కాటూరు రవీంద్ర త్రివిక్రమ్ ప్రసిద్ధ సాహితీవేత్త. 1955 నుండీ తమ సాహిత్య ప్రస్థానం కొనసాగిస్తున్నారు. కథానిక, నాటిక, నాటకం, నవలిక, నవల, గీతాలు, హరికథలు వగైరా సాహిత్య ప్రక్రియల్లో విశేష కృషిసల్పారు. 600లకు పైగా కథానికలు ప్రచురితమయ్యాయి. ఆకాశవాణిలో నూరుకి పైగా నాటిక/నాటకాలు ప్రసారమయ్యాయి. ఆకాశవాణిలో జాతీయస్థాయిలో 'జురాహమ' హాస్యనాటకానికి ప్రథమ బహుమతి లభించింది. అనేక కథానికలకు బహుమతులు లభించాయి. దూరదర్శన్‌లో ప్రగతి భారతం సీరియల్, గ్రీష్మం, అమ్మలగన్నయమ్మా డాక్యుమెంటరీలు, అంతర్నేత్రం' ఆధ్యాత్మిక ప్రవచనాలు, నాటికలు, ప్రసంగాలు, స్వీయ జీవన రేఖలు ప్రసారమయ్యాయి. ప్రముఖ పత్రికలలో లీగల్ కాలమ్స్ నిర్వహించారు. మరెన్నో సంస్థలకు న్యాయ సలహాదారు. 16 సంవత్సరాలు భారతీయ వైమానిక దళంలో పనిచేసి రెండు యుద్ధాల్లో పాల్గొన్నారు. 20 సంవత్సరాలు పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో సేవలందించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లాయరుగా జీవిత సభ్యులు.
‘దేవుడి చిరునామా’ పేరులోనే కాదు, కథనం నాటకీయతల్లో కూడా ప్రత్యేకతలు కలిగి ఉంది. రేడియో నాటికలు ఎలా రాస్తారో తెలుసుకోదల్చిన వారికిది పరిశీలనాత్మక రచన. Read more
All rights reserved - Sanchika™