారు. ఆయన, అప్పుడు ‘భారత్ వికాస్ పరిషత్’ మహబూబాబాద్ శాఖకు అధ్యక్షులుగానూ, సలహాదారుగానూ ఉండేవారు. ఆయన దృష్టి నా మీద పడింది. ఒక ఆదివారం రోజు కొందరిని వెంటబెట్టుకుని మా ఇంటికి వచ్చారాయన. మాటా -మంతీ అయిన తర్వాత, భారత్ వికాస్ పరిషత్ స్వచ్ఛంద సేవా సంస్థ గురించి విపులీకరించి,ఆ సంస్థకు అధ్యక్ష బాధ్యతలు తీసుకొమ్మని సలహా ఇచ్చారు.
భారత్ వికాస్ పరిషత్ – అంటే, భారతీయ జనతా పార్టీకి సోదర సంస్థ. ప్రభుత్వ ఉద్యోగిగా, నేను పార్టీల కతీతంగా పనిచేయాలని, అందుచేత నన్ను వదిలేయమని చలపతిరావు గారిని అభ్యర్ధించాను, అందుకు ఆయన, పార్టీపరంగా ఎలాంటి కార్యక్రమాలూ ఉండవని, అన్నిపార్టీల వాళ్ళు ఇందులో సభ్యులుగా వున్నారని, కేవలం సేవా కార్యక్రమాలకు మాత్రమే ఈ సంస్థ పరిమితమై ఉంటుందని నాకు నచ్చజెప్పారు. నిజానికి నేను కమ్యూనిస్ట్ కుటుంబం నుండి వచ్చిన వాడిని. అప్పట్లో తెలుగు దేశం పార్టీని ప్రేమిసున్నవాడిని, అయినా సేవా కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని, చలపతి రావు గారి ఆహ్వానాన్ని, ఆనందంగా ఒప్పుకున్నాను.
భారత్ వికాస్ పరిషత్ -మానుకోట శాఖ నన్ను అధ్యక్షుడిని చేసారు. ఈ సంస్థ ద్వారా సమాజానికి ఉపయోగపడే చాలా మంచి కార్యక్రమాలు జరిగేవి. ప్రతి సంవత్సరం,శాఖ/జిల్లా/రాష్ట్ర/జాతీయ -స్థాయి, బృంద గాన పోటీలు, యువతీ యువకులను బాగా ఆకర్షించేవి. పాఠశాలల యాజమాన్యాలు ఈ పోటీలకు బాగా సహకరించేవి. వికలాంగులకు కృత్రిమ అవయవ పంపిణీ మరో ముఖ్యమైన కార్యక్రమం. మహనీయుల జయంతి /వర్ధంతుల సందర్భంగా,వారి గురించిన ఉపన్యాసాలు తప్పక ఉండేవి. ప్రముఖ యువ సినీమా సంగీత దర్శకుడు స్వర్గీయ చక్రి, ఫేషన్ డిసైనర్గా ప్రసిద్ధికెక్కిన శ్రీమతి మంగా రెడ్డి, భారత్ వికాస్ పరిషత్ – మానుకోట శాఖ, బృందగాన పోటీలకు ప్రాతినిధ్యం వహించిన వారే!
నేను స్వయంగా మహబూబాబాద్ ప్రయాణికుల కోసం, ఒక చక్కని కార్యక్రమం కోసం ప్రయత్నం చేసి సఫలీకృతుడిని అయినప్పటికీ, అది కిట్టని ప్రాంతీయ శాసన సభ్యుడు, దానికి వ్యతిరేకంగా పని చేసి, ప్రజోపయోగకరమైన ఒక మంచి పని కొనసాయకుండా చేసాడు. రాజకీయం తలపెట్టే దుర్మార్గాలకు ఇదొక మంచి ఉదాహరణ మాత్రమే!
భారత్ వికాస్ పరిషత్ -మానుకోట శాఖ,అధ్యక్షుడి హోదాలో నేను మహబూబాబాద్ నుండి నాగార్జునసాగర్‌కు ఒక ఆర్.టి.సి. బస్సు కోసం విశ్వ ప్రయత్నం చేసాను. అధికారులతో, ఒక సంవత్సరం పాటు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగిన తర్వాత, ఒక శుభోదయన ఆర్.టి.సి అధికారుల నుండి లేఖ వచ్చింది నాకు. ఫలానా రోజున, మహబూబాబాద్ నుండి సాగర్‌కు బస్సు ప్రారంభిస్తున్నామని, ఆ సమయానికి అక్కడికి నన్ను కూడా వెళ్ళమని ఆ లేఖ సారాంశం. ఇది నన్ను చాలా సంతోషపెట్టిన అంశం. బస్సు ప్రారంభమైంది, తొర్రూరు – దంతాలపల్లి మీదుగాఎప్పుడూ బస్సు నిండా పాసెంజర్లతో బస్సు నడిచేది. ఒక నెల రోజుల తర్వాత ఏదో సాంకేతిక అంశం లేవనెత్తి, బస్సును రద్దు చేసారు. అలా ప్రజలకు ఉపయోగపడే ఒక సౌలభ్యానికి రాజకీయం అడ్డుపడింది. విషయం తెలిసి నేను బాధపడడం తప్ప ఏమీ చేయలేక పోయాను.
ఇలా.. నా వృత్తిపరంగానూ, ప్రవృత్తిపరంగానూ, నా ఉద్యోగ బాధ్యతలకు తోడుగా, ఇతర సేవా కార్యక్రమాలను చేయగలిగాను. తద్వారా ప్రజా మన్ననలను అధికంగా పొందగలిగాను.1994లో, నేను మహబూబాబాద్ నుండి బదిలీ అయినా,ఇప్పటికీ అక్కడి ప్రజలు-ప్రముఖులు నన్నుమర్చిపోకపోవడమే నాకు మిగిలిన గొప్ప ‘తృప్తి’!!
(మళ్ళీ కలుద్దాం)
వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
వృత్తితో పాటు ప్రవృత్తిలో మీ నిబద్దత ఈ వ్యాసం తెలుపుతుంది. అందుకే మానుకోటను మీరు వదలినా ఇంకా అక్కడి ప్రజలు మిమ్మల్ని గుర్తుపెట్టుకోవడం మీ శ్రమకు దక్కిన పలితం సర్ . మీకు అభినందనలు
Good morning doctorgaru, Hats off to your social service attitude. The satisfaction you derive is countless.
—- suryanarayana rap Hyderabad
నమస్కారం.
మీ మానుకోట పూర్వ ఆశ్రమ జ్ఞాపకాలు పదిలంగా మీ మనసులో దాచుకొని మాకు అందించినందుకు కృతజ్ఞతలు.
కాలానుగుణంగా జరిగిన మార్పుల వలన అక్కడి ప్రజల జీవన స్రవంతి లో కలిసిపోయిన ఆ సువాసనలు తిరిగి మాకు అందించి మా లాంటి వారికి మానుకోట మీద మరింత గౌరవం పెంచడం లో మీ వంతుగా పాత్ర పోషించిన మీ కు సర్వదా అభినందనలు.
సాహిత్య పిపాస కలిగిన మీ వంటి వారికి కొంత కాలం తన వొడిలో సేద దీరనిచ్చి నందుకు మానుకోట కు సర్వ విధాలా మీ వంతుగా అంతులేని సేవలందించిన మీరు నిజముగా చిర స్మరనియులు.
కాజా వెంకట శ్రీనివాసరావు.
మీ స్పందనకు ధన్య వాదాలు శ్రీనివాస రావు.
అవగాహన అన్నింటికంటే ముఖ్యమైనది. మీరు,మీలాంటి పద్దలు ఆ కాలంలో గ్రామాలు, పాఠశాలల్లో చేపట్టిన అవగాహన కార్యక్రమాలు ఇప్పుడు సత్ఫలితాలను ఇచ్చినట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే జిల్లా మొత్తం లో పది మంది కూడా లేని దంత వైద్యుల సంఖ్య ఇప్పుడు సుమారుగాఒక వంద కుచేరడం దాని ఫలితమే.
శ్రీనివాస్ మీ స్పందన కు ధన్యవాదాలండీ .
అర్థవంతం ఐన అనుభవాలు.
—–రావులపాటి సీతా రామారావు హైదారాబాద్.
ధన్యవాదాలండీ.
It’s auto biography, but well defined about social responsibility of a person. It seems you have succeeded here. Great
[01/11, 09:19] Shyam Kumar: Well observed and written. [01/11, 09:20] Shyam Kumar: Autobiography but you defined thd social responsibility of a person. You are successful here
—–shyam kumar Nizamabad.
Thank you Shyam
ఇప్పుడే చదివాను అండి మీ యొక్క జ్ఞాపకాల పందిరి కి నా యొక్క ప్రాణములు, జ్ఞాపకం ఉంచుకొని యధాతథంగా వ్రాయటం మీ యొక్క వ్యక్తిత్వం తెలుపుతుంది ఇది చదివాక నేను కూడా కొంత సేపు ఆ కాలానికి వెళ్ళిపోయాను ధన్యవాదాలు డాక్టర్ గారు —–సి.హెచ్.కరుణా కర్ అమెరికా…
మీరు మహబూబాబాద్ లో బాగా గడిపిన రోజుల మధుర స్మృతుల ని బాగా రాశారు
—-డా.డి.సత్యనారాయణ హైదారాబాద్.
ధన్యవాదాలండీ
చదివాను.మరోసారి మధుర స్మృతులు గుర్తుకు తెచ్చుకునే అవకాశం కల్పించారు.కృతజ్ఞతలు
—–చేపూరి శ్రీరాం హనంకొండ
చాలా బాగుంది సార్ మీ ఙాపకాలపందిరి ఈ వారం.👌 నిజాయితీ, మంచి మనసులతో చేసే మీ వృత్తి,ప్రవృత్తి ఎక్కడైనా మీకు సంతృప్తిని, సంతోషాన్నిచ్చింది.అంతకన్నా కావలసినది ఇంకేముంటుంది!ఎందరికో స్ఫూర్తిదాయకం మీరు. మీకు ధన్యవాదాలు, నమస్సులు. 🙏🙏
—-డా.విద్యాదేవి హనంకొండ
అమ్మా ధన్యవాదాలు
సహజంగా ,కొన్నిగుణాలు పుట్టుక తోపాటుగా పుట్టుకొస్తాయి .అవి కళలు ,పరోపకారం ,సామాజికచింతన లాంటివి. వాటినిప్రదర్శించడంవల్ల కనిపించని పుణ్యము ,కనిపించే స్నేహ ,కీర్తి ,ప్రేమలు వాటంతట అవే మనలను అలరిస్తుంటాయి. అవకాశా లు కూడా మీకు అడ్వకేటు గారిద్వారా ఏర్పడినట్టు కొందరికి కల్గుతుంటాయి మంచి పనిని ప్రోత్సహించే వారుంటారు ,బస్సుప్రయాణాన్ని నిలిపినట్లుగా చెడగొట్టే వారుంటారు ఏదిఏమైనా వృత్తిలోను ,ప్రవృత్తిలోను తృప్తిగా పనిచేసినమీకు అభినందనలు
—-డా.వజ్జల రంగా చార్య హనంకొండ
మీరు సామాన్యులు కారు మాన్యులు సార్ మీరు అసలు పనికి తోడు కొసరు పనులు కూడా చేస్తారు మీ అభ్యుదయ భావాలకు మీకృషి తోడై పరిపూర్ణ మైన వ్యక్తిగా ఉన్నందుకు సదా మీరు అభినందనీయులు🙏
—-కె.శ్రీహరి. హనంకొండ.
సేవాకార్యక్రమాలలో అటు పోట్లు సహజం…. నిలదొక్కుకుని ముందుకు సాగవలసి వుంటుంది….ఏది ఏమైనా మనలో ఆ దృక్పథం అంతో యింతో కొనసాగుతూనే ఉంటుంది….మీ ఆసక్తికి అనుగుణంగా కార్యక్రమాల రూపకల్పనలో కృతకృత్యులయ్యారనే చెప్పాలి….
ఎస్.వి.ఎల్.ఎన్.శర్మ హైదారాబాద్.
మానుకోట మీకు మరపురాని జ్ణాపకాల మూట..వృత్తిరీత్యా, ప్రవృత్తిరీత్యా మీకు ఇష్టమైన, సమాజానికి హితమైన పనులు చేసి చాలా తృప్తిగా ఉన్నారు.
———డా.మల్లికార్జున్ హనంకొండ.
Doctor Garu! Aa rojullo Graameenaabhi Vrudhi kosam cheshina samaja sevaa kaaryakramaallo ,meetho kalsi paalgonatam naa Adrushtam.. Baagaa gurthosthunnaayi… 🙏🙏🙏
ఉద్యోగరీత్యా దంత వైద్యులుగా,కవిగా, ప్రజల్లో దంతాల రక్షణకు అవగాహన కలిగిస్తూ సేవ చేసిన మీకు అభినందనలు సార్.మనసుంటే మార్గం ఉంటుందని నిరూపించారు.
అమ్మా నీ స్పందన కు ధన్యవాదాలమ్మా
మీ వృత్తి తో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, ప్రజలలో చైతన్యం తీసుకుని వచ్చే సాంఘీక,సాహిత్య కార్యక్రమాలు,పాఠశాలకు వెళ్లి పిల్లలకు దంతసంరక్షణ పై అవగాహన కల్పించడం లాంటి గొప్ప పనులు సమాజానికి మీవంతు సహాయం చేయాలనే మీ విశాల దృక్పథం అర్థం అవుతోంది సర్. మీరు ఎంతో కృషి చేసి ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించడం RTC వారి సౌజన్యంతో కోసం బస్ ఏర్పాటు చేసిన కీయ కారణాల వల్ల బస్ ను రద్దు చేయడం భాథకరం సర్. ఇప్పటికీ కొంతమంది పెద్దలు సమాజానికి ఏదైనా చేయాలని అనుకున్నా ఈ కుటిల రాజకీయాల వల్లనే చేయడానికి ముందుకు రాని పరిస్థితి సర్. మీ మానుకోట జ్ఞాపకాలు,ఫోటోలు చాలా బాగున్నాయి సర్…..మీ జాని
జానీ బాబూ మీ స్పందనకు ధన్యవాదాలు
మీ వృత్తి నైపుణ్యాన్ని సమాజ సేవ, సమాజ అవగాహన కోసం ఉపయోగించటం హర్షణీయం. భావాలు కలిసిన స్థానిక ప్రముఖలను కలుపుకొని మీరు చేసిన కార్యక్రమాలు మీకు మరపు రాని జ్ఞాపకాలే!
– రాజేంద్ర ప్రసాద్
ప్రసాద్ గారూ మీ స్పందన కు ధన్యవాదాలండీ .
మీరన్నట్టు ఉపాధ్యాయులు గ్రామఅభివృద్ధిలొ ప్రముఖపాత్ర పొషించారు.ెఇటువంటి మంచి జ్ఞాపకాలే. మనిషిని రిచార్జ్ చేస్తాయి. వృత్తి జీవిక కొసం ఐతే ప్రవృత్తి మానసికతృప్తి కొసం .మీ ప్రవృత్తి మిమ్మల్ని అక్కడి వారింకా మిమ్మల్ని గుర్తుపెట్టుకునేటట్టు చేసిందనటంలొ సందేహం లేదు.చక్కటి జ్ఞాపకాలు డాక్టర్ గారూ ! అభినందనలు. —రామశాస్త్రి
ధన్యవాదాలండీ శాస్త్రి గారూ..
కార్యక్రమాల నిర్వహణ అంత సులభం కాదు…. ముందుకు సాగనీయరు…. మంచి ఉద్దేశ్యంతో నిర్వహించాలని చూసినా ఎంతో కొంత అవరోధాలు కలుగుతునే వుంటాయి….ఎన్నో అనుభవాలు…. అందుకే ప్రస్తుతం ఆరోగ్య రీత్యా కూడా ఓపిక లేక…. అన్నిటికీ స్వస్తి…. ఇంట్లోనే…ఏదో వ్రాసుకోవడం….చదువుకోవటం….చేసినంత వరకు ఎంతో కొంత తృప్తిగా చేయగలిగాననే భావన….it is the value of time one has to make useful to others to the possible extent….!
—– శర్మ కవి హైదారాబాద్.
Olden days teachers were very sincere and helpful to the villagers. Their children were also studying in govt schools. Presently scenario is changed. Teachers don’t stay in the villages more over they have some business or the other and majority of them are not sincere. Coming to social service one should have interest otherwise it is not possible with out political interference.
—–Dr.M.Manjula Hyderabad.
Thank you somuch Dr.garu.
ఈరోజు జ్ఞాపకాల పందిరిలో దంత వైద్యునిగా మీ అనుభవాలు, సాహిత్యపరమైన అంశాలను మీరు వివరించిన విధానం బాగుంది. ఒకరు చేసిన మంచి పనిని చెడగొట్టడమే నాయకుల పని.
——శ్రీనివాసా చారి.జి కాజీపేట.
Dr.klv garu being a dental surgeon, you have done very good service to the local people it’s really appreciated, some people always negative attitude n jealous to towards who is doing good service because he may get the good name from the people. So always local leaders they feel that their property they only do the things n get the credit. With most enthusiasm you have done both professional service n and the same time more helpful to the local people. Regarding Bus service Just exceeded the limits as employee n non-local. Any how you have done very experienced both positive n nagetiv. Political influence will be there any where you have to see that the follow the track. Thanks for your Gnapakam
Thank you Bro.Rao.
ముందుగా మీ జ్ఞాపక శక్తికి హాట్సాఫ్ మరియు కృతజ్ఞతలు మా మానుకోట ను గుర్తు చేసినందుకు. మీ సంచికలో మా నాన్నగారి స్నేహితులను బంధువులను గుర్తు చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికీ మీరు నాకు గుర్తు ఉన్నారంటే మీయొక్క అభ్యుదయ మార్గాలే. మీతో చాలా మందికి ఉన్న సత్సంబంధాలు అభినందనీయం. అందులో మేము ఉన్నామని చాలా గర్వంగా ఉంది.
మానవుడు వృత్తిలో పడి ఎన్నో ప్రవత్తులు మరచిపోతున్న ఈ తరుణంలో మీ యొక్క అనుభవాలు నాకు ఎంతో బాధ్యతను గుర్తు చేస్తున్నాయి. నిజంగా మీరు చాలా మందికి స్ఫూర్తిదాయకం మార్గదర్శకం.
ప్రతి వారం మీ సంచిక కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఎన్నో మధురమైన స్మృతులు కలిగి ఉంటాయి అవి నా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఉంటాయి.
శిల్పా నీ స్పందన కు ధన్యవాదాలు
ఒక ప్రక్క సామాజిక సేవ ఇంకో ప్రక్క సాహిత్యసేవ మరోప్రక్క ఉద్యోగం అన్నింటినీ మీరు బాధ్యతగా నిర్వర్తించిన తీరు ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. మాలాంటి వాళ్ళను ఎందరినో వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు సర్ 🙏💐
మీ సహృదయత అభినందనీయం సార్ అందరికీ దంత సంరక్షణ ఉచిత అవగాహనతో పాటు ప్రజలకు మంచి చేయాలనే మీ తపనకు జోహార్లు సార్. రాజకీయాలు మంచి చేయక పోయినా కనీసం మీలాంటి వారు చేసిన మంచిని నిలబెట్టినా ఆ సేవ నలుగురికీ ఆనందాన్ని సౌకర్యాన్ని కలుగచేసేది . ఏది ఏమైనా అక్కడి ప్రజల గుండెల్లో మీరు గూడుకట్టుకుని ఉన్నారు.మీ పాత జ్ఞాపకాల పొది ఎప్పుడూ మధురమే సార్. హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు మీకు. మీ మరో జ్ఞాపకం కోసం ఎదురు చూస్తుంటాం 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏
చదివాను సార్. మీ అనుభవాలు అమూల్యం.
—-రాంబాబు కవి.
అమ్మా మీ స్పందన కు ధన్యవాదాలండీ .
అఫ్సరా… నీ స్పందన కు ధన్యవాదాలు
సర్ ముందుగా మీ జ్ఞాపక శక్తికి జోహార్లు🙏🙏 వృత్తి కి న్యాయం చేస్తూనే ప్రవృత్తి లో భాగమైన రచన తో పాటు సామజిక బాధ్యత ను మీరు సమర్థవంతంగా నిర్వహించడం చాలా గొప్ప విషయం సర్ 🙏🙏
———కె.కళా వతి హైదారాబాద్
కళావతి గారూ మీ స్పందన కు ధన్యవాదాలండీ
మంచిని ఆనుకొని చెడుఎపుడుా ఉంటుంది. కాని చెడు యెక్క ఫలితాన్ని బట్టి దాన్నిమ గురుతు ఉంచుకోవడము జరుగుతుంది. రాజకీయాలు ఉన్నంతవరకు అటువంటివి తప్పవు. చంద్రశేఖర్:
శేఖర్ ధన్యవాదాలు
నిస్వార్ధ సేవా దృక్పథం కలిగి వుండడం చాలా అరుదు. మీరు వినూతన రీతిలో సమాజ సేవ చేయడం చాలా సంతోషం. అందరికీ ఇలాంటి గుణం ఉండదు. మీకు ధన్యవాదాలు 🙏
—–ప్రొ.రవి కుమార్ కాజీపేట
సొదరా మీ స్పందన కు ధన్యవాదాలు.
సాహితీ సేవచేయడం, నలుగురినీ కూడగట్టుకుని సమావేశాలు నిర్వహించడం..అభినందనీయం. బస్సు సర్వీసు ఏర్పాటు చేసి సామాన్య ప్రజానీకానికి కూడా మేలు చేశారు. రాజకీయాలకు, సాహిత్యానికి పొంతన కుదరదు.
సరసి గారూ ధన్య వాదాలు
The social services rendered by you are very much commendable. I know your capabilities and have personal experience while working with you in Sahridaya organisation in Warangal. You don’t wait for opportunities but you create opportunities yourself and do full justice to the programme in conducting, fund raising and make grand success of all programmes. You are able to make your dreams come true.
Thank you So much Murthy garu.
పూర్తిగా చదివాను.మీ సేవా సంస్థ ద్వారా ,ఓ డాక్టరుగా బడుగు బలహిన వర్గాల ప్రజలకు సేవలందించటం హర్షనీయం.మీకు💐💐💐.
—-బొందల నాగేశ్వర రావు చెన్నై.
వృత్తి కేవలం భుక్తి కోసమే కాకుండా సమాజానికి ఉపయోగపడే ఒక సాధనంగా కూడా కొందరే ఉపయోగించుకోగలరు.అది వారి చైతన్య వ్యక్తిత్వం.ఈ రోజు మీ జ్ఞాపకం అటువంటి చైతన్య ప్రవాహమే.మీ హృదయాన్ని చాలా విస్తరించి సమాజంలో మీదైన చరిత్రను లిఖించుకోగలిగారు.మాలాంటి నవతరానికి విలువల్ని వారసత్వంగా అందించేందుకు ఒక గొప్ప ఉదాహరణ గా ఈ జ్ఞాపకాన్ని పంచుకున్నారని భావిస్తున్నాను.మనిషికి అత్యంత ఆవశ్యక మైన “తృప్తి” అనే సంపదను పొందిన మీ చేతన క్రియలు మాలో కొత్త ఆలోచనల్ని రేకెత్తిస్తోంది. ధన్యవాదాలు సర్.ఏ రోజులకైనా ఉపయోగించే గొప్ప మానవత్వ అనుభవాల్ని పంచినందుకు🙏💐 —-డి.నాగ జ్యొతీ శేఖర్ కాకినాడ
అమ్మా.. బాగా రాసారు ధన్యవాదాలు
Chala baagundi sir, golden daysni gurthu chesaru
—-కె.జె.శ్రీనివాస్ హైదారాబాద్.
శ్రీనివాస్ గారూ మీ స్పందన కు ధన్యవాదాలండీ .
డాక్టర్ గారు.. మీ జ్ఞాపకాల పందిరి చాలా బావుంది.. సమాజం పట్ల మీ నిబద్దత అభినందనీయం..
ధన్యవాదాలు
Really your services still needed to the society…The dynamic decisions made you more important to your working responsibility besides the family and job. Good guidance to. many who wants to serve. Very passionating. Good narration asusual 💐💐🙏
—–Dr.Jhansi Nirmala Sakhinetipalli
Thank you Doctor.
Great sir, It’s very rare to see people like you who determined to do such things. Hope, we do follow.
——-డా.హారిక కరీం నగర్
Thank you Dr.Harika
ప్రసాద్ గారు మహబూబాబాద్ గురించి చదివాను. చాలాబాగుంది. ప్రెసెంటేషన్ చాలా బాగుంది. బుక్లెట్ రూపంలో బాగుంటుంది. ధన్యవాదములు.
—ఎన్.వి.చలపతి రావు మహబూబాబాద్.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™