[అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కవితని అందిస్తున్నారు డా. కె.ఎల్.వి. ప్రసాద్]
అవును..
వాళ్లిద్దరూ అంతే!
వాళ్లిద్దరికీ
నేను ఎంత ఇష్టమైన
వాడినో..!
నన్ను వాళ్లు
అసలు కష్టపడనివ్వరు
నేను బాధపడుతుంటే
అసలు ఓర్చుకోలేరు!
నా ఇష్టాలనే
వాళ్ల ఇష్టాలుగా
మార్చుకుంటారు!
నా ఆనందమే
వాళ్ల పరమానందంగా
భావిస్తారు..!
వాళ్లిద్దరి ప్రేమలో
నేను..
తడిసిముద్దయ్ –
పోతుంటాను..!
నా బ్రతుకంతా
ఇలా వారిద్దరి ప్రేమతో
సాగిపోవాలని కోరుకుంటా ,
వాళ్లకు సుఖమయ జీవితం
ఇవ్వాలని
ఆ దేవుడిని వేడుకుంటా..
ఇంతకీ..
ఆ ఇద్దరు ప్రేమమూర్తులూ
ఎవరంటా.. ఇంకెవరు.
ఒకరు నా సతీమణి..!
తర్వాత ఎవరుంటారు..
నా.. కూతురే..!!

వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
15 Comments
డా కె.ఎల్.వి.ప్రసాద్
సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు
—డా కె.ఎల్.వి.ప్రసాద్.
Rajendra Prasad
ధన్యులు మీరు
డా కె.ఎల్.వి.ప్రసాద్
కృతజ్ఞత లు మీకు.
డా కె.ఎల్.వి.ప్రసాద్
జై, చాలా సులభమైన భాషలో చక్కగా వివరించారు అతి ఇష్టమైన ఆ ఇద్దర్నీ రచనలో
బందించి వేశారు ప్రేమలో పాశం
అభినందనలు
—-ప్రొ.నాగులు.వి
హైదరాబాదు.
డా కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలు గురువుగారూ..
డా కె.ఎల్.వి.ప్రసాద్
Ye bharya eyena bharta estalane tana estalaga bhavistundi, kuturu kuda tandri estalane support chestundi. Alagani
Anni kutubalu elage untayani anukokydadu.
Unte mana luck anukovali-
——Smt.Sitadevi
Hyderabad.
డా కె.ఎల్.వి.ప్రసాద్
అమ్మా….ధన్యవాదాలు.
డా కె.ఎల్.వి.ప్రసాద్
అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా డాక్టర్ గారి హృదయ లోగిళ్ళ నుండి వెలువడిన కవిత ,ప్రతి పాఠకుడు తనకు తాను అన్వయించుకొని ,తమ తమ ప్రియ మహిళా మణులకు అందించ తగినగా ఉంది.
—-బి.రామకృష్ణా రెడ్డి
సఫిల్ గూడ.
డా కె.ఎల్.వి.ప్రసాద్
కృతజ్ఞతలు
రెడ్డిగారూ.
డా కె.ఎల్.వి.ప్రసాద్
మహిళా దినోత్సవం ఒక్కరోజు జరిపితే సరిపోదేమో !!!
జీవితాంతం తోడుండి , మనల్ని కాపాడుకుంటూ ,
మనకి ఆనందాల్ని పంచుతూ
తమ తమ సర్వశక్తుల్నీ మనకోసమే ఉపయోగిస్తూ
జీవితాల్ని కరిగించుకునే
స్త్రీ మూర్తుల్ని నిత్యంపూజించుకోవలసిందే కదా !!!!
ఏడుగడకు మూలమైన వారిని జ్ఞాపకం చేసుకున్న కవిత బాగుంది సర్ !!!!
—శ్రీ గన్నమరాజు గిరిజా మనోహర బాబు
హైదరాబాద్/హన్మకొండ.
డా కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలు సర్ మీకు .
sunianu6688@gmail.com
ఇంతకన్నా గొప్పతనం ఏముంది? చాలా హాయిగా ఉంది మనసుకి ఈ కవిత (వాస్తవం) చదువుతుంటే.Dr KLV ప్రసాద్ గారికి ధన్యవాదాలు



డా.కె.ఎల్.వి.ప్రసాద
ధన్యవాదాలండీ.
డా కె.ఎల్.వి.ప్రసాద్
నిజంగా ఆ ఇద్దరూ చాలా అదృష్ట వంతులు సార్ మీ లాంటి గొప్ప తండ్రి ని భర్త ను పొందటం. చాలా బాగా వ్రాశారు. హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు సార్ మీకు














మొహమ్మద్ .అఫ్సర వలీషా
డా కె.ఎల్.వి.ప్రసాద్
అమ్మా
కృత జ్ఞత లు.