శూన్యం
శూన్యం
చేరి
శూన్యమైంది
అనంత
శూన్యమైంది
శూన్య స్థితి
అయింది.
సూక్ష్మ స్థితి
అయింది
***
సూక్ష్మ
అతి సూక్ష్మ
రూపాలు
అణు రూపాలు
అనంత కాలంలో
అనంత శక్తులుగా
అవతరించాయి
సవాలక్ష సూత్రాలు
రూపాంతరం చెందాయి.
***
గ్రహాలు, నక్షత్రాలు
పరిమాణం పొందాయి
మోహినీ రూపాలై
పరిణామం చెందాయి
తమ చుట్టూ
తాము తిరుగుతూ
కాలంతో కలసి
కాపురం చేశాయి.
***
నిర్జీవం నుండి జీవం
లేచి నిలబడింది
మొక్కలు
మహా వృక్షాలు
జలచరాలు
జీవ జాతులు
పరిణామ క్రమంలో అమరాయి.
నాటకం
జగన్నాటకం
సూక్ష్మ శక్తుల
జీవ నాటకం
ముగిశాక
అంతా నిర్జీవం
అనంత శూన్యం.
0 – 0= 0
ఇది తాటికోల పద్మావతి గారి వ్యాఖ్య: *శ్రీవర తృతీయ రాజతరంగిణి ఇప్పుడే చదివాను. చాలా అద్భుతమైన కాశ్మీర దీపాల గురించి చాలా చక్కటి వ్యాసాన్ని అందించినందుకు, దీపావళి…
6 Comments
Arun
Nice sir
Ramakrishnappa
Mark Engals thathvanni marokkasari jnapicchhindi sir me kavithvam dhanyvadalu sir
Shubha
True sir ,

Madhu
Nice
Muniraju
డాక్టర్ అగరం వసంత గారు రాసిన “శూన్యం” అనే కవిత చాలా బాగుంది యావత్ చరచరా జీవరాసులు చివరకు నిర్జీవం కావాల్సిందే అనే విషయాన్ని చాలా స్పష్టంగా కవిత ద్వారా తెలియజేసినందుకు వారికి నా ప్రత్యేక అభినందనలు
DINAKAR K
Nice sir