[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]
~ 181. ఓ నిమిషంబులోన యమశూలము నిను జంప అనుక్షణంబున జంపు నిను మోహపాశములవి నిను తమ నురిన్ నీ మెడకు దగిలించి మెల్లమెల్లగ యనుదినము బిగించి చంపు – మంకుతిమ్మ!
182. ఋణపు మాయాజాలము, కర్మచక్రము లివి యనంతము జన్మజన్మల తంతువులవి, లేదంతము అనవరతము నూతన మనిపించెడి యా తంత్రమే వినోద మా పరమేష్ఠికి – మంకుతిమ్మ!
183. సుఖముల్ లభించు పుణ్యకర్మ ఫలము చేత, సుఖములవి మద మోహములకు కారణమగు దుఃఖ మొనగూడు పాపకర్మఫలము చేత; సుఖ దుఃఖము లన్యోన్య జనకములవి – మంకుతిమ్మ!
184. చూడన్ జూడ ఈ లోక సహవాసము చాలనిపించు, వాడి పోవు పూమాల; చర్మము మీది తామరను (గజ్జిని) కడుంగడు గోకవలదు; అంటీ అంటక తప్పించుక నడయాడుము నేర్పు తోడ – మంకుతిమ్మ!
185. దయామయ జీవనంబునకున్ లేదే వెలయును, ఫలంబు దయ, ప్రేమానురాగ మధుర భావంబుల కెల్ల చోటు లేదే హేయమని వీటిని విధియంగడిని కసవూడ్చినట్లూడ్చిన ఏ యుపయోగమున్నదీ బదుకున – మంకుతిమ్మ!
186. వెదుకులాటయే ఈ ఏకాకి జీవికి బ్రతుకంతమున్ వెదకి వెదకి, చేచాచి పట్టుకొన యత్నించు నితర జీవుల వెదకు ప్రీతి మమతానురాగ ఋణంబుల కొఱకు జీవి, హృదయ భావనల కప్పిపుచ్చనగనె – మంకుతిమ్మ!
187. తారుమారైన యక్షరములన్ సవరించి పదములన్ కట్టు ఆటలో మార్చి మార్చి జతచేసి పదముల కట్టురీతి; వధూ వర జత కూర్పులున్ యవ్విధంబు గాదె పరికించి చూడగా – మంకుతిమ్మ!
188. షడ్రుచులన్ గలిపి పక్వమొనరించి వండి వేడి ఘుమ ఘుమల యంతటన్ వ్యాపింప జేసి కడు నోరూరింప జేయు నీ ప్రకృతి కె వడు వశము కానివాడు – మంకుతిమ్మ!
189. వివిధ రూప కాంతులతోడ కనువిందు జేయు వివిధ మధుర ఫలముల తోడ రసనను తృప్తి పరచు వివిధ గీతాలాపముల తోడ వీనుల విందు జేయు నీ వైవిధ్య ప్రకృతి; దీని రసికత యదెంతయో – మంకుతిమ్మ!
190. నరుడను మృణ్మయ ఘటంబున యమృత కణంబు భద్ర పరచి, విచక్షణాశక్తి యనెడి యుపనేత్రము పొందు పరచి సుభిక్షపు నడుమున దుర్భిక్షము నదేల నిరికించెనో! యక్రమమో, క్రమమో నియ్యది – మంకుతిమ్మ!
(ఇంకా ఉంది)
శ్రీ కల్లూరు జానకిరామరావు రచయిత అనువాదకులు. వీరి తండ్రి కీ.శే. కల్లూరు అహోబళరావు ప్రముఖ కవి, బహు గ్రంథకర్త. కృష్ణదేవరాయ గ్రంథమాల వ్యవస్థాపకులు. తల్లి కీ.శే. సీతమ్మ గారు. జానకి రామరావు గారి భార్య కీ.శే. సుభద్రమ్మ. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం. వీరి పుట్టిన తేదీ: 23(15) జూలై 1941. విద్యార్హత: B.A.Bed, M.A.( English) హిందూపురం ఎంజీఎం హైస్కూల్లో 1964 నుండి 1990 వరకు 26 ఏళ్లు ఉపాధ్యాయుడిగానూ, 1990 నుండి 1999 వరకు ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి, పదవీ విరమణ చేశారు. ప్రస్తుత నివాసం బెంగుళూరు. ఫోన్: 9740849084
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
అనూహ్య స్వప్నాలు
గాన ప్రవీణుడు – మార్గదర్శి
డామిట్ కథ అడ్డం తిరిగింది
మధురిమ
అమెరికా
అమ్మ కడుపు చల్లగా
అలనాటి అపురూపాలు-3
నిరుద్యోగ భారతం
దేశ విభజన విషవృక్షం-12
కైంకర్యము-56
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®