[డా.టి.రాధాకృష్ణమాచార్యులు రచించిన ‘అద్దంలో బొమ్మ’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]


దుఃఖమైనా మరి సంతోషమైనా
చీకటి వెలుగుల కవిత్వం
పోషించే పాత్రలు మనిషిలో ఎన్నో
నవ్వులన్నీ పువ్వుల గుబాళింపు
బాధలన్నీ వెతల పోహళింపు
అద్దంలో భావోద్వేగాల కన్నీళ్లు
అద్దంలో బొమ్మ నిజమేనా
ఔనో కాదో తేల్చేది
అద్దం ముందుండే నిజ రూపమే కదూ
మనసున్నా లేకున్నా అద్దంలో అందం
చొరవున్న చెట్టూ పుట్టా రాయి
కదిలీ కదిలించే కవలలు
ఒక మనిషి బొమ్మలు రెండు
అద్దం ముందర నిజం అద్దంలో
నీవైనా నేనైనా వస్తువైనా దృశ్య ప్రతిబింబం

డా.టి.రాధాకృష్ణమాచార్యులు సీనియర్ వైద్యులు, ప్రముఖ కవి,రచయిత, అనువాదకులు, సమీక్షకులు.
5 సంకలనాలు తెలుగు కవిత్వంలో 1999 నుండి కరీంనగర్ నుండి పబ్లిష్ చేశారు. నలిమెల భాస్కర్ ‘సాహితీ సుమాలు’ వివిధ భారతీయ భాషల్లోని సాహితీవేత్తల పరిచయ సంకలనాన్ని “The Speaking Roots” Title తో ఆంగ్లంలోకి అనువాదం చేసినారు.
1 Comments
డా కె.ఎల్.వి.ప్రసాద్
అద్దం ముందు అంతా బాహ్యస్వరూపమే!
అసలు స్వరూపం చూపించడం లో….అద్దానిది
నిస్సహాయత.
అద్దం ముందు అందరిదీ అదే పరిస్టితి.
బాగా రాసారు.
శుభాకాంక్షలు మీకు
—డా.కె.ఎల్.వి.ప్రసాద్.