పక్క దేశంలో పసుపు నీలం పోరాటం
కాషాయం కషాయం తాగిస్తోంది
గులాబీ కమలం గుద్దులాట
మూడు రంగుల ముసలి పార్టీ
మధ్యలో చేతిని అడ్డం పెట్టింది
ఎర్ర రంగు చూద్దామంటే ఎక్కడా లేదు
మన్నిక లేని ఎన్నికలలో ఎన్ని కలలో
సామాన్యుడి చెమట కన్నీరు
ఆషాఢంలో వానలా కురుస్తోంది
అఖండ దేశంలో ఎందరో ఉన్నా
ఎవరికి వారే యమునా తీరే

భావుకుడు, కవి శంకరప్రసాద్. ఇప్పుడిప్పుడే తన కవితలతో, కథలతో సాహిత్య ప్రపంచంలోకి అడుగిడుతున్నాడు.