సంచిక పాఠకులకు ‘సంచిక పదసోపానం’ అనే కొత్త ప్రహేళికకు స్వాగతం.
శ్రీ కోడీహళ్లి మురళీమోహన్ నిర్వహించే ఈ పజిల్లో ఐదు అక్షరాల పదాలు 12 ఉంటాయి. మొదటి పదం చివరి పదం ఇవ్వబడతాయి. మిగిలిన పదాలు పూరించాలి. మొదటి పదం చివరి రెండు అక్షరాలతో రెండవ పదం ప్రారంభం కావాలి. రెండవ పదం చివరి రెండు అక్షరాలు మూడవ పదం తొలి రెండు అక్షరాలు కావాలి. ఇలా 11వ పదం చివరి రెండు అక్షరాలతో 12 వ పదాన్ని సాధించాలి.
ఉపయోగించే పదాలు/పదబంధాలు అర్థవంతంగా ఉండాలి. నిఘంటువులో ఉన్నవి కాని, మనం వ్యవహారంలో వాడే పదాలను కాని ఉపయోగించాలి. వాడే పదం తిరగమరగగా (REVERSE), గజిబిజిగా (JUMBLE) ఉండరాదు. ఒక పదం చివరి రెండక్షరాలు తరువాతి పదంలో ఉపయోగించినప్పుడు వాటి గుణింతాలు మార్చుకోవచ్చు.
వీటి సమాధానం ఒకటి కంటే ఎక్కువగా ఉండవచ్చు.
~
ఈ పజిల్ని పూరించడంలో మరింత స్పష్టత కోసం – పజిల్ నిర్వాహకులకు ఎదురైన ప్రశ్నలు, వారిచ్చిన జవాబులను ఇక్కడ ఇస్తున్నాము. వీటిని పరిశీలిస్తే, సందేహాలు తొలగుతాయని నిర్వాహకుల అభిప్రాయం.
~
పదసోపానం 13 | |
1 | విజ్ఞానకోశం |
2 | |
3 | |
4 | |
5 | |
6 | |
7 | |
8 | |
9 | |
10 | |
11 | |
12 | వికీపీడియా |
~
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 ఆగస్టు 06 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్లో ‘సంచిక పదసోపానం-13 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2024 ఆగస్టు 11 తేదీన వెలువడతాయి.
సంచిక పదసోపానం 11 కి పజిల్ నిర్వాహకుల జవాబులు:
1.భగవంతుడు 2. తోడుచుక్కలు 3. కలితాపసి 4. పెసరపప్పు 5. పెంపుడుకుక్క 6. కుక్కినపేను 7. పునరావాసం 8. విసనకర్ర 9. కరివేపాకు 10. పేకముక్కలు 11. కాలానుభాగి 12. భాగవతుడు
సంచిక పదసోపానం 11 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధా సాయి జొన్నలగడ్డ
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి. బృందావన రావు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- కరణం రామకుమార్
- కాళీపట్నపు శారద
- కోట శ్రీనివాస రావు
- మధుసూదనరావు తల్లాప్రగడ
- మంజులదత్త కె
- పడమట సుబ్బలక్ష్మి
- పద్మావతి కస్తల
- పి.వి.ఆర్.మూర్తి
- రంగావఝల శారద
- రామకూరు నాగేశ్వరరావు
- రామలింగయ్య టి
- రాయపెద్ది అప్పాశేష శాస్త్రి
- సరస్వతి పొన్నాడ
- శంబర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- వర్ధని మాదిరాజు
- విన్నకోట ఫణీంద్ర
వీరికి అభినందనలు.
కోడీహళ్లి మురళీమోహన్ వ్యాసకర్త, కథకులు, సంపాదకులు. తెలుగు వికీపీడియన్. ‘కథాజగత్’, ‘సాహితి విరూపాక్షుడు విద్వాన్ విశ్వం’, ‘జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు’ అనే పుస్తకాలు ప్రచురించారు.
1 Comments
G Nageswara Rao
Most useful and updated information