ప్రకృతితో మమేకమై సృష్టి వైచిత్రాలకి వింతపడి
గుండె గిన్నెలో పట్టక పొంగిపొరలి పోతున్న
దుఃఖమో,ఆనందమో,ఆహ్లాదమో,వేదనో, రోదనో
పంచబోయినప్పుడల్లా నాలుగు వాక్యాలొస్తాయి
ఆగక తోసుకొచ్చే అప్పటి జలప్రవాహానికి
దారీ, తెన్నూతెలీదు ఉరికే ఊపు తప్ప
పొంగి పొరలే ఆ తలపుల తరంగాలకు
వాక్య నిర్మాణమెక్కడ? ఆవేశం తప్ప!
కంఠస్థ పద్యాల్ని వల్లెవేసే పితామహులు
ముత్తాతల దోవలో లేవంటూ వెక్కిరిస్తారు
పాత నూతి పద్యాల్ని తోడుతుండే పండితులు
కొత్త నీటి ప్రతీకల్లో రుచిలేదని చప్పరిస్తారు
యువత కవితల రసాస్వాదనలొద్దంటారు
మనసుల్తో స్పందించే సమయం లేదంటారు
బతుకు తెరువుల పరుగుల్తో డస్సిపోయాం
బుర్రతో యోచించే భావనలు భారమంటారు
ద్వేషపునాదుల, అడ్డుగోడనిర్మాణ కవులూ
మా గుంపుకే పీటలు వెయ్యమనేవారూ
ప్రత్యేక సమూహాల సంగతేంటనే వారూ
సత్కారాల వరసల్లో ముందు సర్దుకుంటారు
అక్షరాల్ని కష్టంగా కూడబలుక్కుని చదివినా
అనుభూతి కొసనందుకుని మైమరచిపోతూ
పఠించి పలవరించే వారికోసమే కవితాపంక్తులు
భక్తిగా తపస్సుక్కూర్చుంటాయి ఏళ్లతరబడీ

అల్లూరి గౌరీలక్ష్మి కథా, నవలా రచయిత్రిగా చక్కని పేరు సంపాదించారు. ఈమె మంచి కవయిత్రి, ఫెయిర్ కాలమిస్ట్ కూడా. నాలుగు కథా సంపుటాలూ, 4 నవలలూ, 3 కవిత్వ సంకలనాలూ, ఒక కాలమ్స్ బుక్ వెలువరించారు.
APIIC Ltd. లో General Manager గా పనిచేసి పదవీ విరమణ పొందారు.
14 Comments
G. S. Lakshmi
అక్షరసత్యాలు చెప్పారండీ.

పుట్టి. నాగలక్ష్మి
సమకాలీన సమాజ నైజం

Venu+Madhav
చాలా బాగా వ్రాసారు…. పదాల అల్లిక బాగుంది భావం బాగుంది…. లోకోభిన్న రుచి… చదివే వాళ్లు చదువుతుంటారు, విమర్శించే వాళ్లు విమర్శిస్తుంటారు… ఆస్వాధించే వాళ్లు ఆస్వాదిస్తుంటారు….
Kanaka Durga Pakalapati
చాలా చాలా బాగుంది.ఇటువంటి కవితల కోసమే మా ఎదురుచూపులు.


కొల్లూరి సోమ శంకర్
ఆదరగొట్టారు.., మేడం… సూపర్…. చాలా బాగా బాగుంది పదాల అల్లిక…. భావం సూపర్… మళ్ళీ మళ్ళీ చదవాలని అనిపిస్తోంది…. ప్రకృతి తో మొదలుపెట్టడం నాకు బాగా నచ్చింది…. కవితలు ను ఆస్వాదించ లేని వాళ్ళను కడిగి పడేసారు….





నూటికి నూరు మార్కులు…
Venu..
కొల్లూరి సోమ శంకర్
చాలా బాగుందిరా
Vijayalakshmi
కొల్లూరి సోమ శంకర్
Wow!super ammalu… correct gaa cheppaaru neti kavitwa paristhithini
Kasimbi
కొల్లూరి సోమ శంకర్
Manchi kavita
Indukuri durga
కొల్లూరి సోమ శంకర్
Good poem
Babu
కొల్లూరి సోమ శంకర్
చక్క ని కవిత
G.Lakshmi..Vijayawada
Jhansi Lakshmi
అధ్బుతమైన కవిత!సరళమైన భాష
లోతైన భావం. హాయిగా ఉంది చదువుతుంటే
కొల్లూరి సోమ శంకర్
మీ కవిత చాలా బాగుంది మేడం గారు
. ముత్తాతలపై మీ పద విమర్శ బాగుంది. మీరు మాత్రమే ఈ తరహా కవితలు రాయగలరు. శుభాకాంక్షలు 





KV Ramana
కొల్లూరి సోమ శంకర్
Nijam ga oka srujanatmaka hrudayam nundee janinche kavita gurinchi perfect ga chepparu. Chala rojula tarvata manasuki hattukune kavita chadivina satoshanni icchina meeku


Swaroop
కొల్లూరి సోమ శంకర్
Taapaasu bagundhi gauri
Anu..Hyd