సంచికలో తాజాగా

జి.ఎస్.ఎస్. కళ్యాణి Articles 6

ఆంధ్ర ప్రదేశ్ లోని మచిలీపట్నంలో జన్మించిన జి.ఎస్.ఎస్. కళ్యాణి హైదరాబాద్‌లో పెరిగారు. ప్రస్తుత నివాసం అమెరికా. వీరి బాల్యమంతా ‘చందమామ’ కథలు చదువుతూ, అమ్మా, నాన్నా, అమ్మమ్మలు చెప్పిన కథలు వింటూ గడిచింది. తల్లిదండ్రులకు కర్ణాటక సంగీతమన్నా, తెలుగు సాహిత్యమన్నా ఎంతో ఇష్టం ఉండడం వల్ల కళ్యాణి గారికి కూడా సంగీత సాహిత్యాలపట్ల అభిమానం ఏర్పడింది. వీరి మొదటి రచన టీటీడీ వారి 'సప్తగిరి' మాస పత్రికలో ప్రచురితమయింది. 2018వ సంవత్సరంలో ‘తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ శాక్రమెంటో (TAGS)’ వారు నిర్వహించిన ‘శ్రీ UAN మూర్తి మెమోరియల్ రచనల పోటీ’లో వీరి మొట్టమొదటి కథ 'సంక్రాంతి సంబరం - ఒక మధుర జ్ఞాపకం' కన్సోలేషన్ బహుమతిని గెలుచుకుంది. ఆ తరువాత వీరు రాసిన కథలు పలు వెబ్-పత్రికలలోనూ మరియు ప్రముఖ ఆధ్యాత్మిక పత్రిక 'భారత ఋషిపీఠం'లోనూ ప్రచురితమయ్యాయి. వీరు ఇంతవరకూ రాసిన కొన్ని కథలు ‘కదంబవన కుసుమాలు’ అన్న పేరుతో మూడు కథాసంపుటాలుగా ప్రచురించడం జరిగింది.

All rights reserved - Sanchika™

error: Content is protected !!