[శ్రీ పెద్దాడ సత్యప్రసాద్ రచించిన ‘వెన్నెల తునక’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]


ఓ చేప పాపా..
నా కంటి చూపా
వెన్నెల తునకా
వన్నెల నురగా
మీనాలు సైతం
అత్రంగా చూసే
అరుదైన రూపం
నీ సొంతం
ఆ పసితనము రంగు
పసిడికి ఎక్కడిదీ
మిసిమి ఛాయల నిగ్గు
ముసిముసిల సిగ్గు
ఇంకెవరికి ఉండేను
నీకు సాటిగా
మరెవరు నిలిచేను
అందానికే అందము
మా ముద్దు పాపాయి
ఈ తీరు నిన్ను చూస్తే
గుండెల్లో ఎంత హాయి

పెద్దాడ సత్యప్రసాద్ విశాఖపట్నం జిల్లా వాస్తవ్యులు, కవిగా, రచయితగా దశాబ్దాల ప్రయాణం. వీరి కధలు, కవితలు వివిధ పత్రికలలో ప్రచురితమవడమే కాక, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ద్వారా కూడా ప్రసారం అయ్యాయి. ఇక, వృత్తిగతంగా పాత్రికేయులు. రెండున్నర దశాబ్దాలకు పైగా పాత్రికేయ వృత్తిలో అంకితభావంతో పనిచేస్తున్నారు. రాజకీయ విశ్లేషణలు వీరి ప్రత్యేకత. ప్రస్తుతం ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగంలో న్యూస్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.