బాల్యంలో మట్టిలో ఆడుతుంటే అమ్మకి చెబుతానన్నప్పుడు అమాయకంగా కన్నీళ్ళు పెట్టుకున్న చిట్టి ‘చెల్లివి’ కదూ నువ్వు!
ఆకతాయిలతో కలిసి అల్లరి చేస్తున్నప్పుడు చెంప చెల్లు మనిపించి నా వ్యక్తిత్వానికి పదును పెట్టిన పెద్ద మనసు ‘అక్కవి’ కదూ నువ్వు!
ప్రేమంటే ఆకర్షణ కాదని వలపు తాడుతో నన్ను కట్టేసి కొత్త విజయాల సరికొత్త లోకం వైపు నన్ను నడిపించిన ‘నెచ్చెలివి’ కదూ నువ్వు!
పెళ్ళంటే ఎగిసిపడే మంట కాదని నిండు నూరేళ్ళ పసిడి పంటగా మార్చిన అత్త మామల్ని అమ్మానాన్నలుగా చూసిన నాలో సగమైన ‘శ్రీమతివి’ కదూ నువ్వు!
నెత్తుటి గాయాల ఈ నాన్న గుండెపై చల్లని నీ లేత పాదాలతో స్పర్శాలేపనం రాసిన గారాల నా ముద్దుల ‘కూతురివి’ కదూ నువ్వు!
నీ కడుపున పుట్టి కడుపు మీద తన్నినా కరుణతో నీ అనురాగాన్నంతా కరిగించి నాకందించిన ‘అమ్మవి’ కదూ నువ్వు!
పాత్ర ఏదైతేనేం సార్థకత సాధించడం నీకే చెల్లింది అందుకే ఓ ‘వనితా!’ నా కవిత నీ పాదాల చెంత మోకరిల్లింది!!
All rights reserved - Sanchika™