‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.


ఆధారాలు:
అడ్డం:
1. గజేంద్రమోక్షము అనెడి ఓ పురాణ గాథ లోని ఏనుగు, తాబేలు యొక్క కలహం లాగా (9) |
7. సమూహము, వరుస (2) |
8. దండయాత్ర, సేన, గడ్డము, ఔన్నత్యము, దానిమ్మపండు (2) |
9. తొలి చదువులు, జ్ఞానము, ఆది శ్రుతులు (2) |
10. జిల, దురద (2) |
12. శ్రీరాముని సోదరుడు, సుమిత్ర కుమారుడు (4) |
13. సంగ్రహమైన, సంక్షేపంగా, టూకీగా (4) |
14. లక్ష్మి, సంపద, వృద్ధి, శోభ, విషము, పార్వతి, సరస్వతి, మారేడు చెట్టు (1) |
15. సముద్రం, కడలి – వెనుక నుంచి ముందుకి (3) |
18. వంచన, అసత్యము, దుఃఖము, వ్యర్థము (4) |
21. కనకము, సువర్ణము (4) |
22. చెల్లాచెదురైన గణకుడు (4) |
23. ధనము కలవాడు, సంపన్నుడు (2) |
24. మామిడి తోట (5) |
నిలువు:
1. జరిగిపోయిన కాలము (5) |
2. గాననాట్యయోగ్య శబ్దసంతతి, గీతభేదము (2) |
4. పాలు, క్షీరము, కాంతి, పైపూత (4) |
5. ఉపహారము, నియతకాలమందిచ్చెడు విరాళము (2) |
6. గుజరాత్లో ఉప్పు సత్యాగ్రహం ముగిసిన ఊరితో మొదలయ్యే వ్యవసాయ సామెత (9) |
9. పిల్లనగ్రోవి చివర విరిగిపోయింది, బలగం దర్శకుడు (2) |
11. పండితుడు, వాగ్ధాటి కలవాడు, ఉపన్యాసకుడు (2) |
15. క్రింద నుంచి పైకి – శ్రేష్ఠము, సొంపు, కాంతి విశేషము (3) |
16. గడ్డ, ముద్ద (2) |
17. భాగ్యసూచక దేహలక్షణమును తెలుపు శాస్త్రము, సముద్ర సంబంధమయినది (4) |
18. వినయము, అడకువ, నమ్రత (4) |
19. కళింగాంధ్ర మాండలికంలో చిన్న పిల్లవాడు, మొదలు లేదు (2) |
20. పురుషులతో మొదలయ్యే ఓ సామ్రాజ్యం, చివర కోల్పోయింది (2) |
21. కట్టు, కట్టుటకు తగిన సాధనము, కుదువ, చెర, తొడిమ (3) |
ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2025 ఫిబ్రవరి 25 వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్లో ‘సంచిక – పద ప్రతిభ 155 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2025 మార్చ్ 02 తేదీన వెలువడతాయి.
సంచిక – పద ప్రతిభ 153 జవాబులు:
అడ్డం:
1.మధుకము 4. మరుమామ 7. మన బంధువు 8. తేమ 10. మలు 11. రుణిత 13. మనుచు 14. మహిళ 15. మజరె 16. మహిమ 18. లిము 21. తరం 22. మకరతము 24. మటపల్లి/మడపల్లి 25. మణియము
నిలువు:
1.మరుతేరు 2. కమ 3. మునగ 4. మధువు 5. రువు 6. మరలుచు 9. మణిరాజము 10. మనుసంహిత 12. మహితం 15. మలినిమ 17. మరందము 19. మకల్లి 20. మతమ 22. మప 23. ముణి
సంచిక – పద ప్రతిభ 153 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధసాయి జొన్నలగడ్డ
- అరుణరేఖ ముదిగొండ
- సిహెచ్.వి. బృందావన రావు, నెల్లూరు
- దేవగుప్తాపు ప్రసూన, విశాఖపట్టణం
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- కాళీపట్నపు శారద, హైదరాబాద్
- మధుసూదనరావు తల్లాప్రగడ, బెంగుళూరు
- పి.వి. రాజు, హైదరాబాద్
- రామలింగయ్య టి, తెనాలి
- శంభర వెంకట రామ జోగారావు, బెంగుళూరు/ముంబయి
- శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
- విన్నకోట ఫణీంద్ర, హైదరాబాద్
వీరికి అభినందనలు. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్‌లైన్ నెంబరులో (ఉదయం 00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
- గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.

సాహిత్యాభిమానులందరికి వందనములు. నా పేరు పెయ్యేటి సీతామహాలక్ష్మి. ప్రస్తుతం తిరుపతిలో నివాసం. చిన్నప్పటినుండి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం . వాటితోపాటు తెలుగులో పదరంగాలు/పదప్రహేళికలు లాంటివి పూరించడమంటే ఇంకా ఇష్టం. చాల సార్లు నగదు బహుమతులు కూడా లభించాయి. మొదటిసారిగా నేను కూడా ఒక పజిల్ స్వంతంగా రాసి పంపితే శ్రీ కోడిహళ్ళి మురళీమోహన్ గారు మెచ్చుకుని తన “పదచదరంగాలు” అనే పుస్తకం (తెలుగులో మొట్టమొదటి క్రాస్‌వర్డ్ పజిల్ సంకలనం) ప్రచురించి ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. అందుకు వారికి చాల కృతజ్ఞురాలిని. ఇటీవల “తెలుగు సొగసు” అంతర్జాల పత్రికలో కూడా నా పజిల్స్ “పదకేళి” అనే పేరుతో ప్రచురింపబడుతున్నాయి. ఇందుకు శ్రీ దాసరి చంద్ర గారికి కూడా ధన్యవాదములు. సంచిక అంతర్జాల పత్రికలో కూడా నేను సమకూర్చిన గళ్ళనుడికట్టులను (క్రాస్‌వర్డ్ పజిల్స్) ప్రచురిస్తున్నారు. పజిల్స్ అభిమానులందరికి ఇవి ఆనందాన్ని కలిగిస్తాయని ఆశిస్తున్నాను.