[శ్రీ మరింగంటి శ్రీకాంత్ రచించిన ‘సంప్రదాయ ప్రయోగి – సినారె’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]


ప్రశ్నతో మొదలై ప్రశ్నతోనే
ముగిసిన కమనీయ శిల్ప కావ్యం
సృష్టికి మూలం జ్ఞాన బీజం
విశ్వంభరా భ్రమణానికి మూలం
శాశ్వత చైతన్య తేజం
బహుముఖ ప్రజ్ఞాశాలిగా
ఓ ప్రత్యేక ముద్రగా సుపరిచితులు
మానవతా దృక్పథానికి
మనోజ్ఞరూపాన్ని దిద్దిన శిల్పి
పద్యం నుండి గేయానికి
గేయం నుండి వచనానికి
అభ్యుదయాన్ని సాధించిన కవిచంద్రులు
కవిత్వం రాయకుండా ఉండలేడు
మాతృభాషగా కవిత్వాన్ని ఎంచుకున్నాడు
మానవత్వాన్ని ఇతివృత్తంగా మలచుకున్నాడు
విశ్వంభరతో జ్ఞానపీఠ పురస్కారం
భారత ప్రభుత్వంతో పద్మభూషణ్
మంటలూ-మానవుడూ తో
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
సినారె గా చిరస్మరణీయులు..

శ్రీ మరింగంటి శ్రీకాంత్ గారిది రాజన్న సిరిసిల్లా జిల్లా. తండ్రి గారు రఘరామాచార్యులు.
శ్రీకాంత్ గారి కవితలు పలు పత్రికలలో ప్రచురితమయ్యాయి.