పంచసప్తతి వర్షములు గడిచినవి స్వేచ్ఛా ఊపిరి పోసుకొని భారతావని వేడి ఉచ్ఛ్వాస నిశ్వాసాల ధ్వనులు వినిపిస్తునే ఉన్నాయ్ ఇంకా కొత్తగా
ఆ వెచ్చని ఊపిరి స్పర్శలో భరతమాతకు విగత సమరయోధుల స్మృతి వచ్చె ఆంగ్లేయుల తూటాలు చేసిన గాయాలు నేలకు కారిన వెచ్చటి నెత్తుటి మరకలు అదిగో కనిపిస్తున్నాయ్……!
నాటి త్యాగమూర్తుల త్యాగఫలం తన చేత పట్టుకొని భరతమాత అదిగో అలా నిలుచుంది చూడు భరతమాత కన్నులలో ఆనందం దుఃఖం రెండూ కనిపిస్తున్నాయ్
ముద్దుబిడ్డలు పోయారన్న బాధ స్వేచ్ఛా ఫలం దొరికిందన్న ఊరట త్యాగాల తపస్సుతో ఊపిరి వచ్చిన భరతమాతకు కొత్త ఊపిరి పోయాలి
గాయపడిన మాతృ హృదయానికి సాంత్వన చేయాలి మనమంతా ఐకమత్యంగా జాతి కుల మత భేదములు పాటించక తల్లి మనసు నొప్పించక నడవాలి ముందుకు
భరతజాతి గొప్పదనాన్ని సంస్కృతిని ఎలుగెత్తి చాటాలి హోరెత్తి పోవాలి జయహో భారత మాతాకి జై….!
భావుకుడు, కవి శంకరప్రసాద్. ఇప్పుడిప్పుడే తన కవితలతో, కథలతో సాహిత్య ప్రపంచంలోకి అడుగిడుతున్నాడు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు-11
ఇద్దరు
ప్రేమ పరిమళం-8
సంచిక – స్వాధ్యాయ సాహిత్య సమావేశం (చర్చా వివరాలు)
కోరికల గుర్రం
ముక్కుపుడక
యువభారతి వారి ‘తెలుగు సొగసులు’ – పరిచయం
ఆదికావ్యంలోని ఆణిముత్యాలు-21
శ్రీ సీతారామ కథాసుధ-2
పాటే మంత్రము: ఉమ్రావ్ జాన్
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®