SOUTH INDIAN PHILATELIST’S ASSOCIATION (SIPA) వారి ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ‘SIPA AMRITPEX 2022’ శీర్షికతో జాతీయ స్థాయిలో స్టాంపుల ప్రదర్శన 2022 ఆగష్టు 13 నుండి 15 వరకు జరిగింది. ఈ ప్రదర్శనలో స్టాంపుల ప్రదర్శనలతో పాటు స్టాంపులకు సంబంధించిన సాహిత్యంలో పోటీని నిర్వహించారు.
ఈ సాహిత్య పోటీలలో ముద్రించిన గ్రంథాలలో శ్రీమతి పుట్టి నాగలక్ష్మి రచించిన ‘స్టాంపుల్లో మహాత్ముడు’ గ్రంధానికి కాంస్యపతకం లభించింది.
ఇంకా ఈ పోటీ స్టాంపులను అంతర్జాల పత్రికలు, ముద్రిత పత్రికలలో వ్రాసిన వ్యాసాలకు కూడా నిర్వహించారు.
ఈ పోటీలో కూడా ‘సంచిక అంతర్జాల పత్రిక’లో స్టాంపులలో మహిళలను గురించి వ్యాసాలు వ్రాసిన శ్రీమతి పుట్టి నాగలక్ష్మికి కాంస్య పతకం లభించింది.
పుట్టి నాగలక్ష్మి 1991 నుండి స్టాంపులను సేకరిస్తున్నారు. 1993 నుండి స్థానిక స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు స్టాంపుల ప్రదర్శనలలో పాల్గొంటున్నారు. వివిధ అంశాలకు సంబంధించి ఈ పోటీ ప్రదర్శనలు జరుగుతాయి. ఈమె గాంధీ పెక్స్, అహింసా పెక్స్ పోటీలలో పాల్గొని గాంధీజీ ఆయన అనుచరుల స్టాంపును ప్రదర్శించేవారు. స్టాంపుల వివరాలు వ్రాసేటప్పుడు గాంధీజీ స్టాంపులను విశ్లేషిస్తూ ఒక పుస్తకం వ్రాస్తే అనే ఆలోచన కలిగింది. అలా వెలువరించిన గ్రంథమే ‘స్టాంపుల్లో మహాత్ముడు’.
‘స్టాంపులు – మహిళలు’ స్టాంపుల – ప్రదర్శన కోసం తయారు చేసే సమయంలో స్టాంపుల్లో మహిళలు వ్రాయాలనే ఆలోచన కలిగింది నాగలక్ష్మి గారికి.
తదనుగుణంగా, దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన మహిళల స్మారకార్ధం భారత ప్రభుత్వ తపాలాశాఖ విడుదల చేసిన స్టాంపులలోని మహిళల జీవిత విశేషాలను గురించి వివరించిన 110 వ్యాసాలను వ్రాశారు.
ఈ మహిళలలో సంఘసంస్కర్తలు, క్రీడాకారిణులు, సాహస మహిళలు, వీరనారీమణులు, మహారాణులు, స్వాతంత్ర్య పోరాట యోధురాళ్ళు, కవయిత్రులు, సంగీత సరస్వతులు, వైదురాళ్ళు, తత్వవేత్తలు, చలన చిత్ర ప్రముఖులు మొదలైన వారి జీవన చరిత్రలను లఘువ్యాసాలుగా మలిచారు.
“స్కూల్లో చదివేటప్పటి నుండి లైబ్రరీలో పుస్తకాలు చదివేదానిని. పత్రికలలో వ్యాసాలు, ప్రముఖ వ్యక్తుల జీవిత చరిత్రలను, మహిళలలకు సంబంధించిన వివిధ పరిశోధనాత్మక గ్రంథాలను చదివి నోట్సు వ్రాసుకోవటం నాకు అలవాటు. వీటికి తోడు అంతర్జాలంలో వివిధ అంశాలను గురించి విషయ సేకరణ చేస్తున్నాను. స్టాంపులను విడుదల చేసినప్పుడు స్టాంపుకు సంబంధించిన సమాచారాన్ని సేకరింపచేసి క్లుప్తంగా సమాచార పత్రాన్ని (బ్రోచర్)ని విడుదల చేస్తారు. ఈ సమాచారం కొంత వరకు ఉపయోగపడుతుంది” అని తెలిపారు నాగలక్ష్మి.
సంచిక టీమ్ తరఫున శ్రీమతి పుట్టి నాగలక్ష్మి గారికి అభినందనలు.
సంచిక యాజమాన్యం వారికి, సంపాదకులకు, సాంకేతిక నిపుణులకు అందరికీ.. నా వ్యాసాలను ప్రచురించి ప్రోత్తహించినందుకు,అభినందించి నందుకు ధన్యవాదాలు.. 🙏🏻🙏🏻🙏🏻
Nagalakshmi గారికి stampullo మహాత్ముడు grandhaaniki stampullo mahilalu vyaasaalaki కాంస్య పత కా లు లభించాయి.అందుకు అభినందనలు..వారి కృషికి గుర్తింపు లభించినందుకు సంచిక రచయితల తరఫున వారికి ప్రత్యేక అభినందన..Hearty Congratulations పుట్టీ..
ధన్యవాదాలు గౌరీలక్ష్మి గారూ!
స్టాంపుల సేకరణ,సాహిత్యం లో కూడా మీ కృషి ఎనలేనిది, అభినందనీయమైనది. మీరు రెండు పతకాలు పొందినందుకు అభినందనలు. ఇంకా మీ కృషి కొనసాగిస్తూ….ఇంకా పతకాలు పొందగలరని ఆశిస్తున్నాను. 👍🙏
ధన్యవాదాలు ప్రమీలగారూ
Hearty congratulations mam. You deserve more and more 🎊🎉💐🌹🎈
ధన్యవాదాలు ఝాన్సీ గారూ
Heartly congratulations madam,really hatsoff to you ,Iwish we can get more and more articles from you
Hearty congratulations madam…💐💐we proud of you🙏 inka future lo vunnaya sthayilo mee peru vundaalani korukuntunna…
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
శ్రీమతి – శ్రీవారు
శ్రీ మహా భారతంలో మంచి కథలు-12
రాజ్యసభ తొలి ఉపాధ్యక్షురాలు శ్రీమతి వైలెట్ ఆల్వా
అద్వైత్ ఇండియా-7
కె. కవిత నానీలు
అందుకున్న నక్షత్రం
చంద్రమోహన్ గారి నటనా వైదుష్యం ‘బంగారు పిచిక’ చిత్రం
మానస సంచరరే-53: జయమ్ము నిశ్చయమ్మురా
పోస్టుమాన్
‘క్షణ క్షణం’ ఇప్పుడు విడుదలయ్యుంటే?
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®