ఎప్పుడో మొలిచిన మొండి ఖడ్గం ఇప్పుడు కొచ్చగా పదునెక్కేలా సానబెట్టుకొని దాడి చేస్తుంది ఊపిరి తీస్తుంది ఆకాశంలో సగాన్ని
తరాలు మారుతున్నా లింగ వివక్ష శూన్యస్థితికి రాకుండా ఇంకా రగులుతూనే ఉంది రావణకాష్టంలా నేటికీ వెర్రితలలు వేస్తుంది ఈ వింత వ్యాధి సమాజంలో మానవతకూ, స్త్రీ జాతికీ సవాలు విసురుతూ
గర్భస్థ శిశువును బలిగొనే రాక్షసత్వం ఊడలు దిగింది ఆడజాతిపై కక్ష పెంచుకొని ఎగుస్తుంది రాచపుండులా స్నేహం, ప్రేమ మాయ వలలో అహం, ద్వేషం జడలు విప్పుకొని
మనకు జన్మనిచ్చింది అమ్మ జాతికి తల్లివేరు తెలుసుగా మరి ఏ మత్తులో మరిచిందో గాని పురుషాహంకారం మృగమై విశృంఖల నృత్యంలో మానని గాయాలు చేస్తుంది
పుత్రుని కనాలనే కోరికలో తల్లి తీరని దాహం ప్రతి కాన్పులోనూ దేవతే జన్మించే ఆకాశంలో వెలిగే దివ్వెలుగా.. ఇక, మగాహంకారమేమో నేలపై వెంటాడి వేటాడబట్టే ఉన్మాదమై
ఈ వివక్షకు ఆఖరి పాటగా అక్షర శరాలు సంధించాలి సమానత్వం సాధన దిశలో మానవత్వపు కనులు తెరుచుకోనేలా పురుష మొదళ్లను మొదలంటా దున్నాలిక హలాలతో పొలాలుగా..
డా.టి.రాధాకృష్ణమాచార్యులు సీనియర్ వైద్యులు, ప్రముఖ కవి,రచయిత, అనువాదకులు, సమీక్షకులు. 5 సంకలనాలు తెలుగు కవిత్వంలో 1999 నుండి కరీంనగర్ నుండి పబ్లిష్ చేశారు. నలిమెల భాస్కర్ ‘సాహితీ సుమాలు’ వివిధ భారతీయ భాషల్లోని సాహితీవేత్తల పరిచయ సంకలనాన్ని “The Speaking Roots” Title తో ఆంగ్లంలోకి అనువాదం చేసినారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
బివిడి ప్రసాదరావు హైకూలు 9
కైంకర్యము-41
అన్నింట అంతరాత్మ-3: బడిలో.. గుడిలో.. అంతట మ్రోగే గంటను నేను
పూచే పూల లోన-51
అనుబంధ బంధాలు-3
నేను.. కస్తూర్ని-22
‘పిట్ట కొంచెం కూత ఘనం’ – పుస్తక పరిచయం
తల్లివి నీవే తండ్రివి నీవే!-41
నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు-68
ప్రసాదం
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®