కారంకోరంలో హిమహలాహలం మింగటానికి శంకరుడు లేడు, సైనికులు తప్ప వారికి ఇంటిపై ధ్యాస లేదు ప్రాణంపై ఆశ లేదు దేశంపై ప్రేమ తప్ప
సియాచిన్ అంటే గులాబీ వనం వసివాడిన పూవులా రాలిపోవు జీవనం అక్కడ ప్రకృతే శత్రువు అనునిత్యం మృత్యువు పలుకరించు మంచుతుపానులే స్నేహితులు మీదపడే చరియలే చుట్టాలు అనుకోని భూకంపాలే అతిథులు
చలి నిర్దయ అయినవేళ దాయాదుల పాగా ప్రకృతి వికటాట్టహాసంతో ప్రాణాలే పోగా మెక్కమొలవని నేలకోసం మొక్కవోని పోరాటం బట్టనెత్తియిరువురికి, దువ్వెనకై ఆరాటం
సియాచిన్లో మంచుకప్పు దాయాదులకు కనువిప్పు ఎప్పుడో దేవుడా తెలియచెప్పు
All rights reserved - Sanchika™