సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    “రావణ రహస్యం” లో ఈ వారం ప్రస్తావించిన అంశాలు అన్నీ బాగున్నాయి. నిజమే! రామాయణం లోని పాత్రల స్వభావాలు అన్నీ నిజజీవితానికి దర్పణాలు. అవి సార్వజనీన మైనవి, కాలాతీతమైనవి (కాలానికి అతీతమైనవి). కనుకనే వేల సంవత్సరాల నుంచీ ఇప్పటిదాకా అందరూ చదువుకుంటూ ఉన్నారు…… మంధర, శూర్పణఖ వంటి కొన్ని పాత్రలే కాదు, చాలా పాత్రలు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాయి. విశ్వామిత్రుడు బాలకాండ లో మాత్రమే కనిపిస్తాడు. తర్వాత అయన ప్రసక్తి ఎక్కడా రాదు. శబరి అరణ్యకాండ లో మాత్రమే కనిపిస్తుంది. సింహిక, సురస, త్రిజట వంటి వారు సుందరకాండ లో ఇలా…… కొద్దిసేపు కనిపించినా ఏ పాత్ర ప్రత్యేకత దానిదే!

  2. 2

    గోనుగుంట మురళీకృష్ణ

    మంధర “దుందుభి” అనే గంధర్వకాంత. ఈమెకి తల్లి దండ్రులు, భర్త వంటి వారు ఎవరూ లేరు. దేవతల ప్రార్ధనల మీద రావణ సంహారాని కోసం బ్రహ్మదేవుడే ఆమెని కుబ్జ రూపంలో సృష్టిస్తాడు. అయన నిర్ణయాన్ని అనుసరించే కైకేయికి దుర్భోధలు చేస్తుంది మంధర………తార ని వాలిసుగ్రీవులు ఇద్దరికీ ఉమ్మడి భార్యగా ఇస్తారు దేవతలు……… తాటక సంహారం గురించి – స్త్రీబాల వృద్ధులను సంహరించ కూడదని యుద్ద నీతి. తాటకను సంహరించటానికి రాముడు వెనకాడుతుంటే “దుష్టుల పట్ల యుద్దనీతిని పాటించాల్సిన అవసరం లేదు” అని చెబుతాడు విశ్వామిత్రుడు……శూర్పణఖ – ఆనాటి రాజధర్మం ప్రకారం అత్యాచార యత్నం చేసిన స్త్రీలకు ముక్కు చెవులు కోయటం శిక్ష. లక్ష్మణుడు రాజధర్మం ప్రకారమే చేశాడు. (ఈ విషయాలు అన్నీ గతంలో నేను “శ్రీరాముడి మీద నిందారోపణలు – వాస్తవాలు” అనే వ్యాసంలో చెప్పాను. సంచిక లోనే వచ్చింది)

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!