సంచికలో తాజాగా

Related Articles

12 Comments

  1. 1

    Chagal shyam kumar

    మానవులకు ఉన్నటువంటి ఎన్నో రకాల భావోద్వేగాలలో ఈర్ష్య ద్వేషాలు కూడా ఒకటి.
    ఎక్కడో చదివాను ప్రముఖ సినీ నటుడు గురు దత్, వహిద మధ్య ఉన్న అనుబంధం చెడిపోయి గురుదత్ మరణానికి కారణం కూడా మానసికంగా పరిణతి చెందని అతని కూతురు అని.

    జీవితకాల ప్రయాణంలో ఎవరు ఎవరికి నచ్చుతారు ఎవరిని ఎవరు ఇష్టపడతారు అనే విషయాలకు తగిన కారణాలేవీ కనపడలేదు.
    రక్త సంబంధం మరియు బంధుత్వం లాంటివి ఏమీ లేని , స్త్రీ పురుషుల మధ్య బంధాలకు అనుబంధాలకు మన భారతదేశ సంస్కృతిలో
    సరియైన అవగాహన లేదని చెప్పాలి.

    దానికి కారణం భర్త మీద భార్యకు ,తండ్రి మీద కూతురికి ఉండే పొసెసివ్నెస్ అనబడే మానసిక దౌర్బల్యమే కారణం.
    ఏది ఏమైనా మన భారతదేశంలో ఇటువంటి సంఘటనలు కోకొల్లలు. వాటి మూలంగా మనసులో దెబ్బతినడం మామూలే. అలాంటి మానసిక దుర్బలుల ను చూసి జాలిపడి ఉన్నతంగా ఆలోచించి ఎవరి స్నేహాలను వారు నిలబెట్టుకోవడం తార్కికం.

    మనసు గాయపడ్డప్పటికీ అవతలి వారి మానసిక స్థితిని సహృదయంతో అర్థం చేసుకొని మన స్నేహాలను మనం కొనసాగించాలి. ఎందుకంటే అపార్థాలు అన్నవి ఎల్లకాలం ఉండవు.

    ఈ కథలో పైన నేను ఉదాహరించిన విషయంతో
    రచయిత్రి గారు కథ ముగిస్తే చాలా బాగుండేది అని నా అభిప్రాయం.
    కథలో కథానాయకురాలు యొక్క మనస్తత్వం మెచ్యూరిటీ కి దూరంగా ఉంది అని చెప్పక తప్పడం లేదు.

    Reply
  2. 2

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మేడం
    మీ వసంతం లో గ్రీష్మం చదివాను.
    మీ కథలలో ప్రతి పాత్రకు ప్రత్యేకత
    ఉంటుంది. అది నాకు బాగా నచ్చుతుంది. తన తల్లిని కాకుండా వేరే స్త్రీ మీద అభిమానం చూపడం
    పిల్లలకు నచ్చకపోవడం సహజం.
    అర్థం చేసుకునే అర్ధాంగి దొరకడం శ్యాముగారి అదృష్టం . తన వల్ల వారి కాపురంలో గొడవలు రాకుండా ఉండాలని… స్వచ్ఛమైన అభిమానానికి మచ్చ రాకూడదు అని రేవతి తీసుకున్న నిర్ణయం సరియైనది అని అనిపించింది నాకు.
    అభినందనలు మేడం మీకు
    —–కళావతి.కండగట్ల
    హైదరాబాద్.

    Reply
  3. 3

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    వసంతంలో గ్రీష్మం …ఝాన్సీ
    కథ బాగుంది…. కథలో పాత్రలు మనం చుట్టూ చూస్తున్న మనుషుల్లానే చాలా సహజంగా ఉన్నారు…. శ్యాము రచయిత్రి పై చూపిన ఆరాధన, దమయంతి తన భర్త పై పెట్టుకున్న నమ్మకం, అర్థం చేసుకోవడం చాలా అపురూపం…. ఇక కూతురు వయసు ప్రభావం వల్ల ఆలోచించిన ధోరణి అత్యంత సహజంగా ఉంది… మనవల్ల ఇంకొకరి జీవితంలో కలతలు రాకూడదని రచయిత్రి శ్యామూకి దూరంగా జరగడం చాలా ఉన్నతమైన స్టెప్ అనిపించింది నాకు.
    మంచి కథ ఝాన్సీ!!
    ——సుగుణ.

    Reply
  4. 4

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    వసంతం లోగ్రీష్మం చదివాను.బావుంది. ప్రశాంతముగా గడపవలసి వయసులో ముగింపు మంచి నిర్ణయము అనిపించింది
    —-shyama sundari.

    Reply
  5. 5

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మీరు రాసిన కథ చదివాను, చాలా బాగుంది. ప్రతి పాత్రను కళ్ళకు కట్టినట్లు చూపారు మీ రచనతో. శ్యాము గారి అభిమానం నిర్మలమైనది అయినప్పటికీ, పవిత్ర అభిమానం కళంకం అంట కూడదని రేవతి చేసిన పని సబబే. దమయంతి పాత్రను చక్కగా చూపారు. బావుంది.
    —శిల్ప.నూగుల.

    Reply
  6. 6

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    To Jhansi madam,
    Madam, I read vasantham lo grishmam, I feel conclusion is extreme step. It makes syam feel bad though he did not do any mistake. When he is pure and good why should he suffer with his daughter’s misunderstanding rather he can explain about Revathi writings and her influence upon him then slowly things may go hand in hand. When Revathi is great writer her decisions need to be bit ideal and balanced I feel.
    —–M.Narayana.

    Reply
    1. 6.1

      Anuradha Bandi

      అర్ధం అపార్ధాల
      అభిమానం అనుమానాల
      సంఘర్ణణని
      చక్కగా చిక్కగా అక్షరీకృతం చేసారు ఝాన్సీ గారూ

      అర్ధం అపార్ధాల
      అభిమానం అనుమానాల
      సంఘర్ణణని
      చక్కగా చిక్కగా అక్షరీకృతం చేసారు ఝాన్సీ గారూ

      Reply
      1. 6.1.1

        Anuradha Bandi

        అపార్ధపులోతుల్లో అసూయానంతర దృశ్యమానమిది
        ఎవరి దృష్టికోణం బట్టీ వారికి వార్ సబబుగా
        వారి యోచన వారికి సరి అయునదిగా అగుపిస్తుంది

        Reply
  7. 7

    మొహమ్మద్ .అఫ్సర వలీషా

    కథ సజీవంగా కళ్ళకు కట్టినట్లు వ్రాశారు ఫ్రెండ్. మీ ప్రతి అక్షరం ఓ ఆణిముత్యం. చాలా బాగుంది కథ. హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు మీకు💐💐💐💐💐💐💐💐💐💐💐💐
    మొహమ్మద్. అఫ్సర వలీషా
    ద్వారపూడి (కోనసీమ జిల్లా)

    Reply
  8. 8

    శ్రీధర్ చౌడారపు

    కథ కథనం రెండూ బాగున్నాయి. నాలుగు పాత్రలు, తలా పిడికెడు సంభాషణలు. కథంతా కథకులు నడిపించే.
    నిజమే! ఫోన్ నెంబర్ బ్లాక్ చేయకుండా చేయగలిగింది ఏమీలేదు. మంచి నిర్ణయం. కానీ శ్యాము పరిస్థితి ఘోరం. విషయం తెలియక తల్లడిల్లిపోయే బాధను అతని షష్టి పూర్తి బహుమతిగా ఇచ్చేసింది రచయిత్రి. అది మాత్రం బాలేదు.
    మంచి కథ

    Reply
  9. 9

    sunianu6688@gmail.com

    ఝాన్సీ గారి రచనలు నేను కొన్ని చదివాను. వారి అభిమానిని. కథలోకి వస్తె వాస్తవ కథ లా వుంది. కొంతమందికి అలా అభిమానం ఏర్పడుతుంది. మహిళలను, మహిళలు అభిమానిస్తే ఏమీ ఉండదు. ఇలా లింగ భేదం వల్ల ఫ్యామిలీ లో కానీ, స్నేహితులలో కానీ అపార్థాలు ఎక్కువ. మరీ ముఖ్యంగా ఇప్పటికీ ఎంత చదువుకున్నా, ఉద్యోగాలు చేస్తున్న, ఎన్నో రంగాల్లో మహిళలు ముందంజ లో వున్నా ఇలాంటి అపార్థాలు, అనుమానాలు, అవమానాలు తప్పవేమో. రచయిత్రి ఝాన్సీ కొప్పిసెట్టీ గారికి హృదయపూర్వక అభినందనలు 👌👍🌹

    Reply
  10. 10

    Satya

    చాలా సహజంగా ఉంది కథ.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!