సంచిక పాఠకులకు తోట సాంబశివరావు చిరపరిచితమైన రచయిత. తన రచనలతో సంచిక పాఠకులను అలరిస్తున్న తోట సాంబశివరావు రచించిన డైరక్ట్ నవల ‘ఆశయం’.
తాను పుట్టి పెరిగిన గ్రామానికి ఏదో ఒకటి చేసి ఋణం తీర్చుకోవాలనుకునే సంకల్పంతో అమెరికాలో నివసించే సదానంద్ పడిన తాపత్రయమే ఈ ‘ఆశయం’ నవల ప్రధానాంశం.
“తోట సాంబశివరావు గారి ‘ఆశయం’ నవల దేశం రూపురేఖలు మార్చేలా సుసంపన్నంగా గ్రామీణ భారతాన్ని తీర్చిదిద్దాలన్న సందేశాన్ని బలంగా వినిపించింది” అని ముందుమాటలో సీనియర్ పాత్రికేయులు అమిర్నేని హరికృష్ణ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.
“కేవలం మాటలతో కాకుండా, చేతలతో అభివృద్ధి ఎలా చెయ్యాలో అనే విషయాన్ని కూలంకుషంగా విపులంగా రాసిన ఈ రచయిత అవగాహనను అభినందించాలి. ఈ ‘ఆశయం’ కొందరికయినా వారి ఆశయ సిద్ధికి ఉపయోగించగలని ఆశిస్తున్నాను” అని సినీ దర్శకులు ముత్యాల సుబ్బయ్య అన్నారు.
“ఈ చిన్ని పుస్తకం… ప్రస్తుతం గ్రామాల్లో వున్న రుగ్మతలకు ఓ సంజీవని అని చెప్పలేను కాని, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయాలనుకునే వారికి, నిస్సందేహంగా ఓ దిక్సూచిలా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను” అని ‘నా మాట’లో రచయిత ఆశాభావాన్ని వ్యక్తపరిచారు.
ఆరంభం నుంచి చివరి వరకూ ఆసక్తికరంగా సాగి, విడవకుండా చదివింపచేస్తుందీ నవల. మంచి నవలలు చదవాలనుకునేవారు తప్పకుండా చదవాల్సిన నవల ఇది.
***


ఆశయం (నవల)
రచన: తోట సాంబశివరావు
పేజీలు:96
వెల: ₹ 80/-
ప్రచురణ: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
ప్రతులకు
విశాలాంధ్ర బుక్ హౌస్ అన్ని శాఖలు
7 Comments
డా కె.ఎల్.వి.ప్రసాద్
ఆశయం..నవల సంక్షిప్త
అక్షర చిత్రాన్ని
అందించిన
సంచిక బృందానికీ
అభినందన లు.
సాంబ శివ రావు గారికి
శుభాకాంక్షలు.
Sambasivarao Thota
Prasad Garu!
Thanks Andi
Sambasivarao Thota
Ee roju Naa Aashayam novel pai Review prachurinchinanduku ,Sanchika Team andariki naa hrudayapoorvaka Dhanyavaadaalu


Jhansi koppisetty
సాంబశివరావు గారి నవల ‘ఆశయం’ సంక్షిప్త పరిచయం నవల చదవాలనే ఆసక్తిని కలిగిస్తూ బావుంది. వారికి నా హృదయ పూర్వక అభినందనలు


Sambasivarao Thota
Thanks Andi Jhansi Garu
P. Nagalingeswara Rao
ఆశయం నవల యొక్క పరిచయం చదివిన తరువాత మీరు వ్రాసిన నవల చాలాబాగుంటుంది అనే అభిప్రాయం కలుగుతుంది. మంచి నవలను పరిచయం చేసిన సంచిక యాజమాన్యానికి మీకు ధన్యావాదాలు.
Sambasivarao Thota
Thanks Andi NagaLingeswaraRao Garu