ఉన్నది ఎక్కడ… ఓ మిత్రమా… ఉన్నది ఎక్కడ
పగలు, రాత్రి రోజుకు దినసరి నేస్తాలైతే
మోసం, దారుణం మనిషికి మైత్రీ బంధం నేర్పుతున్నాయా…
ఉన్నది ఎక్కడ… ఓ మిత్రమా… ఉన్నది ఎక్కడ
ఉదయం, సాయంత్రం విడదీయలేని కాల గమనాలయితే
భయము, చౌర్యము… పెనవేసుకున్న విషనాగుల
వికటాట్టహాసపు స్థితిని బోలుతున్నాయా
ఉన్నది ఎక్కడ… ఓ మిత్రమా… ఉన్నది ఎక్కడ
బాణుడు, భానుతేజం జీవిత రక్షా చక్రాలైతే
మానము ప్రాణము, కరువైన రక్షణతో మీమాంస పడుతున్నాయా
ఉన్నది ఎక్కడ… ఓ మిత్రమా… ఉన్నది ఎక్కడ
భూ పయనం, భ్రమణం అలుపు లేని పరుగులు తీస్తుంటే
నిత్య కళ్యాణం, పచ్చతోరణాలవలె
రోజుకొక రాక్షస క్రీడా రాజ్యమేలుతున్నాయా
ఉన్నది ఎక్కడ… ఓ మిత్రమా… ఉన్నది ఎక్కడ
నిత్య జన జీవన స్రవంతిలో …
పూటకొక దారుణం
రోజుకొక ఒక రణం
ఎన్నెన్నో ఘోరాలు… నేరాలు… మానభంగాలు… బలి అవుతున్న జీవాలు …
ఎన్నడూ అగునో కదా ఈ మారణ హోమాలు …. విచ్చలవిడి వికృతాలు
ఇది షేక్ కాశింబి గారి వ్యాఖ్య: *సంగీత రీతులు, వాయిద్యాలు, మాత్రా చందస్సుల వివరణ ఆసక్తికరంగా సాగింది.. నావంటి సామాన్యుల కన్నా సంగీత పరిజ్ఞానమున్న వారికి ఇది…
1 Comments
M.k.kumar
1. Kavitvam lotu takkuvuga vundi
2. Parledu