సంచికలో తాజాగా

డా. మునగా రామ మోహన రావు Articles 1

డా. మునగా రామ మోహన రావు ఏలూరుకు చెందిన ప్రముఖ విద్యావేత్త, కార్పొరేట్ నాయకుడు, కవి మరియు సేవామూర్తి. వృత్తిపరంగా అత్యున్నత శిఖరాలను అధిరోహించిన వీరు, సామాజిక శ్రేయస్సుకై, సాహిత్య సంస్కృతుల వికాసానికై విశేష కృషి చేస్తున్నారు. ఎం.ఎస్సి, ఎం.బి.ఏ, ఎం.కామ్, ఎం.ఏ పట్టాలతో పాటు కార్పొరేట్ ఫైనాన్స్‌లో పీహెచ్‌డీ, నాలెడ్జ్ మేనేజ్‌మెంట్‌లో డి.లిట్ సాధించారు. హార్వర్డ్, ఎం.ఐ.టి వంటి ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల నుండి సర్టిఫికేషన్లు పొందారు. సి.ఎస్.ఐ.ఆర్ రీసెర్చ్ ఫెలోగా, ఐ.ఎఫ్.ఎమ్.ఆర్ మరియు లోయోలా విద్యా సంస్థలలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా సేవలందించారు. మూడు దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానంలో స్వదేశీ, విదేశీ బహుళజాతి సంస్థలలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా అత్యున్నత బాధ్యతలను విజయవంతంగా నిర్వహించారు. సికింద్రాబాద్‌లో సుమారు మూడు కోట్ల రూపాయల తన స్వార్జితంతో 2,000 మంది నిరుపేద బాలికల విద్యావకాశాల కోసం అధునాతన భవంతిని నిర్మించి దానం చేశారు. వీరి నిరంతర సేవలను గుర్తిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆ కళాశాలకు "డా. మునగా రామ మోహన రావు ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాల" గా నామకరణం చేసి గౌరవించింది. విద్యా, ఆధ్యాత్మిక రంగాలలో వీరు నిరంతరం సేవలందిస్తున్నారు. సాహిత్యంతో పాటు సాంప్రదాయ తంజావూరు చిత్రకళలో వీరు సిద్ధహస్తులు. వీరి తాత్విక రచన ‘మర్మజ్ఞవిలాసం’ సాహిత్య అకాడమీ పరిశీలనలో ఉంది. ప్రకృతి, మానవ సంబంధాలు, ఆధ్యాత్మికతను ప్రతిబింబించే ‘అంతర్యానం’ వీరి తొలి తెలుగు వచన కవితా సంపుటి. వీరి ఆంగ్ల కవితా ప్రతిభకు గాను పనోరమా ఇంటర్నేషనల్ లిటరరీ అవార్డు (2026,) ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ ఎథిక్స్ ఫెలోషిప్ లభించాయి.

All rights reserved - Sanchika®