ఇది తప్పుడు సమాచారం (misinformation) రాజ్యమేలుతున్న కాలం అంటే తప్పు లేదేమో. దీనిని వార్తలతెగులు (infodemic) కూడా అభివర్ణిస్తారు కొందరు. నేరుగా మాట్లాడ్డం ద్వారా తెలిసేవి కాక మనకి రోజూ న్యూస్ ఛానెళ్ళు మొదలుకుని వాట్సాప్ ఫార్వర్డుల దాకా బోలెడు సమాచారం అందుతూ ఉంటుంది. ఇందులో కొన్ని నిజాలు, కొన్ని సాపేక్షంగా నిజాలు, కొన్ని అవి నిజాలని మనల్ని నమ్మిస్తాయి, కొన్ని నిజమా? అని సందిగ్ధంలో పడేసేవి, కొన్ని పూర్తి అబద్ధాలు. మరి ఇలా అన్ని వైపుల నుండీ అక్కర ఉన్నదీ, లేనిదీ ఏదో ఒకటి వచ్చి మీద పడుతూ ఉంటే మనం ఏం చేయాలి? తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించాలి? అన్న అంశం గురించి ఇటీవలి కాలంలో బాగా చర్చ జరుగుతోంది. తప్పుడు సమాచారం గురించి అవగాహన కలిగిస్తూ స్థానికంగా Factly వంటి సంస్థలు తెలుగులో కూడా విశేష కృషి చేస్తునాయి. అయితే, అసలింత స్థాయిలో ఎందుకు తప్పుడు సమాచారం దశదిశలా వ్యాప్తి చెందుతోంది? నేటి వార్తలతెగులుకి కారణాలేమిటి? అన్న అంశం గురించి ఇటీవల తెలుసుకున్న విషయాల సారాంశం ఈ వ్యాసంలో పంచుకుంటున్నాను.
కెల్లీ గీన్హిల్ అని ఒకావిడ అమెరికాలో రాజనీతి శాస్త్రంలో ప్రొఫెసర్. ఆవిడ ప్రపంచం తప్పుడు సమాచారాల యుగంలా ఎందుకు ఉంది? అన్న విషయం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే ఆరు సామాజిక ధోరణులు అంటూ ఒక జాబితా తయారు చేసింది. అవేమిటో మొదట చూద్దాము:
మొత్తానికి ప్రస్తుత ప్రపంచంలో సమాచారం వ్యాప్తి చెందే పద్ధతి మనకి భయాందోళనలు కలిగిస్తూ, ప్రతి విషయం పైనా ఏది నిజం? ఏది అబద్దం? అన్న అయోమయానికి గురి చేయడం కోసమే తయారైన ఒక సాధనంలా ఉంది. దీనివల్ల తప్పుడు సమాచారాన్ని గుర్తించడం క్లిష్టతరం అయింది. ఇది ఒకరి సమస్య కాదు. మనందరిదీ.
మరి ఇలాంటి పరిస్థితులలో మనం ఏమి చేయగలం? ఏదన్నా వార్తని చూస్తే ఎలా స్పందించాలి? ఇవిగో రెండు సూచనలు:
రెండేనా?? అనుకోవచ్చు. నిజానికి ఇది పెద్ద టాపిక్. పుస్తకాలు పుస్తకాలు ఉన్నాయి ఈ అంశం మీద.
“Relax: A Guide to Everyday Health Decisions with More Facts and Less Worry” అనే పుస్తకం వుంది. రచయిత టిమోథి కాల్ఫీల్డ్ . కెనడాలో ని ఒక యూనివర్సిటీ లో న్యాయశాస్త్ర ఆచార్యుడిగా పనిచేస్తున్నారు. వైద్యశాస్త్ర పరిశోధనలు, వాటి ఉపయోగాలు, వీటిల్లో న్యాయపరమైన అంశాలు అన్నది ఈయన పరిశోధనాంశం. ప్రవృత్తి ఈ అంశాలని స్పృశిస్తూ పాపులర్ సైన్స్ రచనలు చేయడం. ఈ పుస్తకం అలాంటిదే. మన రోజూవారీ జీవితంలో తీసుకునే నిర్ణయాల (పళ్ళు రెండు సార్లు తోముకోవాలా? ఎంతసేపు పడుకోవాలి? పొద్దున్నే లేవాలా? మూడుపూటల తిండిలో ఏ పూటకి ప్రాధాన్యం? వంటివి) గురించి ఏవన్నా పరిశోధనలు ఉన్నాయా? లేకపోతే మనకేది వర్కవుట్ అయితే అది చేస్కోడం ఉత్తమమా? అన్నది ఈ పుస్తకంలోని విషయం. తప్పుడు సమాచారాన్ని గుర్తించి, అందుతున్న సమాచార వెల్లువనుంచి కెషీర నీర న్యాయాన్ని పాటిస్తూ అసలు సమాచారాన్ని గుర్తించటమనే అసిధారా వ్రతాన్ని ప్రతిక్షణం మనమంతా చేస్తూనేవున్నాము. ముఖ్యంగా మళ్ళీ కోవిడ్ మరో రూపు ధరించి ప్రపంచాన్ని ముంచెత్తుతూన్న సమయంలో, ఇంకో రూపు ధరిస్తోంది, అది వచ్చిన ముగ్గురిలో ఒకరు పోతారని ప్రకటనలు వెలువడుతున్న సమయంలో వినిపిస్తున్న ప్రతిదాన్నీ ఎంత వరకు నమ్మాలన్న విషయం ప్రశ్నార్ధకంగా మిగిలిపోతుంది. సమాచారం తెలుసుకుని నిజానిజాలు గ్రహించి భయపడకుండా వుండేందుకు విచక్షణనుపయోగించాల్సివుంటుంది.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
సంచిక – పద ప్రతిభ – 94
కాజాల్లాంటి బాజాలు-71: ఒక్కపూట…
ఉర్దూ భాష స్త్రీ వాద రచయిత్రి ఇస్మత్ చుగ్తాయి కథలు, వ్యాసాల ఆంగ్లానువాదం LIFTING THE VEIL
మా మధ్య ప్రదేశ్ పర్యటన-4
అండమాన్ యుద్ధ క్షేత్రంలో…!
మంచి చెడుల నిర్ణయం
మాయక్క కాపురం
మరుగునపడ్డ మాణిక్యాలు – 60: న్యూటన్
మా బాల కథలు-7
ఇంగ్లీష్ సాహిత్యంలో ఎప్పటి నిలిచి పోయే ప్రేమ కావ్యం – జేన్ ఐర్
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®