“వేటగాడు ఏసిన బాణం కాలికి తగిలి మన దేవాది దేవుడు కిష్ణ దేవుడు
సచ్చిపోయ కదనా?”
“అవునురా”
“ఏసు ప్రభువుని మళలు (మేకులు) కొట్టి చంపిరి కదనా?”
“నిజమురా”
“ఇంగ అల్లా దేవుడు కూడా కాయిలా వచ్చి సచ్చిపోయినంటా?”
“అవును… అవునురా?”
“ఏలనా ఇట్ల దేవది దేవుళ్లకి ఇట్లా సావు ఏల వచ్చెనా?”
“రేయ్! వీళ్లకే కాదురా ఈ భూలోకములా దేవుళ్లమని, దేవుని
వారసులమని కీర్తి పొందిన వాళ్లు సచ్చిపోయిరిరా”
“అదే ఏల ఇట్లాయ అని అడగతా వుండానా”
“ఏలంటే దేవుడైన జీవుడైన అంతా ప్రకృతమ్మ బిడ్డలేరా.
అమ్మ ఒడిలో పుట్టి, పెరిగి, వొరిగి పోవాల్సిందేరా”
“అవునా మడి బూలోక జనాలు అంటారు మా దేవుడంటే మా
దేవుడే ప్రకృతమ్మని పుట్టిచే” అని అంట్ని.
“నాకి అదే సందేహమురా వీళ్లే ప్రకృతమ్మని పుట్టిచ్చి, పెరిగి
చింటే వాళ్ల ప్రకృతమ్మని ఎదిరిచ్చి నిలవలేదని ఏల సచ్చిరని” అని అనె.
“అవును కదా!” అని నాలా తిరగా సందేహము సురువాయ.
***
సచ్చిరి = చనిపోయిరి
10 Comments
Ranjith Kumar
Very nice
Manasa
Arun
Super sir
Lakshmipathi KV
“ఏలంటే దేవుడైన జీవుడైన అంతా ప్రకృతమ్మ బిడ్డలేరా.
అమ్మ ఒడిలో పుట్టి, పెరిగి, వొరిగి పోవాల్సిందేరా” We have to realise the reality.
Bhagyamma
Super……..sir
Madhu
Nice
K.muniraju
డాక్టర్ అగరం వసంత్ గారు రాసిన “సచ్చిరి”కత చాలా బాగుంది. వీరి కలం నుంచి మరిన్ని కథలు రావాలని కోరుకుందాం…మప్పిదాలు
anitha
Nice……Nothing is permanent on this Earth…….Everybody are going to leave this world one or the other day…..So be true, honest , Respect people , value good things……And last be happy and make othes happy.



Madhu
Good Nice
R. Krishna ur thy
Dr. Vasanth Sachchiri story super

very nice