సంచికలో తాజాగా

Related Articles

5 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అవధానం రఘుకుమార్ గారి స్పందన: *మీతో ఏకీభవిస్తున్నాను.
    ఈ ఒకే దేవుడు, ఒకే మత పీఠం, ఒకే పుస్తకం అనే వాటిని భారతీయ సమాజం ఒప్పుకోదు.
    ఆ ఆలోచనలో భాగంగానే నేను హిందూ మహాసభ, సావర్కర్, ఆర్.ఎస్.ఎస్ లు ఇంపోస్ చేస్తున్న “రాముడు”, “భగవద్గీత” లాంటి భావనలను కూడా వ్యతిరేకిస్తాను. ఇందులో కూడా హిందూ మతాన్ని ఒకే దేవుడు, ఒకే అధికార పీఠం, ఒకే పుస్తకపు భావనలు బలంగా వున్నాయి అనేదే నా అభిప్రాయం.*

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అవధానం రఘుకుమార్ గారి స్పందన: *మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను.
    భారతీయ సమాజం బహుళత అనే ప్రాధమిక ఆలోచనపైన నిర్మితం అయ్యింది. ఈ బహుళతే దీని బలం అయినా, బలహీనత అయినా.
    1950 లలో కె ఎం మున్షీ The Call of Vedas అన్న పుస్తకం తెచ్చారు. అందులో వేద సాహిత్యం నుండి ఉన్న బహుళత ను అద్భుతంగా వివరించారు. పైన నేను చెప్పిన మాట ఆయనదే.
    నేను 1980 లలో ఆ పుస్తకం చదివి ఎంతో అద్భుతానికి లోనయినాను.*

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది డా. కాళిదాసు పురుషోత్తమ్ గారి స్పందన:*డాక్టర్ బేర్ నెల్లూరు అమెరికన్ ఆస్పత్రిలో 30 ఏళ్ళు నిస్వార్థంగా వైద్యం చేసి వృద్ధాప్యంలో స్వదేశానికి వెళ్ళేరు. ఎంతోమంది బ్రాహ్మణులు కూడా అక్కడ కాన్పులు చేయించుకున్నారు. ఎవరినీ మతం మార్చుకోమని కోరలేదు. ఇద్దరు నా శ్రీమతి బిడ్డల్ని అక్కడే ప్రసవించినది. నెల్లూరు ప్రజలు ఆమెను ఇప్పుడు కూడా గుర్తు చేసుకొంటారు.*

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది టి. వి. సుబ్రహ్మణ్యం గారి స్పందన:*ఒకప్పుడు హిందూ దేవాలయాలు పెద్ద ఆర్ధిక వ్యవస్థలా పనిచేసేవి .పెద్ద దేవాలయాలు, మఠాలు, పీఠాలు, తీర్థక్షేత్రాలు ఆ ప్రాంత ప్రజల సామాజిక, ఆర్థిక, విద్యా, సాంస్కృతిక జీవితాలకు కేంద్ర బిందువులుగా ఉండేవి. పూజలు, ఉత్సవాలు మాత్రమే కాకుండా విద్య, వైద్యం, అన్నదానం, కళలు, వ్యవసాయం, నీటి నిర్వహణ, ఉపాధి, వాణిజ్యం వంటి అనేక వ్యవస్థలను దేవాలయాలే నిర్వహించేవి. ప్రాచీన భారతదేశంలో దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలుగా కాకుండా సమాజాన్ని నడిపించిన సమగ్ర నాగరికతా వ్యవస్థలుగా పనిచేశాయి. నెమ్మది నెమ్మదిగా దేవాలయాల ఆస్తులు, భూములు ప్రభుత్వాలు స్వాధీనం చేసుకున్నాయి. అనేక దేవాలయాల భూములను రాజకీయ నాయకులు వారి దళారులు కబ్జాలు చేసి వాటిని దివాళా తీయించారు. చివరికి అవి కేవలం పూజలు జరిపే స్థలాలుగా మిగిలిపోయాయి. భక్తులు వేసే చిల్లరకి ఎదురుచూసే స్థాయికి పూజారులను దిగజార్జారు. లేకపోతే ఈ చర్చిలు ఇటు కన్నెత్తి చూడలేకపోయేవి.*

    Reply
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది కెఎస్సార్ శాస్త్రి గారి స్పందన: *మత గ్రంథాలలో రెచ్చగొట్టబడుతూ రాసిన వ్యాఖ్యలను మీరు వెలికి తీసి చూపించడం బాగుంది.*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®