సంచికలో తాజాగా

Related Articles

One Comment

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ప్రొ. సిహెచ్. సుశీలమ్మ గారి స్పందన: మారుతీ పౌరోహితం వ్రాసిన “ఇల్లిడిసిన తొమ్మిది కథలు” పై కె.పి. అశోక్ కుమార్ గారి సమీక్ష బాగుంది.
    అదే విధంగా సంచిక టీం మారుతి పౌరోహితం గారి ఇంటర్వ్యూ లో మంచి ప్రశ్నలు (ఇరవై)వేసి రచయిత నుండి సరియైన సమాధానాలు రాబట్టగలిగింది.
    ఇల్లు ఇడిసిన తొమ్మిది కథలు నేను చదివాను. ప్రతి కథ మనసుని ఆకట్టుకునే విధంగా రచయిత మలిచాడని చాలాసేపు ఆ కథల గురించి ఆలోచిస్తూ ఉన్నాను. అవన్నీ నిజంగా జరిగిన కథలేనని, ఆ కథల్లోని వ్యక్తులు నిజజీవితంలో ఉన్నారని రచయిత చెప్పటంతో, అందుకనే ఆ కథలు అంత సజీవంగా ఉన్నాయని అనుకున్నాను.
    ప్రతి కథను రాయటానికి దానికి సంబంధించిన వివరాలన్నీ రోజుల తరబడి సేకరించడం, మరీ ముఖ్యంగా ప్రణయ హంపి నవల రాయటానికి ఏడాదిన్నర పైగా పరిశోధించి వ్రాయటం నాకు నచ్చింది.
    ఏది రాయాలనుకున్నా వెంటనే రాసేసి ప్రపంచం మీదకి వదిలేస్తున్న రచయితలున్న ఈ కాలంలో మారుతీ పౌరోహితం (వ్యక్తిగతంగా ఉపాధ్యాయుడు) బాధ్యతగా పరిశోధించి రాయటం నాకు నచ్చింది. త్వరలో మరో ఇల్లిడిసిన కథల సంపుటి రాబోతున్నదని తెలిసి ఆనందంగా ఉంది. ఇంతమంది “ఇల్లు విడిచి” వెళ్తున్నారా అని ఆశ్చర్యం గానూ, దాని నేపథ్యం, కారణాలు ఏమయివుండవచ్చో ఆలోచించాల్సిన అవసరం సమాజం పైన ఉన్నదని అనిపించింది.
    ప్రపంచంలోనే అత్యధిక స్త్రీ పురుషుల జనాభా నిష్పత్తి ఉన్న కర్నూలు ప్రాంతంలో “చదువుకున్న ఆడపిల్లల శాతం” తక్కువగా ఉందని తెలిసి చాలా ఆశ్చర్యంగా ఉంది.
    మారుతి పౌరోహితం మరిన్ని కథలు నవలలు వ్రాయాలని ఎదురుచూస్తూ అతన్ని హృదయ పూర్వకంగా అభినందిస్తున్నాను.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®