[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]


రామం దశరథాత్మజమ్
ఆత్మానాం మానుషం మన్యం రామం దశరథాత్మజమ్
విష్ణు సహస్రనామంలో, ‘పరమ స్పష్టః’ అనే నామము శ్రీరాముడిని స్తుతిస్తూ ఉంది. దీని అర్థం ఎవరి ఆధిపత్యం స్పష్టంగా ఉందో ఆయన. కానీ తన ఆధిపత్యాన్ని ఎప్పుడూ వెల్లడించని రాముడికి ఇది ఎలా సరిపోతుంది?
నిజానికి, ఆయనే నేను మానవుడను అని ప్రకటిస్తాడు. యుద్ధ కాండలో, సకల దేవతాగణాలు (బ్రహ్మగారితో సహా) ఆయనను స్తుతించినప్పుడు, ఆయనే ఇలా ప్రకటిస్తాడు – నేను మర్త్యుడను, దశరథుని కుమారుడను.
రామావతారంలో, భగవంతుడు ఎటువంటి మానవాతీత కార్యాలు చేయడు. కానీ పరమ స్పష్టః అనే పేరు సమర్థనీయమైనది, ఎందుకంటే, రామాయణంలో ఆయన గొప్పతనాన్ని తార, మండోదరి మొదలకొని శూర్పణఖ (శూర్ప నఖ) వంటి కొందరు గుర్తించారు, అని ప్రొఫెసర్ ఎమ్ఏ వెంకటకృష్ణన్ (మద్రాస్ విశ్వవిద్యాలయం- వైష్ణవ స్టడీస్) ఒక ఉపన్యాసంలో వివరించారు.
మరీచుడు కూడా రావణుడితో, “రామో విగ్రహావాన్ ధర్మః” అని అన్నాడు – రాముడు ధర్మానికి నిలువెత్తు రూపం.
తార రాముడిని స్తుతించడం ఒక అద్భుతమైన ఘటన శ్రీ రామాయణంలో. ఆమె అనేక సల్లక్షణాలను వెల్లడిస్తుంది. వాలి తీవ్రంగా గాయపడినప్పుడు, అతని భార్య తార అక్కడికి వస్తుంది. వాలి చివరికి తుది శ్వాస విడిచినప్పుడు, ఆమె అతని మరణం గురించి విలపిస్తుంది. తరువాత రాముడి వైపు తిరిగి ఆయన లక్షణాలను వివరిస్తుంది. ఆయనను ఎవరూ అర్థం చేసుకోలేని వ్యక్తి అని ఆమె చెబుతుంది. రాముడు జితేంద్రియుడు – ఇంద్రియాలను జయించినవాడు. ధర్మాన్ని పాటించేవారిలో రాముడు అగ్రగణ్యుడని ఆమె గుర్తించి చాటుతుంది. సహనంలో ఆయన భూమి లాంటివాడు. అతనికి గొప్ప కీర్తి ఉంది. ఈ కీర్తి అన్న విషయాన్ని ఆధారం చేసుకుని మనం విష్ణుః అన్న నామానికి వ్యాఖ్యానం చూసాము (17వ ఎపిసోడ్).
హనుమంతుడు రాముడిని మొదటిసారి కలిసినప్పుడు, రాముడి భుజాల గురించి మాట్లాడుతాడు. అతను ఉపయోగించే పదం బహవః. సంస్కృతంలో నామవాచకాలకు ఏకవచనం, ద్వి మరియు బహువచన రూపాలు ఉన్నాయి. ఇక్కడ హనుమంతుడు ద్వి వచన రూపాన్ని ఉపయోగించడు, బహువచనం వాడతాడు. మరో మాటలో చెప్పాలంటే, అతను రాముడి రెండు భుజాలను సూచించడు, బహువచనం ఉపయోగించడం ద్వారా, రాముడు అనేక భుజాలు కలిగి ఉన్నాడని అతను సూచిస్తాడు. వ్యాకరణ పండితుడైన హనుమాన్ రాముడిని పైకి మానవుడని గుర్తించినా, అంతరంగమున ఆయన నారాయణ తత్వాన్ని తెలుసుకుని ఉంటాడు. రామాయణంలో రాముడి ఆధిపత్యాన్ని గుర్తించే మరొక ఉదాహరణ ఇది.
రాముడు శంఖం, చక్రం, గద, పద్మం పట్టుకున్న వ్యక్తిగా మండోదరి వర్ణించింది, అయితే రాముడు ఈ ఆయుధాలను పట్టుకోలేదు. అయినా మండోదరికి అలా దర్శనమయ్యింది. మండోదరి కూడా ఆయన ఆధిపత్యాన్ని గుర్తించింది.
ఇప్పుడు ఈశ్వరః అన్న నామానికి పరాశరభట్టర్ చెప్పిన వ్యాఖ్య చూద్దాము.
సర్వస్వతంత్రుడైనవాడు, సమస్త భోగస్వరూపుడు, ఈ సృష్టియందుండి కూడా దానిచే అంటబడక స్వేచ్ఛాస్వరూపుడై, సర్వమును తన వశమందు ఉంచుకొనగలిగన వాడు. స్వచ్ఛందుడు. స్వేచ్ఛాస్వరూపుడు. Freedom vs volition. He has both. And is independent of both.
ఇంద్రియాలను తన వశమునుంచుకుని, అందరికన్నా మిన్నగా ఉండువాడు.
ఈ రకంగా చూస్తే శ్రీరాముడు ఈశ్వరః అన్న నామమును ఒప్పు వాడే.
కావాలంటే వాల్మీకి మహర్షి అడిగిన పదునారు గుణములకు నారద ముని మరికొన్ని సద్గుణాలను కలిపి మరీ చెప్పాడు. మానవులలో అలాంటి వారు లేరు అని చెప్పాడు అనుకున్నా, ఆ గుణములన్నీ ఉన్న దేవతలు కూడా లేరు కదా. అంటే మానవుడిగా ఉన్నా కూడా ఆయన ఈశ్వరుడు.
కోఽన్వస్మిన్సామ్ప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ।
ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః ॥ 2 ॥
చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః ।
విద్వాన్ కః కః సమర్థశ్చ కశ్చైకప్రియదర్శనః ॥ 3 ॥
ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కోఽనసూయకః ।
కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే ॥ 4 ॥
ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హి మే ।
మహర్షే త్వం సమర్థోఽసి జ్ఞాతుమేవంవిధం నరమ్ ॥ 5 ॥
అని వాల్మీకి మహర్షి అడిగితే నారదముని ఇలా చెప్తారు.
బహవో దుర్లభాశ్చైవ యే త్వయా కీర్తితా గుణాః ।
మునే వక్ష్యామ్యహం బుద్ధ్వా తైర్యుక్తః శ్రూయతాం నరః ॥ 7 ॥
ఇక్ష్వాకువంశప్రభవో రామో నామ జనైః శ్రుతః ।
నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వశీ ॥ 8 ॥
బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మీ శ్రీమాన్ శత్రునిబర్హణః ।
విపులాంసో మహాబాహుః కమ్బుగ్రీవో మహాహనుః ॥ 9 ॥
మహోరస్కో మహేష్వాసో గూఢజత్రురరిన్దమః ।
ఆజానుబాహుః సుశిరాః సులలాటః సువిక్రమః ॥ 10 ॥
సమః సమవిభక్తాఙ్గః స్నిగ్ధవర్ణః ప్రతాపవాన్ ।
పీనవక్షా విశాలాక్షో లక్ష్మీవాన్ శుభలక్షణః ॥ 11 ॥
ధర్మజ్ఞః సత్యసన్ధశ్చ ప్రజానాం చ హితే రతః ।
యశస్వీ జ్ఞానసమ్పన్నః శుచిర్వశ్యః సమాధిమాన్ ॥ 12 ॥
ప్రజాపతిసమః శ్రీమాన్ ధాతా రిపునిషూదనః ।
రక్షితా జీవలోకస్య ధర్మస్య పరిరక్షితా ॥ 13 ॥
రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షితా ।
వేదవేదాఙ్గతత్త్వజ్ఞో ధనుర్వేదే చ నిష్ఠితః ॥ 14 ॥
సర్వశాస్త్రార్థతత్త్వజ్ఞో స్మృతిమాన్ప్రతిభానవాన్ ।
సర్వలోకప్రియః సాధురదీనాత్మా విచక్షణః ॥ 15 ॥
సర్వదాభిగతః సద్భిః సముద్ర ఇవ సిన్ధుభిః ।
ఆర్యః సర్వసమశ్చైవ సదైకప్రియదర్శనః ॥ 16 ॥
స చ సర్వగుణోపేతః కౌసల్యానన్దవర్ధనః ।
సముద్ర ఇవ గామ్భీర్యే ధైర్యేణ హిమవానివ ॥ 17 ॥
విష్ణునా సదృశో వీర్యే సోమవత్ప్రియదర్శనః ।
కాలాగ్నిసదృశః క్రోధే క్షమయా పృథివీసమః ॥ 18 ॥
ధనదేన సమస్త్యాగే సత్యే ధర్మ ఇవాపరః ।
తమేవం గుణసమ్పన్నం రామం సత్యపరాక్రమమ్ ॥ 19 ॥
ఇక కృష్ణావతారం గురించి చెప్పేది ఏమున్నది?
ఈశ్వరః పరమః కృష్ణః.. అననే అన్నారు కదా.
He is the One from which creation flows.
His heads are a multitude, yet he is the Self in all.
His eyes and feet cannot be numbered.
Many and mighty are his forms.
His soul is revealed in light, as fire he burns.
He is the rays of the moon and the light of the sun.
His forms are many, but he is hidden.
He has hundreds of forms, hundreds of faces.
His face is everywhere..
ఈ మాటలు ఏక్నాథ్ ఈశ్వరన్ తను రాసుకున్న విష్ణు సహస్రనామ వ్యాఖ్యలో అంటాడు.
శ్రీరాముడి పరంగా ఈశ్వరః అన్న నామాన్ని విశ్లేషిస్తే చాలా అందమైన భావాలు గోచరిస్తాయి. వాటిని గురించి మనం తెలుసుకుందాము.
దానికన్నా మునుపు ఒకసారి విక్రమీ ధన్వీలను కూడా చూద్దాము.
సత్యసంధ తీర్థుల వారి వ్యాఖ్య ఇలా ఉంటుంది.
॥విక్రమతో అస్యాస్తీతి విక్రమీ॥ – విక్రమము కలవాడు.
॥క్రమః – తారతమ్యమ్, అస్యాస్తీతి క్రమీ, న క్రమీ విక్రమీ। స్వావతారేషు తారతమ్యరహిత ఇతి వా॥ తారతమ్యము కలిగిన వారిని క్రమీ అంటారు. లేని వారిని విక్రమీ అంటారు. అనగా తన అవతారములయందు తారతమ్యము లేని వాడు. సమదృష్టి కలవాడు.
ఇక శంకర వ్యాఖ్య!
శౌర్యము కలవాడై భగవానుడు విక్రమీ అని స్తుతించబడినాడు. ధైర్యసాహసములకు నిలయమైన వాడు అని భావము. అతని చట్టాలను అతిక్రమించగలవారు లేరని గ్రహించాలి. శౌర్యముగలవాని హస్తమందు అస్త్రశస్త్రములుండవలెను కదా? దానికే తరువాత నామము ధన్వీ!
ఇక పరాశర భట్టర్ తేలికగా ఇలా అన్నారు.
తన సంకల్పమునకు విరుద్ధముగా సంభవించిన దానిని దునుమాడు పరాక్రమ స్వభావుడు. అంటే ఆయన స్వభావము ధర్మము.
॥ధర్మస్య ప్రభరచ్యుతః॥
అలా ధర్మవ్యతిరేకులైన వారిని జయిస్తాడు కనుక ఆయన విక్రమీ!
శ్రీరాముడు ఆ పని కూడా చేశాడు కనుక విక్రమీ అన్న నామము ఆయనకు కూడా ఒప్పుతుంది.
(సశేషం)
నా గురించి నేను చెప్పుకుంటే అది సెల్ఫ్ డబ్బా (SSSA). వేరే వాళ్ళైతే వాళ్ళ వాళ్ళ వర్షన్లు చెప్తారు. కనుక నేను రాసిన దాన్ని బట్టీ నా రచనల గురించి మీరే ఒక అంచనా వేసుకోండి. అది చాలు. భవిషత్ లో కలవాల్సి వస్తే అప్పుడు నా గురించి ఫస్టు హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మీరే తెలుసుకోవచ్చు. ఠీక్ హైఁ?
తెలుగు వాడినే అని చెప్పేందుకు సాక్ష్యం: నాకు తెలుగు రాదు.
గీతాచార్య