హిందువన్నది మతము కాదు
హిందువన్నది ధర్మమనియు,
ఉచ్చతమ న్యాయాలయమ్మే
తీర్పునిచ్చెను రెండుసార్లు.
వేద మార్గము, సనాతనమిది
తరతరాలకు ఆచరణము.
మతములన్నీ సమానమ్మిట
దేశ జీవన విధానమ్ము.
ఏకత్వమున్న దిచ్చట
భిన్నత్వము లోన గూడా.
***
హిందువులకు సివిలు కోడు,
పర్సనల్ లా ముస్లింలకు.
వేరు వేరుగా చూపుతున్నారు
వెర్రివారిగ జేసి ప్రజల.
మైనార్టీల ఓట్ల కోసము
మట్టిగొట్టిరి మెజార్టీలకు.
వివాహాలు విడాకులందు
వివక్షతకు తావునిచ్చిరి.
అల్పసంఖ్యాకులకు హక్కులు
అధిక సంఖ్యాకులకు బాధ్యత.
***
కుక్కలకు కొట్లాట బెట్టిరి
చాటలోన తౌడు బోసి.
జనాభాలో హెచ్చుతగ్గులు
తేడాలెన్నో పెరిగిపోయె.
చట్టానికి అందరొకటే,
లేరు చుట్టాలెవరు యనిరి.
నేడు ప్రజలు కోరుతున్నరు
సమానమ్ముగా సివిలు కోడు.
మత కొట్లాటలు మాయమవును
పుణ్య భారత దేశమందు.
ఐతా చంద్రయ్య సీనియర్ రచయిత. సిద్దిపేట అనగానే ముందుగా గుర్తుకువచ్చేది ఐతా చంద్రయ్యనే. వందపైగా పుస్తకాలను ప్రచురించిన ఐతా చంద్రయ్య రచనలు చేయని సాహిత్య ప్రక్రియ లేదు.
1 Comments
వేంకట చండీశ్వర్
ఇంకను మించి పోలేదు. ప్రస్తుత ప్రభుత్వం చొరవ తీసుకుని ‘కామన్ సివిల్ కోడ్’ ప్రవెశ పెట్టాలి త్వరిత గతిన
Let’s have ‘one country – one law’ system to unite the people of India.
శుభాభినందలు