అ అక్షరం
అమ్మ లాంటిది
అంతు లేని
అనురాగం
అభిమానం
అందిస్తుంది
అ అక్షరం
అనంతం
అద్వితీయం
అపురూపం
అక్షయం
అ ని దాటి ముందుకు వెళ్తే
ఆకలి
ఇక్కట్లు
ఈర్ష్య
ఉసురు
ఊడిగం
ఎగతాళి
ఏడుపు
ఐతే గియితే
ఓటమి వస్తాయి
అ దాటి ముందుకు వెళ్ళి
నీ ఆక్రందన వినిపిస్తే
ఎనిమిది చెవుల బ్రహ్మకి
బ్రహ్మ చెవుడు వస్తుంది
అక్షరమాలంతా వద్దు
అ దగ్గరే ఆగిపో
అ వర్ణమే అర్ణవము
అంతు లేని ఆనందానికి
అది ఒక సంకేతము.

భావుకుడు, కవి శంకరప్రసాద్. ఇప్పుడిప్పుడే తన కవితలతో, కథలతో సాహిత్య ప్రపంచంలోకి అడుగిడుతున్నాడు.