

సంచిక వెబ్ పత్రిక నిర్వహించిన దసరా కవితల పోటీకి తమ కవితలను పంపి పోటీని విజయవంతము, అర్ధవంతము చేసిన సహృదయులయిన కవులందరికీ బహుకృతజ్ఞతలు, ధన్యవాదాలు. పోటీ అన్నది కేవలం సామాన్యంగా వాడేపదం.. అలాగే విజేతలన్నది కూడా పోటీ వుంది కాబట్టి వాడే పదం. కానీ, నిజానికి ఇలాంటి సాహిత్య పోటీల్లో గెలిచేది సాహిత్యమే!!!! ఈ పోటీల్లో పరాజితులంటూ వుండరు.
సంచిక పాఠకులకు దీపావళి శుభాకాంక్షలు. సంచిక నిర్వహించిన దీపావళి కథల పోటీకి కథలు పంపిన రచయితలకు, వాటన్నింటినీ చదివి తమకు నచ్చిన కథలకు ఓటు వేసి తమ అభిప్రాయాన్ని తెలిపిన పాఠకులకు, ఓటు వేయకున్నా కథలను చదివిన సంచిక పాఠకులకు, కథలన్నిటినీ ఓపికగా చదివి తమ అభిప్రాయాన్ని నిక్కచ్చిగా తెలిపిన న్యాయనిర్ణేతలకు సంచిక బృందం ధన్యవాదాలు తెలుపుకుంటోంది. ఇలా అందరం మనవంతు కర్తవ్యాన్ని నిజాయితీగా, నిర్మోహంగా, నిర్మొహమాటంగా నిర్వహిస్తూంటే త్వరలోనే తెలుగు కథల పోటీలలో కథల ఎంపికపై వున్న దురభిప్రాయం తొలగి ఆరోగ్యకరమయిన పోటీ వాతావరణం నెలకొంటుంది. నాణ్యమయిన రచనలు, రచయితలు సముచితమయిన గుర్తింపు పొందుతారు. పోటీలో గెలుపొందిన కధలు.