సంచికలో తాజాగా

Related Articles

10 Comments

  1. 1

    Shyam Kumar Chagal

    నా రచన ” శృతి లేని రాగం” ప్రచురించిన శ్రీ మురళీ కృష్ణ గారికి మరియు శ్రీ. సోమ శంకర్ గారికి ,సంచిక పత్రిక యొక్క ఇతర సాంకేతిక నిపుణులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు
    గురువు Dr KLV కి నా నమస్సులు. దాదాపుగా సంవత్సర కాలంగా సంచిక ద్వారా నన్ను ఆదరించిన పాఠకులకు అందరికీ నా ధన్యవాదాలు,కృతజ్ఞతలు

  2. 2

    Jogeswararao Pallempaati

    భలే శుభం కార్డు పలికారుగా, మిత్రమా, చావుల్లేని, గొడవల్లేని, వివాదాస్పద కాని పరిష్కారాన్ని చూపించారు, మిత్రమా, అభినందనీయం!
    ఆకాశం వైపు చూసే క్రమంలో … మనం భూమిమీద ఉన్నామన్న స్పృహ ఉండాలి!
    సంపాదనే ధ్యేయంగా జీవించే దంపతులు మనం సుఖాన్ని కోల్పోతున్నామనే స్పృహతో ఉండాలి!
    ఏది కావాలో తేల్చుకోవాల్సింది ఎవరికివారే!
    ఎవరూ ప్రత్యేక తీర్పులు చెప్పరు! ఉన్నంతలో సుఖంగా తృప్తిగా జీవించగలగాలి!
    ఇరువురి సమస్యకు చక్కటి దారి దొరికింది కాబట్టి ఇందులో ఎవర్నీ వేలెత్తి తప్పుపట్టలేం!
    అందరూ మంచివారే … పరిస్థితులే వారికి దారిచూపాయ్ …

    1. 2.1

      ShyamKumarChagal.

      Thank you jogesh for your response

  3. 3

    sunianu6688@gmail.com

    కథ ఆసా0తం చాలా ఆసక్తిగా కొనసాగింది. రచయత చాలా కొత్తగా మలుపు తిప్పారు అనడం లో అతిశయోక్తి లేదు. ప్రతీ పాత్రని చక్కగా మలిచారు. చివరిలో మలుపు దిగ్భ్రాంతి కలిగించింది. రచయిత గారు కి అభినందనలు 👌👏👍🌹

  4. 4

    Sarala sreelikhitha.

    డౌట్ వచ్చింది
    కథ చదువుతుంటే……..
    రాజు కు ఇంకో స్త్రీ తో సంబంధం ఉంది అని….. కావాలనే శృతిని వదిలించుకున్నాడు….కదా!
    ఇమెలో లేనిది ఆమెలో ఏముంది మరీ……..
    సంఘం లో ఇలాంటి కథనాలు కూడా జరుగుతుంటాయి…..
    ఎది ఏమైనా శృతి మనసులో ప్రేమను అర్థం చేసుకోలేక నిర్లక్ష్యం చేసి మరో వ్యక్తి కి దగ్గర చేశాడు కదా…….

  5. 5

    K . విజయలక్ష్మి. అన్నవరం

    Wonderful story.chala తెలివిగా కథను maluputipparu. మీరు స్వతహాగా కథలో ఉన్న మాధుర్యాన్ని అనుభవించి రాస్తున్న మూలంగా మీ కథలు ప్రేక్షకులని ఆకర్షిస్తుంది అనుకుంటున్న. *Great* *Writer*…. *Shyam**ji*. Excellent performance 👏👏👏🌹🌹🌹

  6. 6

    Amulya leela novo

    అసలు ఏం మాట్లాడాలో అర్ధం కావట్లేదు సర్ ఈ సంచిక చదివాక.
    Last lo twist chala baguntundi

  7. 7

    కృష్ణా vasanthika.

    చాలా బావుందండీ. స్త్రీ కాబట్టి అంత ఆలోచించింది. భర్త మాత్రం ప్రీ ప్లాన్ డ్ గా మనోజ్ ని ముందు పెట్టి నాటకం ఆడాడు. ఎప్పుడూ ఫోన్ లో పనులు చెప్పటం తిట్టటం చేస్తుంటేనే అతనికి అక్కడ వేరేఎవరో ఉన్నారని అనుమానం వొచ్చింది కానీ మరీ అంత నీచానికి దిగజారతాడు అని ఊహించలేదండీ. చివర్లో కూడా అతను మంచి మనసుతో వొస్తున్నట్టే రాయటం తో ముందు డైజెస్ట్ అవలేదు . ట్విస్ట్ బాగుంది 👍

  8. 8

    Annapoorna yedidha

    ఈ కధ చదివానండీ చాలా బాగా వ్రాసారు.
    స్త్రీ మానసిక సంఘర్షణ మరియు వివాహితకు ఉండే హద్దులూ మనసు పడే వేదన చాలా బాగా చెప్పగలిగారు.
    కానీ అతనూ పవిత్రుడేం కాకపోవడం కధలో మలుపు బాగుంది. నిజాయితీగా తానూ తన భార్యలా నిజం చెప్పి ఉంటే బాగుండేది. ఇక్కడా స్ర్తీయే గొప్పది. మనోజ్ మోసం చేయకపోవడం మంచి మలుపు.

  9. 9

    BRK reddy safilguda

    కథా రచయిత శ్యామ్ కుమార్ గారికి నమస్కారం .ఈ వారం మీరు అందించిన శృతి లేని రాగం అనే సుదీర్ఘమైన కథను చదివాను .ఇది ఒక కథగా అనిపించలేదు. సుదీర్ఘమైన నవలా రచనగా గోచరిస్తుంది. ఇందులో పొందుపరిచిన కేవలం మూడు పాత్రలతోనే ఇంతటి సంభాషణలను అల్లగలిగిన రచయిత గారికి ముందుగా అభినందనలు .ఇందులోని పాత్రల గుణగణాలను పరిశీలిస్తే …కేవలము డబ్బు, బంగారము ,విలాసవంతమైన జీవితమే కాదు ..భర్త యొక్క ప్రేమానురాగాలు కోరుకోవటం అనేది వివాహిత అయిన ప్రతి స్త్రీ యొక్క సహజ లక్షణం .భర్తకు దూరంగా ఉండటం వలన ఎండమావి లోని నీటి ధారగా కనిపించిన మనోజ్ పట్ల వ్యామోహితురాలు అవటం ఆ పరిస్థితులకు అనుగుణమైన లక్షణంగా భావించవచ్చు . కానీ తదనంతరము ఇద్దరి మధ్య జరిగిన శారీరక సంబంధాన్ని ..అలా కాకుండా ,ఒక స్వప్నంగా చూపి ,స్వప్నకు రాజుతో చట్టపరమైన విడాకులతో మనోజ్ ను జతపరిచే సన్నివేశాలను సృష్టించగలిగే ప్రయత్నం చేసి ఉంటే బాగుండేదేమో …అని అనిపిస్తుంది .
    ఇక్కడ అసలు దోషి శృతి భర్త రాజు మాత్రమే .తనను అన్ని విధాలుగా నిర్లక్ష్యం చేస్తున్న భర్తకు దూరంగా ఉంటూ, భారతీయ స్త్రీకి ఉండవలసిన గౌరవ మర్యాదలను కాపాడుకుంటూ ,సహనం వహించిన భార్య … క్షణికావేశానికి లోనై మనోజ్ తో వెళ్లిపోవడం అనే ముగింపు ఆ స్త్రీ పట్ల పాఠకులకు చులకన భావం కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇన్ని రోజులు ఆ స్త్రీ యొక్క సౌశీల్యము మరియు సహనాన్ని మరుగున పరిచాయి. భార్య పరాయి పురుషుడితో వెళ్లిపోయింది అనే సాకు చూపిస్తూ ,పర స్త్రీతో సంబంధాన్ని ఏర్పరచుకున్న రాజు ,ఇక్కడ సానుభూతిపరుడు గా చలామణి అవుతున్నాడు. మొత్తం మీద ఉత్కంఠ భరితమైన కథా సారాంశం.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!