గ్రీష్మానికి రోషమొచ్చినట్టుంది ‘చరిష్మా’ చూపిస్తోంది మధ్యాహ్న మార్తాండుడు యుద్ధప్రకటన చేసినట్టు కిరణాలను నిప్పుకణికలుగాచేసి నగరకుంపటిని రాజేస్తున్నాడు రాజయినా బంటయినా ఇంటిబాటపడుతున్నారు పడుతూలేస్తూ పస్తులున్న పేదమారాజులు పట్టెడన్నానికి మస్తుగున్న ధనమారాజులు చల్లదనపు కలుగుల్లోకి పగబట్టిన గాలి పండువెన్నెలను వదలనంటోంది కర్మసాక్షి కోపానికి తథాగతుడు మౌనంగా లోలోపల నవ్వుకుంటున్నాడేమో ఋతుమోహనమెప్పుడూ సమ్మోహనమే మనిషికే సవాలక్షకోరికలంటూ.
సి. ఎస్. రాంబాబు పేరెన్నికగల కథా రచయిత. కవి. “పసిడి మనసులు” అనే వీరి కథా సంపుటి పలువురి ప్రశంసలు పొందింది.
పగబట్టిన గాలి పండువెన్నెలను కూడా వదలనంటోంది … ఎంత గొప్ప వర్ణనో
బాగుందండీ రాంబాబుగారు
Kavithalo manchi charishma vundi Rambabu Garu Sambasivarao Thota
Your email address will not be published. Required fields are marked *
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
గూఢచారి లాంటి The Wedding Guest
జీవన రమణీయం-85
‘యాత్ర’ చూద్దామా ఎపిసోడ్-11
నీలమత పురాణం – 52
మానస సంచరరే-30: మనసే అందాల బృందావనం!
All rights reserved - Sanchika™