భారత రాజ్యాంగ రూపశిల్పి..
జాతిని జాగృత పరచిన ప్రచండ భాస్కరుడు..
బడుగు ప్రజలకు వెలుగుబాట చూపిన మహోన్నతుడు
అంటరాని తనాన్ని రూపుమాపిన సంఘ సంస్కర్త
దేశ భవితను సన్మార్గంలో నడిపిన దార్శనికుడు..
శాంతి సామరస్యాలను చాటిన సౌశీల్యుడు..
ప్రజాస్వామ్యానికి
ఊతమిచ్చిన స్ఫూర్తిదాత జననాయకుడు..
మన అంబేద్కరుడు!!..

లక్ష్మీ సుజాత గారు పుట్టింది ఆంధ్రా, పెరిగింది తెలంగాణ.. భద్రాచలం, ఖమ్మం జిల్లా. ఇంటర్ చదివే రోజుల నుండి పలు పత్రికల్లో క్విజ్లు, ఆర్టికల్స్, కథలు, కవితలు ప్రచురితమయ్యాయి. వివిధ బాలల పత్రికలలో వీరి బాలల కథలు ప్రచురితమయ్యాయి. తెలుగు వెలుగులో రాసిన కథకు అభిమానుల నుండి ప్రత్యేక ప్రశంసలు పొందారు. అష్టాక్షరి, ధ్యానమాలిక అను మాసపత్రికలకు ఆధ్యాత్మిక వ్యాసాలు రాస్తున్నారు. వివిధ అంతర్జాల పత్రికలలో వీరి కవితలు ప్రచురితమవుతున్నాయి. టేకు ఆకులపై రంగవల్లికలు వేసినందుకు గాను వండర్ బుక్ మరియు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్నారు.