గుర్తింపు గండపెండేరాల గొప్పహడావిడది
ప్రతిభావంతుల క్యూ లైన్ బహు పెద్దది
వెనక ఒత్తిడి పెరిగితే వరస చెదిరిపోతుంది
ఎవరుముందో, ఎవరువెనకో లెక్కపోతుంది
అప్పుడే వచ్చిన వాడు ముందుంటాడు
అవార్డుకోసం ఒక్కంగలో స్టేజి పైనుంటాడు
సణిగేవారు అసమర్థుల జాబితాకెక్కుతారు
ప్రశ్నించినవారు ఓర్వలేనివారవుతారు
పురస్కారాల చాకోలెట్ సంచీ సంస్థ
కీర్తికెక్కిన సాక్షాత్ రాజరాజవుతుంది
అందుకున్నవాళ్లంతా సరస్వతీపుత్రులే
మిగిలిన వాళ్లంతా అంతంతమాత్రులే
సీనియారిటీ,క్వాలిటీ శుష్కవేదాంతాలు
స్ట్రగుల్ ఫర్ అఛీవ్మెంట్లో ఎన్నోపోరాటాలు
సర్వైవల్లో సరిగ్గా ఇమిడినవారే గెలుపుగుర్రాలు
తక్కినవారు పరుగురాని నేలబారు తాబేళ్లు
పతకానికి కావాల్సింది సుదీర్ఘ పథకం
అస్మదీయపొదల్లో లాగాల్సిందే సంబంధం
దారేదయినా గమ్యం చేరడమే ముఖ్యం
సాధించడం మాత్రం సత్తా నిరూపణ కాదా?

అల్లూరి గౌరీలక్ష్మి కథా, నవలా రచయిత్రిగా చక్కని పేరు సంపాదించారు. ఈమె మంచి కవయిత్రి, ఫెయిర్ కాలమిస్ట్ కూడా. నాలుగు కథా సంపుటాలూ, 4 నవలలూ, 3 కవిత్వ సంకలనాలూ, ఒక కాలమ్స్ బుక్ వెలువరించారు.
APIIC Ltd. లో General Manager గా పనిచేసి పదవీ విరమణ పొందారు.
10 Comments
G. S. LAKSHMI
అక్షరసత్యాలండీ గౌరీలక్ష్మిగారూ.
కొల్లూరి సోమ శంకర్
Wah!wah! కరెక్ట్ టైం కీ కరెక్ట్ గేయం… గాయం తో అనుకోండి.. ఏమీ టైమింగ్ బంగారం… అదిరింది.. ఎందరో గుండెల్ని ఆదరగొట్టింది.. గుండెలు గుబగూబ లాడించింది… బ్రేవో చెల్లీ… ఎక్స్ల్లెంట్ బంగారం…


















Kaasimbi..Guntur
కొల్లూరి సోమ శంకర్
Manjula
కొల్లూరి సోమ శంకర్
Subhadra
కొల్లూరి సోమ శంకర్
V.Lakshmi
కొల్లూరి సోమ శంకర్
Baagundi. Sarigga chepparu awards gurinchi
Meenaa
కొల్లూరి సోమ శంకర్
నిజం, వ్రాయడంలో చూపించ లేకపోయినా, అవార్డు సాధించడంలో సత్తా చాటుతారు.. అవార్డుల తోపులాట భేష్!
P.Nagalakshmi
కొల్లూరి సోమ శంకర్
Chaala baagundi..
ఎ. రాఘవేంద్రరావు
Dr.Trinadha Rudraraju
ప్రబలమైయున్న అవార్డు యంత్రాంగవాస్తవాన్ని నిర్భయంగా చెప్పారు.
కొల్లూరి సోమ శంకర్
అంతా నిజమే! ఆమె అంతరంగమథనంలో నుండి బయటకు వచ్చిన అక్షర సత్యాలు.. వాస్తవాలు
వి. జయవేణి