సంచికలో తాజాగా

Related Articles

10 Comments

  1. 1

    NS Murty

    గురూజీ,
    మీ వ్యాసం రసవత్తరం. కవితలోని వాదాన్ని – ఉదారత, సోపగుంభితపద వాసనలు గానూ; ప్రసాదగుణ, సౌకుమార్యాలుగానూ – మీరు విడదీసి పరిష్కరించిన తీరు మహత్తరంగా ఉంది. సద్గతి రచియించిరేని కలకాలము వారలు మెత్తురేగదా అన్న మీ ఫలశ్రుతి కూడా ఔచిత్యభరితంగా ఉంది.
    ప్రణామాలు.

    Reply
    1. 1.1

      ఏల్చూరి మురళీధరరావు

      🌹🙏🌹 మాన్యశ్రీ నౌడూరి మూర్తి గారికి
      నమస్కారములతో,

      వ్యాసప్రతిపాదితాన్ని మీరు ఆమోదించినందువల్ల నాకెంతో ఆశ్వాసనం కలిగింది. మీ సహృదయతకు, స్పందనకు — నా హృదయపూర్వక ధన్యవాదాలు.

      Reply
  2. 2

    వేటూరి ఆనందమూర్తి

    అబ్బో అనిపించే మీ లోతైన కావ్య కవితా విశ్లేషణం అబ్బురం గొల్పింది. కవితను చదివినప్పుడు సమర్థుడైన ప్రతి విమర్శకుడూ తానొక కవియై నూతన కావ్య సృష్టి చేయగల రసాత్మకుడౌతాడన్న వార్త సత్యమే అనిపించింది! అన్నమయ్య పదకవితల్లో తన విమలగాంధర్వంతో రాళ్లను కరగించి వట్టిమాకుల నిగిరింపజేస్తే చేమకూరకవి పద్యకవితలో సరస్వతిని సాక్షాత్కరింపజేసికొన్న వైనాన్ని మీరు సుప్రీం కోర్టు తీర్పులా సాధికారంగా విమర్శ వాదాన్ని గెలిపించా రనిపించింది. భేష్ భేష్ !

    Reply
    1. 2.1

      ఏల్చూరి మురళీధరరావు

      🌹🙏🌹 పూజ్యలైన బ్రహ్మశ్రీ వేటూరి ఆనందమూర్తి గురుదేవులకు
      ప్రణామములతో,
      నిరవధిక ప్రేమపూర్వకమైన మీ స్పందనను శ్రీ మురళీకృష్ణ గారు నాకు తెలియజేసినప్పుడు మనస్సు విగళిత వేద్యాంతరమైన ఆనందానుభూతితో నిండిపోయింది. నాకు తెలిసిన విద్వల్లోకంలో కనిష్ఠికాధిష్ఠిత మహాభిరూపత చేత పంక్తిపావనులైన మీరు అనుమోదించటం, చేమకూర వేంకటకవి, “పుట్టినదాదిగాఁ దనదు పుణ్యమె దాదిగ” అన్నట్లు, నేను నోచినదానికి ఫలం కాకపోతే, మరేమిటి!
      మీ దయామయ సందేశానికి నేను కృతజ్ఞుణ్ణి.
      సప్రశ్రయంగా,
      ఏల్చూరి మురళీధరరావు

      Reply
  3. 3

    డా.సిహెచ్.సుశీల

    లోతుగా అధ్యయనం చేయకుండా, చమత్కారాన్ని ఆస్వాదించకుండా, రసార్ధాన్ని అనుభవపూర్వకంగా గ్రహించలేని “సాహిత్య కారులనబడే” కొందరు – అర్థంలేని ఆరోపణలు చేయడం నేటి దురదృష్టకర పరిస్థితి.

    Reply
    1. 3.1

      ఏల్చూరి మురళీధరరావు

      🌹🙏🌹 డా. సి.హెచ్. సుశీల గారికి
      నమస్కారములు.

      మీరు సూచించినట్లు ఈనాడు తెలుగు కావ్యాలలోని పద్యాలను సహృత్సమాధేయంగా పునర్వ్యాఖ్యానింపవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. మీ స్పందనకు హృదయపూర్వక ధన్యవాదాలు!

      Reply
  4. 4

    Sandhya Yellapragada

    ఏల్చూరి వారు కవి మేధావి. వారి రమయ మైన వ్యాసముతో రససిద్ది తప్పక కలుగుతుంది పాఠకులకు. పంచినందు కృతజ్ఞతలు.
    సంధ్య

    Reply
    1. 4.1

      ఏల్చూరి మురళీధరరావు

      🌹🙏🌹 శ్రీమతి యల్లాప్రగడ సంధ్య గారికి
      నమస్కారములతో,
      మీ సహృదయ స్పందనకు, అనుమోదానికి హృదయపూర్వక ధన్యవాదాలు.

      Reply
  5. 5

    మహేందర్ రెడ్డి

    చాలా విపులంగా, హేతుబద్ధమైన మీ విశ్లేషణ అపూర్వం, అమోఘం గురువు గారు.
    మీ పరిశోధనాత్మక వ్యాసరచనకు నమస్సులు.
    ధన్యవాదాలు

    Reply
    1. 5.1

      ఏల్చూరి మురళీధరరావు

      🌹🙏🌹 శ్రీ మహేందర్ రెడ్డి గారికి నమస్కారములు.

      వ్యాస ప్రతిపాదితం మీకు ఆమోదయోగ్యమైనదని తెలిసి చాలా సంతోషం కలిగిందండీ. మీ స్పందనకు ధన్యవాదాలు!

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!