మనో వీక్షణాల
మందారాలు,
మరువపు, దవనపు
అంతరంగ సువాసనలు.
అదొక
అద్భుతమైన ఆనందం,
ఏకాంతపు
మహా ప్రకాశమై.
ఊపిరినిచ్చే
లయ సవ్వడులు,
ప్రేమించే మనుషుల
ఆలింగనాలు.
ఆ మాట
ఒక ప్రశాంతత,
ఆ శబ్దం
ఒక ఓదార్పు.
ఆ నిశ్శబ్దం,
నిగ్రహాన్నిచ్చే అనుగ్రహం
వెన్నెలై ప్రసరిస్తూ..
సజీవంగా ఉంచే
జ్ఞాపకాల సంతకం
తీరం వెంట కాంతిలా..
అదొక
అస్తిత్వపు
అగరు దూపం.

లక్ష్మీ కందిమళ్ళ గారి నివాసం కర్నూలు. గృహిణి, కవయిత్రి, రచయిత్రి.
ప్రవృత్తి: కథలు కవితలు రాయడం.
ఇంత వరకు రాసిన కథలు, కవితలు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి.
ఉగాది పురష్కారం 2019 కర్నూలు కలెక్టరు గారి చేతులమీదుగా అందినది.
మొదటి కవితా సంపుటి “రెప్పచాటు రాగం”.