[శ్రీమతి ఆర్. లక్ష్మి రచించిన ‘శిఖరాగ్రం’ అనే కవితని అందిస్తున్నాము.]
శిఖరాగ్రం మీద నుంచుని చూసిన రోజు, చుక్కలన్నీ ఎంతో దగ్గరగా కనిపించాయి. కోర్కెలన్నీ ఎంతో సమీపంలో వెలుగు చిమ్మాయి! వాటిని సమీపించడం ఎంతో సులభమనుకున్నాను.
విశాల భావాలతో పరికించిన రోజు, లోకమంతా నిర్మలంగా కనుపించింది. ‘ప్రశాంతత’ అంటే అదే అననిపించింది. ఈ లోకంలో జీవించటమే హాయనుకున్నాను.
మృదు హృదయంతో సంచరించిన రోజు, ప్రతి హృదయం మార్దవ పూరితమనిపించింది. మాధుర్యమంటే అదేననిపించింది. మాధుర్యాన్ని చవిచూడటమంటే సులభమనిపించింది.
కానీ..
శిఖరాగ్రం నుండి పతనమైనపుడు తెలుసుకోగలిగాను; నింగికీ, నాకూ ఎంత దూరమో! సంకుచితత ఎదలో చోటు చేసుకున్నపుడు అర్థం చేసుకున్నాను జీవించటం ఎంత కష్టమో!
మృదు హృదయంలో కాఠిన్యం తొంగి చూసినపుడు తెలుసుకోగలిగాను, మాధుర్యంగా కనిపించే అనుభూతిలో ఎంత గంభీరత ఉందో! …… అగణితాలయిన అనుభవాల కట్టకడపటి అంచున తెలుసుకోగలిగాను అనుభూతులకు మానవ హృదయం, లయబద్ధంగా స్పందిస్తుంది హృదయపుటౌన్నత్యాన్ని బట్టి లయలోని మాధుర్యం కనిపిస్తుంది.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
గతించని గతం-10
దేశ విభజన విషవృక్షం-65
కాజాల్లాంటి బాజాలు-103: మా వదిన ఓ అద్భుతం..
పిల్లి ఒకటి చిన్నది
అరుణ షాన్‌బాగ్… మూర్తీభవించిన దురదృష్టం, విషాదం
జీవన రమణీయం-95
‘బహుముఖ ప్రజ్ఞాశాలి సురవరం ప్రతాపరెడ్డి’ పుస్తకావిష్కరణ వార్త
స్వాతంత్ర్య పోరాటంలో తొలి ఆత్మాహుతి బాంబర్ – కుయిలీ
మానస సంచరరే-63: మంచి మార్పు.. మనోకాంక్ష!
జీవితమొక పయనం-10
అన్నం విలువ మనసుకు తాకేలా వివరించారు... ప్రతిదీ వివరంగా పరిశీలించి అందిస్తున్నందుకు ధన్యవాదాలు...🙏
Thank you somuch sir
ధన్యవాదాలు సర్.
సుబ్బారావు గారు ధన్యవాదాలు మీకు.
వేణు గారూ ధన్యవాదాలు
All rights reserved - Sanchika®