సంచికలో తాజాగా

Related Articles

6 Comments

  1. 1

    M V S RANGANADHAM

    ఎప్పటికప్పుడు తాము ఉన్న స్థితి నచ్చని వాళ్ళు చాలా మంది ఉంటారు, లోకంలో. చాలకపోవడం లేదా సరిపోకపోవడం (feeling of inadequacy) అనే భావనే మనతో పాటు పెరిగి పెద్దదై చిన్నప్పటి వాతావరణంలో నేర్చుకున్న లేక గమనించిన విలువలను క్రమక్రమంగా వదిలిపెట్టేలా చేస్తుంది. అదే డబ్బుపిచ్చగా లేక ఇంకోరకం పిచ్చగా మనుషుల్లో పాతుకుపోతుంది. ఎప్పటి నుంచో తన చుట్టూ కొన్ని కుటుంబాలలో / వ్యక్తులలో జరుగుతున్న మార్పులను చూస్తున్న అనుభవాలను రచయిత్రి చాలా గొప్పగా ఈ కథలో చిత్రించారు.

    Reply
    1. 1.1

      Nanduri Krishna Mohan Rao

      ధనమూలమిదం జగత్ అన్నది నిజం… డబ్బు లేకుండా నాగరీకుడైన మనిషి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేడన్నదీ యథార్థమే… అయితే అట్టి ధనం ఏ రూపంలో ఉన్నదన్నదే ప్రధానం…
      చేతిలో డబ్బు, స్థిరాస్తుల రూపంలో ఉన్న డబ్బు, రాబోవు కాలాన్ని ముందుగానే తాకట్టు పెట్టి అప్పు తీసుకోవడం రూపేణా లభించే డబ్బు అన్నవి మూడు ప్రధాన రకాలు..
      అయితే మొదటిది, మూడోది ఒకే జాతికి చెందినవి… కాకపోతే మొదటిది కష్టార్జితం, మూడోది భవిష్యత్తును తాకట్టు పెట్టడం ద్వారా సంక్రమించినది…
      ఇదిగో, ఈ మూడోదే అత్యంత ప్రమాదకరం… ఇదే మిగతా రెండింటినీ శాసిస్తోంది… ఒకరి స్థిరాస్తులను మరొకరి చరాస్తులుగా మార్చిపారేస్తోంది… ఆ విధంగా సంక్రమించే చేతిలో డబ్బే, అంటే లిక్విడ్ క్యాషే నేడు సమస్త ప్రపంచాన్ని అంధకారంలోకి నెడుతోంది… తొలిగా నైతికతను దెబ్బ తీసిందది .. ఆ క్రమంలో దాన్ని నామరూపాలు లేకుండా చేసింది… ఆ ఫలితంగా కుటుంబ సంబంధాలు హరించబడ్డాయి… వాటికే దిక్కులేనపుడు మానవ సంబంధాలు ఎలా అఘోరిస్తాయి…
      ముఖ్యంగా మన సమాజం మీద అది తీవ్ర దుష్ప్రభావాలను చూపుతూ వస్తోంది… ఓ ఏడెనిమిది దశాబ్దాల క్రితం వరకు బార్టర్ ఎకానమీనే ఆశ్రయించిన కులవృత్తుల ఆధారిత సమాజం ఒక్కసారిగా ఆటుపోట్లకు గురయ్యింది పారిశ్రామిక విప్లవం పుణ్యమాని… బ్రిటిషు వారి ఏలుబడి పుణ్యమాని కులవృత్తులనే నమ్ముకుని రోజులు గడుపుకుంటోన్న మన సమాజం ఏమి చేయాలో తెలీని అయోమయ స్థితిలోకి నెట్టబడింది…
      నయాదౌర్ అన్న చిత్రం ద్వారా ఇదే అంశాన్ని బి.ఆర్. చోప్రా స్పృశించాడు… అప్పటివరకు బార్టర్ సిస్టం ప్రధానంగా సాగిన మన సమాజం ఒక్కసారిగా క్యాష్ అనే ఓ మీడియేటర్ ఆధారంగా మాత్రమే ముందుకు సాగాల్సిన సమాజంగా రూపాంతరం చెందింది…
      అలా మారిన పరిస్థితులకు నెమ్మదిగా అలవాటు పడుతోన్న మన సమాజం మీద సరళీకృత ఆర్థికం మాటున దండెత్తిన గ్లోబలైజేషన్ అన్నది మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా అయ్యింది… అంతకు ముందు జాతీయం చేయబడ్డ సుమారు అన్ని సంస్థలు, ముఖ్యంగా బ్యాంకులు, ఇన్సూరెన్సు సంస్థలు ప్రైవేటుపరం అవనారంభించాయి… జాతి సంపద కాస్తా కొందరు వ్యక్తుల సంపదగా మారిపోయింది…
      నేడు కుక్కని కొడితే డబ్బు… ప్రైవేటు బ్యాంకులవారే వెంటపడి అప్పులు ఇస్తూ సమాజం మొత్తాన్ని బ్రష్టు పట్టిస్తున్నారు .. ఫలితంగా మూడో రకమైన అప్పు ద్వారా లభించే చేతిలోని డబ్బు మనిషిని శాసించడం మొదలయ్యింది…
      ధనమూలమిదం జగత్ అన్నదాని అర్థం మారిపోయింది… ధనమేరా అన్నిటికీ మూలం అన్నది స్థిరపడిపోయింది… అయితే ఆ ధనం కేవలం అప్పు ద్వారా లభించే లిక్విడ్ మనీ మాత్రమే అని గ్రహించాలి… అదే అన్ని అరిష్టాలకు మూల హేతువుగా మారింది.. మారుతోంది… మారుతూనే ఉంటుంది…
      దీనికి ఎప్పటికీ పరిష్కారం లభించదు… అనాదిగా ఆధారపడుతూ వచ్చిన కులవృత్తులను, తమ స్వగ్రామాలను వదిలి పరాయి పనులు, పరాయి ప్రదేశాలకు వెళ్లే వారికి చేతిలో డబ్బే, అదీ ఇలా అప్పు రూపేణా లభించే లిక్విడ్ మనీయే దిక్కు… చివరికదే దిక్కుమాలినవారిగా చేసేస్తోంది…
      నిజమేగా మరి… ధనమేరా అన్నిటికీ మూలం అనడం తప్పెలా అవుతుంది… అలా అనడం తప్పు కాకపోవచ్చు గాని అదలా అవడం మాత్రం ముమ్మాటికీ తప్పే…

      Reply
      1. 1.1.1

        కొల్లూరి సోమ శంకర్

        ఇది డా. శ్రీమతి కొఠారి వాణి చలపతిరావు గారి స్పందన: కృష్ణమోహన్ గారూ..! నమస్కారమండీ..! ఇప్పుడే ‘ధనమేరా అన్నిటికి మూలం’ అన్న నా కథకు మీరు పెట్టిన కామెంట్‍ని చూడటం జరిగింది .అబ్బ ..ఎంత వివరంగా, ఎంత గొప్పగా, ఎంత సుదీర్ఘంగా మనిషి జీవితంలో ప్రముఖపాత్ర వహించే డబ్బు గురించి చెప్పారండీ. ఆర్థిక విషయాలు మీరు చెప్పినవి చదువుతుంటే చాలా బాగా అనిపించింది. నేను లోకరీతిని, మానవ మనస్తత్వాన్ని కథలా రాసుకుంటూ పోయాను గానీ ఆర్థికశాస్త్రపు దృష్టితో ఆ కోణంలో ఇంత deep గా ఆలోచించలేదు.లిక్విడ్ క్యాష్‌ నే డబ్బు దుర్వినియోగం అవటానికి, ధనమేరా అన్నిటికీ మూలం అని అనటానికి కారణమని చాలా చక్కగా చెప్పారు. ప్రయివేటీకరణే ప్రజల సొమ్ము కొందరి చేతుల్లోకి వెళ్ళటానికి కారణమని నడుస్తున్న చరిత్రను కరెక్ట్ గా చెప్పారు. ‘ధనం మూలం ఇదం జగత్’ అన్నది ‘ధనమేరా అన్నిటికీ మూలం’ అవటానికి కారణం ఇదేనని బాగా చెప్పారు. మీకు అభినందనలు..💐ధన్యవాదాలు 🙏 నా ఛానల్ కథా వాణిలో ఈ వారం ఈ కథే వినిపించాను 👍🙏 *

        Reply
        1. 1.1.1.1

          Nanduri Krishna Mohan Rao

          ధన్యవాదాలు మేడం మీకు… 90వ దశకం మధ్యనాళ్ళ నుండి మన సమాజం వేగంగా మారుతూ వచ్చింది… ఎంత వేగంగా అంటే దేశాన్ని ఓ చుట్టగా చుట్టి బలంగా ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డున పడేసినట్టు… ఇవతలి ఒడ్డు నుండి అవతలి ఒడ్డును చేరుకోవాలంటే కష్టపడి ఈదుకుంటూనో ఏదో ఒక వాహనాన్ని ఆశ్రయించోనో వెళ్ళాలి… కాని మన సమాజం విసిరేవేయబడింది ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకు… వేగంగా చోటు చేసుకుంటున్న అభివృద్ధి మాత్రమే కనిపిస్తోంది మనకు.. కాని దానికి సమాంతరంగాను, అంతకు మించిన వేగంతోను బ్రష్టుపడుతున్న వ్యవస్థలు కనబడడంలేదు… భౌతిక (సైంటిఫిక్ మరియు కాంక్రీట్) సిద్ధాంతాలకు, సామాజిక (అబ్ స్ట్రాక్ట్) సిద్ధాంతాలకు నడుమ ఉండే తేడా ఒకటే… అవి ప్రయోగాత్మకంగా పరిశీలించిన వెంటనే తమ ఫలితాలు ఇవ్వడం మొదలెడతాయి… సామాజిక థియరీలు అలా కాదు… అవి సత్ఫలితాలు ఇస్తాయా లేదా అన్నది తేలడానికి ఏళ్ళు, పూళ్ళు పట్టొచ్చు.. తరాలు కూడా పట్టొచ్చు… కార్ల్ మార్క్స్ ప్రవచించిన మార్క్సిజ సిద్ధాంతాన్నే తీసుకోండి… వందేళ్ళ తరువాత కాని తెలియలేదు అది ఆచరణయోగ్యం కాదని… 90వ దశకం ప్రధమార్ధంలో మనం నెత్తికెత్తుకున్న సరళీకృత ఆర్థికం చూడండి ఎన్ని సామాజిక మార్పులకు, ఒడిదుడుకులకు, నైతిక పతనానికి కారణభూతమైందో…
          మారుమూల గ్రామాలనుండి మహానగరాల వరకు ఒకే సంస్కృతి రాజ్యమేలుతోంది నేడు… ఎక్కడ చూసినా డిస్టోపియన్ ప్రపంచమే సాక్షాత్కరిస్తోంది… అరయన్ వంశము నిల్పనే గదా వివాహంబు అంటాడు హరిశ్చంద్రుడు… వంశము నిల్పడం సంగతి అటుంచండి, అసలు పెళ్ళే వద్దంటోంటే నేటి యువత… సృష్టి తాలూకు ప్రధాన ధర్మానికే తూట్లు పడిపోతే సమాజం ఏ విధంగా ముందుకెళ్తుంది…
          మూడంటే మూడు దశాబ్దాలలో ఎంత ఘోరంగా మారిపోయిందో మన సమాజం చూడండి…

          Reply
          1. 1.1.1.1.1

            వాణీ చలపతి రావు

            మీ రెండో కామెంట్ మరింత ఆశ్చర్యపరిచింది కృష్ణమోహన్ గారూ .మనిషి మనుగడ గురించి , సమాజ అభివృద్ధిగురించి మీరు ఎంత బాధ్యతాయుతంగా ఆలోచించే, ఆరాటపడే పౌరుల్లో నాకు అర్ధమయింది .మీ రెండు కామెంట్స్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను . అవునండీ అభివృద్ధి పేరిట కుటుంబాల ,వ్యవస్థల పతనం జరుగుతోంది .మీరన్నట్టు slow గా జరిగే పతనం ఇది . అనేక ధన్యవాదాలు మీకు…🙏..

  2. 2

    Nanduri Krishna Mohan Rao

    🙏

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®