సంచికలో తాజాగా

డా. శ్రీమతి పుట్టపర్తి నాగపద్మిని Articles 21

డా.పుట్టపర్తి నాగపద్మిని, 'సరస్వతీపుత్ర' పుట్టపర్తి దంపతుల చతుర్థ పుత్రిక. విద్యాపరంగా హిందీ లో పీ.హెచ్ డీ, తెలుగు ఎం.ఏ. నాలుగైదు డిప్లొమోలు ఇప్పుడు, ఇప్పుడు సంస్కృతం ఎం.ఏ. చదువుతున్నారు. వారి అయ్య గారి స్ఫూర్తితో, సాహితీ వ్యాసంగం చేపట్టినప్పటినుంచీ, ఇప్పటిదాకా పద్య, వచన కవిత, నవల, కథ, గేయ, అనువాద ప్రక్రియల్లో ఇప్పటిదాకా అర్థ శతం దాకా ప్రచురితాలు. ప్రతిష్టాత్మక తెలుగు విశ్వవిద్యాలయ ఉత్తమ అనువాద పురస్కారం, గోయెంకా జాతీయ ఉత్తమ అనువాద పురస్కారం, తమిళనాడు హిందీ అకాడమీ పురస్కారం, బిహార్ సాహిత్య సమ్మేళన్ విశిష్ట రచయిత్రి పురస్కారం అందుకున్నారు. విక్రం శిలా విద్యాపీఠ్ ద్వారా విద్యావాచస్పతి,అఖిల భారత భాషా సాహిత్య సమ్మేళన్ భోపాల్ వారిచే భారత్ భాషా భూషణ్ బిరుదులు వరించాయి. గత 20 సంవత్సరాలుగా తిరుమల వేంకటేశుని బ్రహ్మోత్సవాల్లో ప్రత్యక్ష ప్రసార వ్యాఖ్యతగా వాక్సేవలందించటం, తమ అయ్యగారి శివతాండవాన్ని హిందీ లోకి అనువదించి పలువురు హిందీ సాహితీవేత్తల ప్రశంసలు అందుకోవటం మరపురాని అనుభుతులంటున్నారు. సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్ నుండి 2021- 2023, వరకు ప్రతిష్ఠాత్మక సీనియర్ ఫెలోషిప్ పొంది, 'పుట్టపర్తి రచనల్లో భారతీయ సంస్కృతి' అన్న పరిశోధన గ్రంథాన్ని సమర్పించారు. ఈ హిందీ నవల చదవగానే ఇతివృత్తం అద్భుతంగా తోచి అనువాదం చేపట్టి, ఎంతో ఇష్టంగా దీక్షతో చేశాననీ, తెలుగు పత్రికా రంగ క్షేత్రంలో తనదైన ప్రత్యేక ముద్ర కలిగిన సంచిక పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవటం, చాలా హర్షదాయకమని పేర్కొంటూ, సంపాదకులకు తన ధన్యవాదాలు తెలియజేశారు.

All rights reserved - Sanchika®

error: Content is protected !!